5, మే 2015, మంగళవారం

నవరత్నాలు

జ్యోతిష్య నవరత్నాలు

నవరత్నాలు అనేవి భూసంపద, జలసంపదల నుండి ఉద్భవిస్తాయి. భూమిలో పై పొర సుమారు 60 మైళ్లు ఉంటుంది. ఈ నాటికి భూమిలోనికి తవ్వగలిగిన గరిష్ఠదూరం 5 కి||మీ మాత్రమే. భూమిలోనికి వెళ్లిన కొలది ఉష్ణోగ్రత పెరుగుతూ, ప్రతి 120 అడుగులకు 1 డిగ్రీ చొప్పున పెరుగుతుంది. ఇలా 30 మైళ్ల లోతులో 1200 డిగ్రీ సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ అంతా ద్రవరూపంలో ఉంటుంది. అలా భూమిలోనికి వెళ్లినకొలది అనేక ఖనిజాలూ, రత్నాలూ ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.



'స్వాతి ముత్యం' అంటే, స్వాతి కార్తెలో, అంటే సూర్యుడు స్వాతి నక్షత్రంలో సంచరించే కాలంలో, ముడుచుకొని ఉన్న ముత్యపు చిప్పలు తెరచుకుంటాయి. ఆ సమయంలో వర్షం ఆ చిప్పలలో చుక్కలుగా పడిన తర్వాత అవి ముడుచుకొంటాయి. ఇవి లోపల ఘనీభవించి ముత్యాలుగా ఏర్పడతాయి. వీటినే స్వాతి ముత్యాలంటారు.

రత్నధారణజ్యోతిషశాస్త్రాల అవినాభావసంబంధం: రత్నధారణ అనేది పూర్వకాలం నుండి జ్యోతిషశాస్త్రంతో ముడిపడి ఉంది. మానవశరీరంలో సప్తధాతువులు ఉంటాయి. అవి చర్మం, నాడులు, కొవ్వు, మాంసం, అస్థులు (ఎముకలు), ఉపస్థు, స్నాయువులు (సన్నని నరాలు). ఈ సప్తధాతువులకూ, సప్తవర్ణాలకూ, ప్రతి నిధులైన గ్రహాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. చర్మానికి శుక్రుడు, నాడీ మండలానికి బుధుడు, కొవ్వుకు గురుడు, మాంసానికి కుజుడు, ఎముకలకు శని, ఉపస్థుకు శుక్ర-కుజులు, స్నాయువుకు రవి-చం ద్రులు కారకులుగా నిర్ణయింపబడ్డారు. వ్యక్తికి ఏయే ధాతువులు క్షీణదశ వైపు పయనిస్తుంటాయో, వాటికి సమతుల్యత ఏర్పరచి, శారీరక-మానసికశక్తులను అభివృద్ధి పరుస్తాయి. జాతిరత్నాలలో 'దైవికశక్తులు' దాగుంటాయని మన పూర్వికులు నిర్దేశించారు.

రవి (కెంపు) (మాణిక్యం):- సమర్థప్రభువు. ఇది ధరించినవారికి ఆయుర్వృద్ధి, ధనలాభం, అధికారం, ఉన్నతస్థితి, రోగనివారణ, మనోవికాసం కలుగుతాయి. ఇది ఎరుపు రంగుతో బాలసూర్యుని వలె ప్రకాశిస్తుంటుంది. ధాన్యం, గోధుమలు, శుద్ధికి ఆవు పాలు, గంగాజలం, మంత్రం ఓం దృణిః సూర్యాయ నమః||

చంద్రుడు ('ముత్యం') (మౌక్తికం):- గుణం రాణి. ఇది ధరించిన వారికీ, వివాహం కానివారికీ త్వరలో వివాహం జరగటం, కుటుంబ, దాంపత్యానుకూలత, స్త్రీసౌఖ్యం, కార్యసిద్ధి, సంపదలు, ధనధాన్యవృద్ధి, మేహశాంతి కలుగుతాయి. గుండె జబ్బు రాదు. స్త్రీల పాలిట కామధేనువు వంటిది. ముత్యాలు తెల్లగా, స్వయంగా మెరుస్తుంటాయి. ధాన్యంబియ్యం, శుద్ధికి సైంధవ లవణం, వరిపొట్టు (ధాన్యం పొట్టు). మంత్రం ఓం సోం సోమాయ నమః||

