26, మే 2015, మంగళవారం

నక్షత్రాలు అవయవముల విభజన

నక్షత్రాలు అవయవముల విభజన

జాతకచక్రంలో ఆయా నక్షత్రాలలో పాప గ్రహాలు ఉన్న,గ్రహాలు ఆయా నక్షత్రాలలో శుభత్వాన్ని కోల్పోయి,పాప గ్రహ వీక్షణ కలిగి పాప క్షేత్రాలలో ఉన్నప్పుడు ఆయా నక్షత్రాలకు సంబందించిన అవయవములకు చెందిన వ్యాదులు కలిగే అవకాశం ఉంది.నయం అయ్యే వ్యాదులు షష్టమ భావం ద్వారాను,నయం కాని వ్యాదులు అష్టమ భావం ద్వారాను,పంచమ భావానికి షష్టమ భావానికి సంబందం ఉంటే వ్యాది తొందరగా నయం అవుతుంది. అష్టమ భావానికి షష్టమ భావానికి సంబందం ఉంటే వ్యాది తొందరగా నయం కాదు.



1)మేషరాశి-తల,మెదడు

అశ్విని నక్షత్రం 4 పాదాలు:- తల,తలలోని పెద్ద మెదడులోని వెనుక భాగము.
భరణి నక్షత్రం 4 పాదాలు:- తల,తలలోని పెద్ద మెదడులోని ముందు భాగము.
కృత్తిక 1 వ పాదం:- మెదడు ,మెదడులోని రక్త నాళాలు కళ్ళు విశేషించి కుడి కన్ను,దృష్టి.

2)వృషభరాశి:-ముఖము నుండి మెడ వరకు.

కృత్తిక  2,3,4 పాదములు:-ముఖము,కుడిడికన్ను,కను రెప్పలు.
రోహిణి నక్షత్రం 4 పాదాలు :-కుడి కన్ను,నోరు,నాలుక,మెడ,చిన్న మెదడు,లాలా జలం.
మృగశిర నక్షత్రం 1,2 పాదాలు:-గొంతుక,స్వరపేటిక,టాన్సిల్స్.

3)మిధునరాశి:-మెడ నుండి ఛాతీ మద్య భాగం మరియు మెడ ఎముకలు.

మృగశిర నక్షత్రం 3,4 పాదాలు:-చెవులు,భుజములు,మెడ ,ముక్కు నుండి పోయే శ్వాస కోశములు,ముక్కు.
ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు:-చెవి లోపలి భాగాలు ,మోచేయి పై భాగం.
పునర్వసు నక్షత్రం 1,2,3 పాదాలు:-మెడ కింది భాగం,గొంతు కింద భాగం,ఆహార నాళిక ఆరంభ భాగం.

4)కర్కాటక రాశి:-ఛాతీ భాగం

పునర్వసు నక్షత్రం 4 వ పాదం:-ఛాతీ,ఊపిరితిత్తులు,స్తనములు.
పుష్యమి నక్షత్రం 4 పాదాలు:-రెండు ప్రక్కల రిబ్స్ అనబడే ఎముకలు,ఊపిరితిత్తులు,వాటిలోనికి వెళ్ళే గాలి గొట్టాలు.
ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు:-ఆహార నాళం,ఛాతీ కి సంబందించిన నరములు.

5)సింహరాశి:-బొడ్డుపైన ఉన్న కడుపు,గుండె

మఖ నక్షత్రం 4 పాదాలు:-గుండె,వీపు,వెన్నుముఖబొడ్డుపైన ఉన్న కడుపు లోపలి భాగములు కాలేయం,గాల్ బ్లాడర్.
పుబ్బ నక్షత్రం 4 పాదాలు:-గుండె లోపల గదులు,వెన్నుముక,వెన్నుముకకు సంబందించిన వాల్వులు.
ఉత్తర 1 వ పాదం:-గుండె పనిచేసే భాగాలు,వాల్వులుగుండే లోపలి రక్తం,గుండే నుండి ఊపిరితిత్తులకు  పోవు శ్వాస కోశం.

6)కన్యారాశి:-బొడ్డు కింద నున్న కడుపు భాగం

ఉత్తర నక్షత్రం2,3,4 పాదాలు:-లివర్,క్లోమమ్,కడుపు భాగం,బొడ్డు,చిన్న ప్రేవులు.
హస్త నక్షత్రం 4 పాదాలు:-రస గ్రంధులు,చిన్న ప్రేవులు.రసోత్పాదక క్రియలు.
చిత్తా నక్షత్రం 1,2 పాదాలు:-పెద్ద ప్రేవులు,పొత్తి కడుపు,ఎపిండెక్స్.

7)తులా రాశి:- మక్కలు,మూత్ర పిండాలు.

చిత్తా నక్షత్రం 2,3,పాదాలు:-మూత్ర పిండాలు,మక్కలలోని కండరాలు,గజ్జలు,వెన్ను వెనక భాగం నడుము.
స్వాతి నక్షత్రం 4 పాదాలు:-మూత్రకృచ్చం,మూత్ర నాళాలు,మూత్రం నందలి మలినాలు.
విశాఖ నక్షత్రం 1,2,3, పాదాలు;-మూత్ర కృచ్చం లోపలి భాగాలు.

8)వృశ్చిక రాశి :-బాహ్య జననేంద్రియాలు,గుదము.రెక్టమ్.

విశాఖ 4 వ పాదం:-వీర్యోత్పత్తికి సంబందించిన గ్లాండ్ గర్భాశయం,జననేంద్రియాలు.
అనురాధా నక్షత్రం 4 పాదాలు:-గుదము,రెక్టమ్,పొట్టి కడుపు.పెలోపియన్ నాళములు.
జ్యేష్ట నక్షత్రం 4 పాదాలు:-గర్భాశయం,దానికి సంబందించిన నరాలు,అండములు.

9)దనస్సు రాశి:మక్కల నుండి మోకాళ్ళ వరకు ఉన్న భాగములు.

మూల నక్షత్రం 4 పాదాలు:-మక్కలు,తొడలు,సియాటిక నరాలు.
పూర్వాషాడ నక్షత్రం 4 పాదాలు:-పిరుదులు,తొడల కింది భాగం,వెన్నుముక చివరి భాగం.
ఉత్తరాషాడ నక్షత్రం 1 వ పాదం:-తొడల చివరి భాగం,అందలి రక్త నాళములు.

10)మకర రాశి:-కాళ్ళు,చీల మండలు.

ఉత్తరాషాడ 2,3,4 పాదాలు:-మోకాళ్ళు
శ్రవణం 4 పాదాలు:-మోకాలి చిప్పలు.
ధనిష్ట 1,2 పాదాలు:-మోకాలి చిప్ప,మోకాళ్ళు,మోకాళ్ళ లోని మజ్జ.

11)కుంభరాశి:-చీలమండలు

ధనిష్ట 3,4 పాదాలు:-పిక్కలు,వాటి దిగువ భాగం.
శతభిషం 4 పాదాలు:-చీల మండల ఎడమ భాగం.
పూర్వాభాద్ర 1,2,3, పాదాలు:-చీల మండలు

12)మీనరాశి:-పాదాలు

పూర్వాభాద్రా నక్షత్రం 4 వ పాదం:-చీల మండల వద్ద గల పాదముల అగ్రభాగం,మడమలు.
ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు:-పాదాలు వీటికి సంబందించిన ఎముకలు.
రేవతి నక్షత్రం 4 పాదాలు:-పాదాలలోని నరములు,పాదాల వ్రేళ్ళు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...