కాల సర్పదోషం.. నాగదోషం..
జన్మ జాతకమునందు కాల సర్పదోషం ఉన్నటువంటి వారు.., పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారు.., లేదా వివిధ మంత్ర ఔషదులతో సర్పముల బందించినవారు.., పుట్టలను త్రవ్వినవారు.. పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టినివసించేవారు.., జన్మ జాతకమందు రాహు కేతువుల మద్య గ్రహాలు ఉన్న ,పంచమంలో రాహువు ఉన్న నాగదోషం అంటారు. "కాల సర్పదోషం"(నాగదోషం) కలవారై ఉంటారు.
ఈ దోషం కలవారు వివాహం .., సంతానం.., కుటుంభం.., అభివృద్ధి ..,ఆరోగ్య.., విషయాల్లో అత్యధిక ప్రభావం చూపి భాదించును.
"అపుత్రాః పుత్రశోకం చకూరుపః పుత్ర జాయతే
ఆభర్తా పతిహీనం చ పతి సంగ వివర్జితాః భర్తృత్యక్తా భవేద్రోగా జీవనం దుర్భరం భవేత్ సర్పదోషా భవేర్యస్తు కష్టశోక భయావహమ్"
నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాలను నుంచి బయటపడవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నాగులకు శుక్లచవితి, శుక్లపంచమి తిథులు, శుక్రవారము, ఆదివారము విశిష్టమని వారు సూచిస్తున్నారు.
అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణపక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగ శాంతి, పూజలు వీలైనంతవరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వదినములలోగాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహమున అరిష్టములు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుందని పురోహితులు అంటున్నారు.
*నాగ దోషం తీవ్రమైనది అయినట్లయితే ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్రచేసి మరుసటి దినమున శివదర్శనం చేసుకొని రాహుకేతువుల పూజా ధానదికములు చేసిన నివారణ జరుగును.
*ఆరు ముఖాలు గాని,గణేశ్ రుద్రాక్ష గాని,ఎనిమిది ముఖాల రుద్రాక్షలను ధరించుటతో పాటు ఏనుగు వెంట్రుకల తో చేసిన రింగ్ గాని చేతికి కడియం గాని ధరించుట శుభమగును.
*ప్రతీ శుక్లపక్ష పాడ్యమి అమావాస్య తిధులల్లో శనివారం నాడు గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టుట,పక్షులకు ఆహారం పెట్టుట వలన కూడా నివారన కలుగును.
*నాగ ప్రతిమ(సుబ్రహ్మణ్య) 27రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే ఆలయంలో దానము చేయట చేత నివారణ మగును.
*ప్రతీ సోమవారం రాహుకాలమందు నాగదేవతకు పాలతో అభిషేకించి క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయుట వలన కూడా నివారణమగును.
*నవగ్రహములకు ఇరవైఒక దినములు ప్రదక్షిణలు చేయుటచేత శుభమగును.రాహు కాలంలో రాహుకాల దీపాలు పెట్టటం వలన కూడా నివారణ జరుగును.
*ప్రతీ ఆదివారం ఉపవాసముంటు నాగదేవతాలయం చుట్టు ప్రదక్షినలు చేస్తు లలితా సహస్రనామావలి గాని,దుర్గా సప్త శ్లోకి పఠించిన శుభమగును.
*అధిక ప్రభావం కలవారు దేవాలయమునందు సుబ్రహ్మణ్య లేదా నాగదేవతా విగ్రహ ప్రతిష్ఠాపన చేయుట వలన పూర్తి దోష నివృత్తి అగును.
*అప్పుడప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేపించటం వలన కూడా దోషం నివారణ అగును.
*నిత్యం దేవి సప్తశతి పారాయణం చేయట కూడా శాంతి కలిగించును.మంగళవారం రోజు గాని,ఆదివారం రోజు గాని ఉపవాసం ఉన్న దోషం నివారణ అగును.
*రాహు కేతువులకు మూలమంత్ర జపములు తర్పనములు హోమము దానము చేయుటచేత కూడా దోష నివారణయగును.
*ప్రతీ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని అర్చించుట అభిషేకించుట కూడా సత్ఫలితాలనిచ్చును.
*వెండి నాగ ప్రతిమ చేయించి పదకొండు దినములు మూలమంత్ర సహితముగా పూజించి బ్రాహ్మణునకు దానము చేయుట వలన కూడా దోష నివారణయగును.
*మినుములు.నువ్వులు.ఉలువలు.. ప్రతీ మంగళవారం దానము చేయుచు ఉన్న దోష నివృత్తియగును.
పైన చెప్పిన అన్ని చేయలేకపోయిన కొన్ని అయిన శ్రద్దగా చేసిన దోష నివృతి అగును.
ఏనుగు వెంట్రుకల తో చేసిన రింగ్:-150.00 కడియం=300=00.
పై గోమతిచక్రం కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.
Bank Details:-State Bank Of Hyderabad
;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC
Code:-SBHY0021056.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి