8, నవంబర్ 2016, మంగళవారం

జ్యోతిష శాస్త్ర చిట్కాలు (Techniques In Astrology)



జ్యోతిష శాస్త్ర చిట్కాలు 

జన్మలగ్నం చరరాశియై లగ్న భాగ్యాధిపతులు చరరాశిలో ఉంటే జాతకుడు తండ్రిని విడిచి చాలా దూరప్రదేశాలకు పోవును. 

చతుర్ధమున శని, దశమమున చంద్రుడు సప్తమమున కుజుడు ఉంటే అంగవైకల్యం కలుగుతుంది.
లగ్న యమకంఠక స్ఫుటములను ఏకం చేయగా వచ్చు రాశి, నవాంశలు మిధున, సింహం, తుల, వృశ్చిక, కుంబ రాశులలో  పడి శుభగ్రహ సంబంధం ఉంటే సంతానం చిన్న వయస్సులోనే కలుగుతుంది. ఈ స్ఫుటమునకు శని సంబంధముంటే సంతానం ఆలస్యమవుతుంది. ఈ స్ఫుటమునకు శని, రాహువుల సంబంధముంటే సంతానం కొరకు చాలా ప్రయత్నములు చేసి చివరకు దత్తత గాని వేరే పిల్లలను పెంచుకోవటం గాని జరగచ్చు. 


లగ్న, యమకంఠక స్ఫుటములు మేష, వృషభ, కర్కాటక, ధనస్సు, మకర రాశులలో పడి పాపగ్రహ సంబంధం కలిగితే సంతానం కలగటం కష్టం. అయితే ఈ స్ఫుటం మేష, ధనస్సు రాశులలో పడి పాపగ్రహ సంభందం లేని పురుష నవాంశ అయితే సంతానం కలుగుతుంది.  ఈ స్ఫుటం కన్యారాశిలో పడి శని, బుధుల దృష్టి గాని, సంబంధం గాని ఉన్న పిల్లలను దత్తత తీసుకోవటం జరుగుతుంది. 

జాతకచక్రంలో రవి ఉన్న నక్షత్రం నుండి ముందు, వెనుక ఉన్న నక్షత్రాలలో జన్మించిన జాతకులు ఎప్పుడూ ఏదో విధమైన భయం, ఆందోళన పడుతుంటారు.

సింహం కారకాంశ లగ్నమైన, మీనం కారకాంశ లగ్నమైన సంగీతం, పాటలు పాడటంలో పట్టు సాధిస్తారు. 

కారకాంశ నుండి కర్కాటకం, వృశ్చికం, మీనా రాశులు ద్వితీయంలో ఉంటూ శని ఉంటే మూగవాడగును. 

సప్తమాధిపతి నుండి ద్వితీయంలో రాహువు ఉన్న, కారకాంశ లగ్నం నుండి గాని, లగ్నం నుండి గాని ద్వితీయంలో రాహువు ఉండి శని సంబంధం ఉంటే దంత సమస్యలు ఉంటాయి. 

కారకాంశ లగ్నం నుండి గాని, లగ్నం నుండి గాని ద్వితీయంలో కేతువు ఉంటే వాక్శుద్ధిలో లోపం ఉంటుంది.  

1 కామెంట్‌:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...