కుజుడు(పగడం)-ప్రవాళం:- గుణం సేనానాయకుడు, ఉద్యమనాయకుడు. ఇది ధరించినవారికి శత్రుసంహారం, సాహసం, ధైర్యం చేకూరుతాయి. బుుణవిమోచనం, అధికారం, మాట చలాయింపు కలుగుతాయి. ఇది చిలుక ముక్కు రంగునూ, దొండ పండు రంగునూ పోలి ఉంటుంది. ధాన్యంకందులు. శుద్ధికి ఆవు పాలు, కంకుమ నీరు, రక్తచందనం నీరు. మంత్రం ఓం అం అంగారకాయ నమః||

బుధుడు(పచ్చ) (మరకతం-ఎమరాల్డ్‌):- గుణం తన వ్యాపారాలు తాను చూసుకునే తెలివైనవాడు. ఇది ధరించినవారికి జ్ఞాపకశక్తి, బుద్ధి చాతుర్యం కలిగి, నరాల ఒత్తిడి తగ్గుతుంది. విషదోషాలు హరిస్తుంది. ఉన్మాదం, పిచ్చి, దృష్టిదోషాలను పోగొడుతుంది. ఇది నెమలి పింఛం, గరిక చిగుళ్ల రంగులలో ఉండును. శుద్ధికి ఆవు మజ్జిగ, గోమూత్రం, పసుపు నీరు. ధాన్యంపెసలు. మంత్రం ఓం భుం బుధాయ నమః||

గురువు( 'పుష్యరాగం' )(టోపాజ్‌). గుణం తన మేధాశక్తితో ఇతరులకు మేలు చేసే ఆదర్శవాది. ఇది ధరించినవారికి బుుణవిమోచనం, శత్రుజయం, ఉద్రేకం, ఆందోళన, తగ్గడం, పుత్రసంతానం, వంశవృద్ధి కలుగుతాయి. దీని రంగు బంగారు. లేత గులాబీ రంగులో ఉంటాయి. ధాన్యంసెనగలు శుద్ధికి ఉలువల గంజి, సెనగలు, ఉడికించిన నీరు. మంత్రం ఓం బృహస్పతయ నమః||

శుక్రుడు(వజ్రం) (డైమండ్‌):- గుణం తన మేధాశక్తితో తాను వృద్ధి చెందేవాడు. ఇది ధరించినవారికి నూతనతేజస్సు, కళ, ధన ధాన్యసంపదలు సంసారజీవితంలో అనుకూలత, సుఖం, స్త్రీలకు సుఖప్రసవం కలుగుతాయి. కలరా, ప్లేగు వ్యాధులు రావు. ఇది సహజమైన కాంతితో తేలికగానూ. తీర్చిన కోణాలతోనూ అందంగా కనిపిస్తుంది. ధాన్యంబొబ్బర్లు. శుద్ధికి ఆవు పాలు, బియ్యం కడిగిన నీరు, బొబ్బర్లు ఉడికించిన నీరు, మంత్రం ఓం శుం శుక్రాయనమః||

శని (నీలం) (సఫైర్‌) గుణం ఇతరుల ఆలోచనను ఆచరణలో పెట్టేవాడు. ఇది ధరించినవారికి అపమృత్యు దోషాలు పోవటం, సంఘంలో గౌరవం, పలుకుబడి, ధనలాభం కలుగుతాయి. శని దోషాలు యావత్తూ తొలగును. ఇవి 3 రకాలు 1. ఇంద్రనీలం, 2. మహానీలం, 3. నీలమణి. ఇది నల్లని రంగు, నీలి ఆకాశం రంగు, నెమలి కంఠం రంగులతో ఉంటుంది. ధాన్యంనల్ల నువ్వులు, శుద్ధికి నల్ల నువ్వుల నూనె, నీలిచెట్టు ఆకుల రసం, నల్ల ద్రాక్ష రసం. మంత్రం ఓం శం శనైశ్చరాయనమః||

రాహువు(గోమేదికం) గుణం ఆశాపరుడు, ఇది ధరించినవారికి నష్టద్రవ్యలాభం, స్త్రీమూలంగా సహాయం, లాభం, వశీకరణ కలుగుతాయి, ఆవేదన తగ్గుతుంది. ఈ రాయి సహజమైన గోమూత్రవర్ణం కలిగి ప్రకాశిస్తూ వుంటుంది. ధాన్యంమినుములు, శుద్ధికి మాదీఫలరసం, తేనే, గోమూత్రం. మంత్రం ఓం ఐం హ్రీం రాహవే నమః||

