ఆగ్నేయ
మూలకు అధిపతి శుక్రుడు.శుక్రుడికి ఉపరత్నం క్రిష్టల్(స్పటికం) ఆగ్నేయంలో దోషం ఉన్నవారు
క్రిష్టల్(స్పటిక) బాల్ గాని, క్రిష్టల్(స్పటిక) పిరమిడ్ గాని, , క్రిష్టల్(స్పటిక)
పెన్సిల్స్ గాని ఆగ్నేయ మూల ఉంచిన ఆగ్నేయ దిక్కు దోషం నివారించవచ్చును. క్రిష్టల్(స్పటిక)
కి నెగిటివ్ ని తీసుకొని పాజిటివ్ ఎనర్జీ ని ఇచ్చే గుణం ఉండటం వల్ల ఆగ్నేయ దిక్కు దోషం
ఉన్నవారు తప్పకుండా ఆ దిక్కున క్రిష్టల్(స్పటిక)వస్తువులు ఉంచటం వలన దోషాన్ని నివారించుకోవచ్చును.
ఆగ్నేయంలో
పొయ్యి,వంట
సామాగ్రి ఉండటం మంచిది.వంట స్త్రీలకు సంబందించినది కావున ఆగ్నేయ దిక్కు దోషం ఉంటే ముఖ్యంగా
ఆ ఇంటిలో నివసించే స్త్రీలకు అనారోగ్య,వైవాహిక,సంతాన సమస్యలు ఏర్పడతాయి.
పాలకుడు అగ్నిదేవుడు. వాహనము మేక.
శుక్రుడు (రాక్షస గురువు). రాక్షసులకు ఉన్న వేగము, పాలకుడైన అగ్నిదేవునికి ఉన్న శక్తి ఈ ఆగ్నేయ మూలకు ఉన్నది. అందుచేత
ఆగ్నేయమూలలో అతి పనికిరాదు. అన్ని మూలలు దిక్కులకంటే అత్యంత సూక్ష్మంగా ఆగ్నేయ
దిక్కును చూసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం పొరపాటు చేసినా విపరీత పరిణామాలు తప్పవని
వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆగ్నేయభాగము ఏ దోషము లేకుండా చక్కగా
ఉన్నట్లైతే ఆ ఇంట సంసార సుఖము, కీర్తి, విలాసవంతమైన జీవితము చేకూరుతుంది. ఆ ఇంట్లో పవిత్రత, భార్యాభర్తల మధ్య అనుబంధము, ఇంటి యజమానులు సుఖపడడం, ఇంటికి వచ్చిన అతిథులకు చక్కగా మర్యాద ఇవ్వడం, ఇంట స్త్రీకి మంచి గుర్తింపు లభించడం, భర్త యెడల స్త్రీకి సదభిప్రాయము, భర్తపై నమ్మకం, దాంపత్య జీవనం సుఖప్రదంగా సాగడం వంటి
శుభ పరిణామాలు సంభవిస్తాయి.తూర్పు ఆగ్నేయం పెంపు వలన మగ సంతతి లేకపోవడమో అసలు
సంతతే లేకపోవడమో జరుగుతుంది.దక్షిణ ఆగ్నేయం పెంపు వలన స్ర్తిలకు అనారోగ్య సమస్యలు
ఎదురవుతాయి. అల్లుళ్లతో తగాదా పడటం జరుగుతుంది. దక్షిణ ఆగ్నేయం తగ్గటం వలన,
ఆ ఇంట సంతతి దురలవాట్లకు లోనై, దుర్మరణం, హత్య, ఆత్మహత్యలకు పాల్పడతారు.
ఆగ్నేయం తూర్పుకు గానీ, దక్షిణానికి గానీ పెరగకూడదు.తూర్పు ఆగ్నేయం వీధిపోటు కలిగి, దక్షిణ నైరుతి పెరిగినచో ఆ ఇంట్లో సంతానం పుట్టి మరణించడం లేదా
దురలవాట్లు కలిగి ఉండటం జరుగుతుంది.తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఇంటి యజమానురాలిపైన,
మగ సంతతిపైన ప్రభావం చూపుతుంది.ఆగ్నేయం నడక
గానీ, ఇతర ఆగ్నేయ దోషాలు వున్నట్లయితే ఆ
ఇంట్లోని రెండవ కుమారుని గురించి విచారించాల్సి ఉంటుంది.ఆగ్నేయం మూత పడి దక్షిణ
ఆగ్నేయం పెరిగినట్లయితే పెళ్లిళ్ల అనంతరం ఆ ఇంటి కూతుళ్లు ఏదో ఒక కారణంతో ఇంటికి
వస్తారు.తూర్పు ఆగ్నేయం పెరిగి ఆగ్నేయ దోషాలు వున్నట్లయితే పెళ్లి అనంతరం ఏదో ఒక
కూతురి పోషణ భారం వహించాల్సి ఉంటుంది.
ఆగ్నేయం పల్లంగాని, నూతులుగానీ ఉండటం వలన ఆ ఇంట చోర భయం, అగ్ని భయాలు, కోర్టు తగాదాలు, జైలుశిక్షలు, పోలీసుస్టేషన్ చుట్టూ తిరగడం
జరుగుతుంది.ఆగ్నేయ భాగం నుండి వాడుక నీరు పంపకుండా తూర్పు ఈశాన్యం నుండి
పంపాలి.దక్షిణ ఆగ్నేయ వీధి పోటు వున్నట్లయితే ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.
ఆగ్నేయం ఎత్తుగా ఉండి ఇతర మూలలు పల్లంగా ఉన్నట్లయితే వంశక్షయము
కలుగుతుంది.ఆగ్నేయాలలో వంటగది పూర్తిగా వాస్తు శాస్త్ర సమ్మతం. ఆగ్నేయ స్థలం
తూర్పు వీధికన్నా పల్లంగా ఉండకూడదు. గృహాన్ని ఈశాన్యం హద్దు చేసి
నిర్మించినట్లయితే ఆ ఇంట్లో సంతానం లేకపోవడం జరుగుతుంది.
అదే ఆగ్నేయం నైరుతి కంటే ఎత్తుగా
పెరిగినా, గోతులున్నా, ద్వారమున్నా దోషమే. ఈ దోషాలతో భార్యాభర్తల మధ్య గొడవలు, గృహంలో కలహాలు, ఏ పనీ జరగకపోవడం, అబార్షన్లు, ఆర్థిక నాశనం, మోసపోవడం, మోసం చేయడం, మెట్టినింటికి వెళ్ళిన ఆడకూతురు పుట్టింటికి రావడం, మాట్లాడితే అల్లుళ్ల పెత్తనాలు వంటి దుష్ఫలితాలుంటాయని వాస్తు
నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి