8, ఆగస్టు 2018, బుధవారం

మేషరాశి, మేష లగ్నం జాతకుల “అదృష్ట రుద్రాక్ష కవచం”

మేషరాశి, మేష లగ్నం జాతకుల  “అదృష్ట రుద్రాక్ష కవచం”

మేష లగ్నం, మేష రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు ఏకముఖి, పంచముఖి, త్రిముఖి రుద్రాక్షలు. మేష లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడికి త్రిముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన రవికి ఏకముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన గురువుకు పంచముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. మేష లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు గాని గురువారం రోజు గాని శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.     


మేషరాశి మేక స్వరూపాన్ని కలిగి ఉంటుంది. మేకకు ఉన్న కొండనైనా డీకొట్టగలననే దైర్యం ఈ జాతకులకు ఉంటుంది. బేసి రాశి, పురుషరాశి అయినందువలన క్రూరత్వం, పురుష లక్షణాలు, పౌరుషం, దైర్యం, గట్టిగా మాట్లాడటం ఈ జాతకులకు ఉంటుంది. మేషం రాశిని అగ్నితత్త్వంతో పోలుస్తారు. భగభగమండే తత్త్వంతో ఉండి, కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చర రాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు. చకచకా ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని ధరించటం వలన మాటల్లోను, చేతళ్ళోను తొందరపాటుతనం తగ్గుతుంది.  


పరిసరాలు, దినచర్యలలో మార్పులు కోరుతుంటారు. క్షణకాలమున నిర్ణయాలు తీసుకొనుట వీరి లక్షణాలు. అగ్నితత్త్వం అయినందున ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశి వారిలో అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం కనిపిస్తాయి. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు. ఇతరులను తన అడుగు జాడలలో నడిపించుకొనే సామార్ద్యం కలిగి ఉంటారు. ఇతరులు పొగిడినచో పొంగిపోయి ఆపదలు తెచ్చుకుంటారు. ఈ రుద్రాక్ష కావాచాన్ని ధరించటం వలన స్ధిరమైన నిర్ణయాలు తీసుకోవటంలోను, సూక్ష్మ పరిశీలనా జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.

క్షత్రియ రాశి కూడా అయినందున పురుషాహంకారంతో శక్తిమంతుడుగా ఉంటారు. పట్టుదల, కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు. దీనివల్ల మొండితనం అబ్బుతుంది. మాట నెగ్గించుకోవడం కోసం క్రూరత్వం వహించే అవకాశం ఉంది. మేష రాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. చాలా శ్రమించి ఎన్నో బాధ్యతలు నెరవేర్చి మంచి స్ధితికి వస్తారు. బాల్యంలో కష్టాలు, యవ్వనంలో ఆత్మీయ స్నేహ వర్గాన్ని విడిచి పెట్టి, ఇతర ప్రాంతాలకు వెళ్ళటం, కుటుంబ పరిస్ధితులు ఇబ్బందికరంగా మారుట, బాధ్యతలు మోయాల్సిన స్ధితికి రావటం, ఆర్ధిక పరిస్ధితుల ప్రభావం ఎలా ఉంటుందో చాలా చిన్న వయస్సులోనే తెలుసుకుంటారు. ఆర్ధిక పరిస్ధితులను మెరుగు పరచుకోవటానికి, కుటుంబ విషయాలలో మనస్పర్ధలు తొలగించుకోవటానికి ఈ అదృష్ట రుద్రాక్ష కవచం ఎంతగానో ఉపయోగపడుతుంది. 

