జాతకచక్రంలో
ఆయుర్ధాయ విషయాలను PAM Theory ద్వారా తెలుసుకోవచ్చును.ఒక వ్యక్తి ఆయుర్ధాయాన్ని
నిర్ణయించటానికి అనేక పద్దతులు ఉన్నాయి.అందులో ఈ “PAM Theory “అనేది ఒక పద్దతి.అయితే ప్రామాణిక జ్యోతిష్య గ్రంధాలను అనుసరించి 12 సంవత్సరాల
వయస్సు దాటే వరకు ఆయుర్ధాయ నిర్ణయం చేయటం కష్ట సాద్యము.దీనికి కారణం అప్పుడే పుట్టిన
శిశువు యొక్క ఆయుర్ధాయం తల్లిదండ్రులు చేసే కర్మలపై ఆధారపడి ఉంటుంది.కాబట్టి శిశువు యొక్క ఆయుర్ధాయ విషయాలు 12 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు చేసే కర్మలపై ఆదారపడి ఉంటుంది.అయితే జ్యోతిష్యులు
జాతకుడికి ఆయుర్ధాయ విషయాలను తెలియజేయరాదు.అలా తెలియజేసిన ఆ జాతకుడు మానసిక వ్యదకు
లోనై తీవ్ర మనోవ్యదను అనుభవిస్తారు.
పూర్ణాయుర్ధాయం
అనగా 75 సంవత్సరాల నుండి 120 సంవత్సరాల మద్య జీవించటం.మద్యాయుర్ధాయం అనగా 32 సంవత్సరాల
నుండి 75 సంవత్సరాల మద్య జీవించటం,అల్పాయుర్ధాయం అనగా 8 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మద్య జీవించటం.
చరరాశి
(పూర్ణాయుర్ధాయం) P
స్థిరరాశి
(అల్పాయుర్ధాయం) A
ద్విస్వభావరాశి
(మధ్యాయుర్ధాయం) M
Part :-1
లగ్నాదిపతి
చర,స్ధిర,ద్విస్వభావ రాశిలో ఉన్నాడో
చూడాలి.
అష్టమాదిపతి
చర,స్ధిర,ద్విస్వభావ రాశిలో ఉన్నాడో చూడాలి.
రెండు
చర రాశి వస్తే “P” (పూర్ణాయుర్ధాయం) అని,రెండు స్ధిర రాశి వస్తే “A” (అల్పాయుర్ధాయం) అని,రెండు ద్విస్వభావరాశి
అయితే “M” (మధ్యాయుర్ధాయం) అని,రెండు వేరు వేరుగా
వస్తే “M” (మధ్యాయుర్ధాయం) అని రాయాలి.
Part :- 2
లగ్నం
ఉన్న రాశి చర,స్ధిర,ద్విస్వభావ
రాశి చూడాలి.
చంద్రుడు
ఉన్న రాశి చర,స్ధిర,ద్విస్వభావ రాశి చూడాలి.
రెండు
చర రాశి వస్తే “P” (పూర్ణాయుర్ధాయం) అని,రెండు స్ధిర రాశి వస్తే “A” (అల్పాయుర్ధాయం) అని,రెండు ద్విస్వభావరాశి
అయితే “M” (మధ్యాయుర్ధాయం) అని,రెండు
వేరు వేరుగా వస్తే “M” (మధ్యాయుర్ధాయం) అని రాయాలి.
Part :- 3
లగ్నం
ఉన్న రాశి చర,స్ధిర,ద్విస్వభావ
రాశి చూడాలి.
హోరా
లగ్నం ఉన్న రాశి చర,స్ధిర,ద్విస్వభావ
రాశి చూడాలి.
రెండు
చర రాశి వస్తే “P” (పూర్ణాయుర్ధాయం) అని,రెండు స్ధిర రాశి వస్తే “A” (అల్పాయుర్ధాయం) అని,రెండు ద్విస్వభావరాశి అయితే “M” (మధ్యాయుర్ధాయం) అని,రెండు వేరు వేరుగా వస్తే “M” (మధ్యాయుర్ధాయం) అని
రాయాలి.
ఈ
మూడు పార్ట్ లలో వచ్చిన ఫలితాన్ని తీసుకొని అందులో రెండు “P” (పూర్ణాయుర్ధాయం)
గాని రెండు “A” (అల్పాయుర్ధాయం) గాని,రెండు
“M” (మధ్యాయుర్ధాయం)
గాని వచ్చిన దానిని తీసుకోవలెను.
ఉదాహరణకు
ఈ జాతకచక్రాన్ని పరిశీలిద్దాం.
Part :- 1
ఈ
జాతకచక్రంలో లగ్నాదిపతి బుదుడు కన్యారాశిలో ఉన్నాడు కన్యారాశి ద్విస్వభావరాశి “M”మద్యాయుర్ధాయం.
ఈ
జాతకచక్రంలో అష్టమాదిపతి కుజుడు తులారాశిలో ఉన్నాడు.తులారాశి చరరాశి “P” పూర్ణాయుర్ధాయం.
రెండు
వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి “M” మద్యాయుర్ధాయం.Part:-1 “M” మద్యాయుర్ధాయం.
Part:- 2
ఈ
జాతకచక్రంలో లగ్నం ఉన్న రాశి కన్యాలగ్నం.కన్యాలగ్నం ద్విస్వభావరాశి “M”మద్యాయుర్ధాయం.
ఈ
జాతకచక్రంలో చంద్రుడు ఉన్నరాశి తులారాశి.తులారాశి చరరాశి “P” పూర్ణాయుర్ధాయం.
రెండు
వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి “M” మద్యాయుర్ధాయం.Part:-2 “M” మద్యాయుర్ధాయం.
Part:- 3
ఈ
జాతకచక్రంలో లగ్నం ఉన్న రాశి కన్యాలగ్నం.కన్యాలగ్నం ద్విస్వభావరాశి “M”మద్యాయుర్ధాయం.
ఈ
జాతకచక్రంలో హోరాలగ్నం ఉన్నరాశి సింహరాశి,సింహరాశి స్ధిరరాశి “A” అల్పాయుర్ధాయం.
రెండు
వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి “M” మద్యాయుర్ధాయం.Part:-2 “M” మద్యాయుర్ధాయం.
ఈ
మూడు Part లలో “M” మద్యాయుర్ధాయం వచ్చినందువల్ల ఈ జాతకుడికి
మద్యాయుర్ధాయంగా గుర్తించవచ్చును.
గమనిక:-మా
శ్రీ సాయి జ్యోతిష్య కేంద్రం నందు ఆయుర్ధాయ విషయాలు తెలియజేయబడవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి