31, ఆగస్టు 2018, శుక్రవారం

సింహ లగ్నం, సింహ రాశిలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం

సింహ లగ్నం, సింహ రాశిలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం 

సింహ లగ్నం, సింహ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు ఏకముఖి, పంచముఖి, త్రిముఖి రుద్రాక్షలు. సింహ లగ్నానికి లగ్నాధిపతి అయిన సూర్యుడికి ఏకముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన గురువుకి పంచముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన కుజుడికి త్రిముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. సింహ  లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతులు యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.


సింహరాశి వారికి మృగ స్వభావం, బిగ్గరగా అరుచుట, గాండ్రించుట, భయం కలిగించుట, స్వేచ్ఛగా సంచరించుట, జంకు బొంకు లేకపోవుట, అందరిని మించి పోవాలనే స్వభావం, న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉందురు. సింహ  రాశి పంచమ రాశి కావటం వలన ఈ రాశి వారికి స్ఫురణ శక్తి, సృజనాత్మక శక్తి కలిగి ఉంటారు. అధికార నిర్వహణా సామర్ధ్యం కలిగి ఉంటారు. వ్యూహాలను రచించటంలో నిపుణత కలిగిఉండటం, నీతి నియమాలు, లౌకిక ఙ్ఞానం, అంచనా వేయగలిగే సామర్ధ్యం, పరిపాలనా సామర్ధ్యం కలిగి ఉంటారు. శత్రువులను తెలివిగా ఎదుర్కొనే సామర్ధ్యం,  ధైర్య సాహసాలు, పరాక్రమ వంతులుగా ఉంటారు. గుర్తింపును తెచ్చిపెట్టే క్రీడలు, కళలు,  పందాలు,  జూదం మొదలగు వాటిపై అభిలాష కలిగిస్తుంది. ఊహాత్మక సామర్ధ్యం కలిగి ఉండటం చేత విద్యా సంస్ధల నిర్వహణ, భోధన రంగాలలో రాణిస్తారు. గొప్ప పేరు ప్రఖ్యాతలు, ఆర్ధికాభివృద్ధి, సంఘంలో మంచి గుర్తింపు, రాజకీయాలలో రాణింపు మొదలగు వాటిలో రాణించటానికి ఈ రుద్రాక్ష కవచం ఎంతగానో ఉపయోగపడుతుంది.  

రవి ఆరోగ్య కారకుడు కావటం వలన బాల వైద్యం,  ప్రసూతి వైద్యం, హృద్రోగ చికిత్సలలో రాణిస్తారు. విశాల హృదయులు కావటం వలన అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపడతారు. రవి రాశి కనుక పెత్తనం కలిగి ఉండాలనుకోవటం, ఇతరులు తనని అనుసరించాలనుకోవటం, తన మాటే నెగ్గాలనుకోవటం,  ప్రతి విషయంలో పర్యవేక్షణ కలిగి ఉండటం, యాజమాన్య లక్షణాలు, అధికార నిర్వహణా సామర్ధ్యం, రాజకీయాలలో రాణింపు, న్యాయకత్వ నిర్వహణ, గౌరవ పదవులకు సింహరాశి ప్రాదాన్యత వహిస్తుంది. ప్రభుత్వం నుండి సహాకారం లభించటం, ప్రభుత్వ ఉద్యోగాలలో రాణింపు, ఇతరులపై ప్రభావం చూపగలగటం, ఇతరులను తమ అడుగుజాడలలో నడిపించటం మొదలగు లక్షణాలు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని ధరించటం వలన పొందవచ్చును. 