స్నేహితులను ఆదుకునే విషయంలో వెనుక ముందు ఆలోచించకుండా సహాయం చేస్తారు. క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ. సాహస క్రీడల పట్ల మరింత ఆసక్తి ఎక్కువ. కుటుంబ విషయాలలో భార్య తరపు బంధువుల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆస్ధిపాస్తుల కొరకు ఆశపడేవాళ్ళు, తమ అధికారాన్ని ఉపయోగించి మేలుచేస్తారని ఆశించేవాళ్ళు బంధువర్గంలో అధికంగా ఉంటారు. వివిధ సంధార్భాలలో మంచివాళ్ళను చేరదీయటానికి ఏవేవో కారణాలు ఏర్పడతాయి. జీవితంలో అది కొంత వెలితిగా అనిపిస్తుంది. పరాయి స్త్రీల పట్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు కలిగి ఉంటారు. సాంకేతిక రంగాలలో,  క్రీడా రంగాలలో, న్యాయ సంబంధమైన, భూ సంబంధమైన, యంత్ర సంబంధమైన ఉద్యోగ, వ్యాపారాలలో బాగుగా రాణిస్తారు. సంతానం వల్ల, స్నేహితుల వలన కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగించుకుంటూ మెరుగైన పోటీతత్వంతో అంచలంచాలుగా పైకి ఎదగటానికి ఈ అదృష్ట రుద్రాక్ష కవచం ధరించాలి.

సాహసమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ విషయాలు కలిసి వస్తాయి. సందర్భానుసారంగా ధైర్యం చేసి తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య విభేధాలు జీవితంలో చెప్పుకోదగినవి. లిఖిత పూర్వక విషయాల్లో ఇతరులకు చెప్పే జాగ్రత్తలు ఏవి ఆచరణలో పెట్టారు. అనుభవం లేని వ్యాపారాల వలన నష్టపోతారు. నమ్మకమే పెట్టుబడిగా పెట్టి చేసే వ్యాపారాల వలన నష్టపోతారు. ప్రింటింగ్, చిట్ ఫండ్ వ్యాపారాలు, షేర్ల బిజినెస్ కలిసి రాకపోవటం గమనించవచ్చును. గనులు, నూనెల వ్యాపారం బాగా లాభిస్తాయి. ఎందరికో ఉపాది కలిగిస్తూ పాడి పరిశ్రమ ద్వారా మంచి లాభాలు పొందుతారు. సోమరితనాన్ని దరిచేరనివ్వరు. సాధారణంగా అబద్ధాలు ఆడని నైజం. 

వైద్య విషయాలలో మంచి జ్ఞాపక శక్తి కలిగి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. వీరి సలహాల వలన ఇతరులు వృద్ధి చెందుతారు. ఒక స్ధాయికి వచ్చిన మిత్రుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయంగా గురువులను సైతం అధిగమిస్తారు. తరచుగా స్నేహితుల వలన పోటీతత్వాన్ని ఎదుర్కొంటారు. భీమి తగాదాలు జీవితంలో చెప్పుకోదగిన మలుపులకు కారణం అవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఎన్నో విజయాలను సొంతం చేసుకోవచ్చును. రాజకీయాలలో ఎత్తులకు పైఎత్తులు వెయ్యాలన్నా, ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో రాణించాలన్నా, ప్రమోషన్స్ పొందాలన్నా, పోటీతత్వ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు పొందటానికి ఈ అదృష్ట రుద్రాక్ష కవచం ధరించటం వలన మంచి గుర్తింపు పొందవచ్చును.

కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంతవరకు బైట అన్ని విషయాలలోను విజయాలను సాధిస్తారు. కుటుంబ విషయాలలో ఎప్పుడైతే అనుకూలత, ప్రశాంతత లోపిస్తుందో ఇతర విషయాలలో ఓటమిని చవిచూస్తారు. స్త్రీలకు జీవిత భాగస్వామి వలన, సంతానం వలన కొంత ఒడిదుడుకులు ఏర్పడినా చివరకు సమస్యలు సమసిపోతాయి. ప్రధమ సంతాన విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. మనోధైర్యం ఉంటే అన్ని విషయాలలో విజయాలు సాదించవచ్చును. ఆడంబరాలు లేని పూజా విధానం, గుప్తంగా చేసే దానాల వలన మంచి ఫలితాలు పొందుతారు. మంచి స్నేహితులకు ఇచ్చిన వాగ్దానాల వలన మేలు కలుగుతుంది. తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసి వచ్చును.  విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించటానికి, విదేశాలలో ఉద్యోగంలో రాణించటానికి, మన ఆలోచనలను ఆచరణలో పెట్టటానికి ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని ధరించాలి.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...