కేతువు(వైడూర్యం) (కాట్స్‌ ఐ) గుణం నిరాశాపరుడు. ఇది ధరించినవారికి శత్రు బాధ నశించి, దుష్టగ్రహపీడలు తొలగుతాయి. ఉత్సాహం, యోచన, లాభం కలుగుతాయి. గర్భిణులు ధరిస్తే సుఖ ప్రసవం అవుతుంది. కష్టాల నుండి రక్షిస్తుంది. ఈ రాయి పై భాగం సన్నని నూలు దారంలా తిరుగుతుంది. వెలుతురులో పిల్లి కన్ను వలె ప్రకాశించును. ఇది లేత పచ్చ కలిసిన బూడిద వర్ణంతో ఉంటుంది. ధాన్యంఉలువలు. శుద్ధికి ఉలువలు ఉడికించిన గరికరస మిశ్రమం. మంత్రం ఓం ఐంహ్రీం కేతవే నమః||

పైన తెలిపిన విధంగా మంచి నాణ్యత కలిగినవాటిని ఉంగరంలో పొదిగించిన తర్వాత, అనుభవజ్ఞులతో శాస్త్రోక్తంగా నవగ్రహజపం చేయించి, పంచగశుద్ధి గల దినాలలో అన్నశాంతి చేసి, వర్జ్య, దుర్ముహూర్తాలు లేకుండా, తారాబలం చూసి, ఆది-గురు-శుక్రవారాలలో, వృషభ- మిథున-కన్య-ధనుర్మీనలగ్నాలలో ఉంగరపు వేలికి ధరించాలి.

నవరత్నపు ఉంగరాన్ని జాతకచక్రం ఉన్నవారు, లేనివారు అందరూ ధరింపవచ్చని శాస్త్రం చెబుతూంది.

నమస్కారం చేసేటపుడు ఉంగరంలోని నీలం పైకి (ఆకాశం) చూస్తున్నట్లుగా ధరించాలి.

ఒకటి, రెండు లేక మూడు విడి రత్నాలు ధరించాలనుకునేవారు, మాత్రం, జాతకచక్రం ఆధారంగా 1. 5. 9 స్థానాధిపతుల రత్నాలు ధరించాలి. స్త్రీలు ముక్కుపుడకలో వజ్రం ధరిస్తే, వారికి నరదృష్టి ఉండదు. వారి భర్తకు ఈమె లక్ష్మీప్రదంగా ఉంటుంది.

ప్రతి ఇల్లాలూ తన మంగళసూత్రంలో, నాణ్యమైన పగడం, ముత్యం ధరించాలి. కుటుంబసౌఖ్యం కలుగుతుంది. వాస్తువిషయంలో ఇంటి నలుదిక్కులలోనూ ఈ నవరత్నాలు నిక్షిప్తం చేస్తే, అందులో నివసించేవారికి అన్ని విధాలుగా రక్షణ ఇస్తుంది.

ఒకరు ధరించిన రత్నాలు ఇంకొకరు ధరించకూడదు.

ఇనుము, ఇత్తడి, కంచు, రాగి, సీసం, వెండి ఇవి దానం ఇవ్వడానికే తప్ప, జాతి రత్నాలు ధరించడానికి కాదు. స్తోమత లేనివారు వెండిలో కొంత బంగారం కలిపించి చేయించుకోవచ్చు. ఏకరత్నం జాతకరత్నం ధరించదలిస్తే, ఆ గ్రహసంబంధిత ఆకారంలో ధరిస్తే సత్ఫలితం. ఉదా|| కుజుడికి పగడం త్రిభుజాకారంలో ఉంగరం చేయించుకోవాలి. సమాజం నుండి లాభాలను కోరుకునేవారు కుడిచేతికి, ఆరోగ్యవిషయానికి ఎడమ చేతికీ, శక్తి కల్గినవారు రెండు చేతులకూ ధరింపవచ్చు. రత్నాలు దోషాలు లేని, ఆకృతి, ఆకారాలు కలిగి, స్వచ్ఛత, సాంద్రత, విమలత కలిగినప్పుడే సత్ఫలితాలు ఇస్తామని శాస్త్రం చెబుతున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...