సింహలగ్నం వారు క్రమశిక్షణ కలిగిన వారుగా పేరు తెచ్చుకుంటారు. ఆరోగ్యానికి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారు. ప్రతిది సమయానికి జరగాలని కోరుకుంటారు. ఎంత ఉన్నత స్ధితిలో ఉన్నా సంతృప్తి కలగక ఇంకా పురోగతి సాదించాలని కోరుకుంటారు. కష్టపడకుండా సంపాదించాలని కోరుకుంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాదాన్యత ఇస్తారు. కుల గౌరవం, వంశ గౌరవం పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారు. ఇతర కుల, మత వర్గాలను ద్వేషించే స్వభావం ఉండదు. ఆర్ధిక విషయాల్లో గట్టి మనుషులుగా ప్రఖ్యాతి వహిస్తారు. సింహరాశి వారు చాలా కఠినంగా వ్యవహరించే వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. కానీ చేసిన దాన ధర్మాల వలన, మంచి పనుల వలన పెద్దగా ప్రచారం రాదు. సన్నిహితులను, సేవకావర్గాలను, బంధు మిత్రులను తమ ఆధీనంలో ఉంచుకొని తమ పనులను చేయించుకోగలరు. ఈ రాశి వారిని భయపెట్టి లొంగదీసుకొనే యత్నాలు ఫలించవు. తాను నమ్మిన విషయాన్ని ఇతరులు నమ్మకపోయిన లెక్కచేయరు. అంచనా వేసిన చాలా విషయాల్లో నిజం అవుతాయి. పది శాతం వైఫల్యం చేప్పోకోదగిన నష్టం కలిగిస్తుంది. గుండెజబ్బులు, కంటి సమస్యలు, తరచుగా తలనొప్పి రావటం, తరచుగా తలకు దెబ్బ తగలటం వంటి అనేక రకాల అనారోగ్య సమస్యల నివారణకు  ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని ధరించాలి. 

బంధు వర్గం నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు. రక్త సంబంధీకుల వలన నష్ట పోతారు. పరస్త్రీల వలన కష్టాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల పట్ల కొంతకాలం దూరప్రాంతాలలో ఉండవలసి వస్తుంది. కొన్ని అనివార్య పరిస్ధితుల వలన మన కంటే తక్కువ స్ధాయిలో ఉన్న వారిని ఆశ్రయించక తప్పకపోవచ్చును. వైద్య, సాంకేతిక, వ్యాపార రంగాలలో రాణిస్తారు. రాజకీయ రంగంలో ప్రారంభం నుండే ఉన్నత స్ధితిలో ఉంటారు. ఉన్నత స్ధితిలో ఉండటం వలన సామాన్య వ్యక్తులను దూరం చేసుకుంటారు. సామాన్య స్ధితిలో ఉన్నప్పుడు ఉన్నత స్ధానాలలో ఉన్నవారికి దూరం అవుతారు. శిరోవేదన, పార్శ్వపు నొప్పి, కీళ్ళ నొప్పులు ఇబ్బందులు కలిగిస్తాయి. అనేక రంగాలలో సంస్ధలను స్ధాపించి విస్తరణే ద్వేయంగా కృషి చేస్తారు. అత్యున్నత స్ధాయిలోని వ్యక్తులు స్ధాయిలో లేని వ్యక్తులను పోటీగా నిలిపి వాళ్ళను బలవంతులను చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇలాంటి వారికి సొంత ధనం, ప్రోత్సాహం కూడా తోడవుతుంది. కొనుగోలు చేసిన ఆస్ధులు వివాదాలు అవుతాయి. వైద్య రంగంలో గుర్తింపు పొందటానికి, ఉన్నత స్ధాయిలో ఉన్న వ్యక్తుల పరిచయాలు పొందటానికి ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని ధరించాలి. 

సొంత మనుషులు బాధ్యతలు వదిలేసి వెళ్ళిన తరుణంలో అన్నీ వీరే అయి సరిదిద్దాల్సిన పరిస్ధితి వస్తుంది. కఠినమైన,   అధిగమించిన తదుపరి సొంత మనుషుల ద్వారా సమస్యలు ఎదుర్కొంటారు. తృప్తి లేని మనుషులు అధికంగా విసిగిస్తారు. స్నేహితులు చేసిన సహాయ సహకారాలు మరచిపోలేనివిగా ఉంటాయి. వ్యతిరేక ధోరణిలో ఆలోచన చేయనంత కాలం మేలు గుర్తుంటుంది. మహోన్నతమైన ఆశయ సాధన ఉంటుంది. దానికి తగిన కృషి కూడా ఉంటుంది. జీవితంలో చెప్పుకోదగినవిగా విదేశీ వ్యవహారాలు లాభించటం, ఉద్ధేశాలు, ఆలోచనలు మంచివే అయిన కొన్ని కష్టం కలిగిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉంటే జీవితంలో మరింత అభివృద్ధి సాధిస్తారు. సంతానం వలన మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. ఆలోచనకు తగ్గట్టుగా ఆచరించగలగటం, శ్రమకు తగిన ఫలితాన్ని పొందటానికి ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని ధరించాలి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...