23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

వాయుతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

వాయుతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

వాయుతత్వ రాశులు:- మిధునం, తుల, కుంభ రాశుల వారు వాయుతత్వానికి చెందినవారు. వాయుతత్వ రాశుల వారు ఆలోచనల మీద, ప్రణాళికల మీద, పధకములు వేయుట యందు గడుపుదురు. తెలివితేటలు, సామర్ధ్యంపై విశ్వాసం ఎక్కువ. సాంఘిక కార్యక్రమముల యందు కొత్త
ధకాలు తయారు చేయుట, అనేక మందిని (స్నేహితులను, అధికారులను) కలుపుకొనిపోవుట. కొత్త విషయాలు తెలుసుకొనుట, కొత్త ప్రదేశాలు దర్శించుట వీరి అభిరుచులు. కష్టించి పని చేయటం కష్టం. మానవ జాతికి ఉపకరించు ఏ కార్యక్రమమైన వీరు చేపడతారు. నిస్వార్ధత, మానవ శ్రేయస్సు వీరి యందుండు లక్షణాలు. 


వాయుతత్వ రాశులనే కామ త్రికోణ రాశులంటారు. వాయుతత్వ రాశుల వారికి వ్యాపక శక్తి ఎక్కువ. ఇతరులను ఈజీగా నమ్మిస్తారు. మొదటి పరిచయంలోనే భాందవ్యాలు పెంచుకుంటారు. అందరిని కలుపుకొని పోతారు. మంచి విజ్ఞాన వంతులు. సామాజిక సంబంధాలు మెరుగు పరచుకుంటారు. తమ తెలివితేటలతో ఇతరులను తమ మాట వినేలా మార్చుకుంటారు. విమాన ప్రయాణాలపై ఆసక్తి ఎక్కువ. నిస్వార్ధత, మానవ శ్రేయస్సు వీరి యందుండు లక్షణాలు.  ఎప్పుడు కొత్తగా ఏదో చేయాలనుకోవటం, కొత్తగా ఏదో చూడాలనుకోవటం వాయుతత్వ రాశుల వారి లక్షణాలు. 

మిధునరాశి :-మిధున రాశి మేషాదిగా తృతీయ రాశి కావటం వలన తరచుగా దగ్గరి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మధ్యవర్తిత్వం చేయటంలో సిద్ధహస్తులు. సోదరీ సోధరుల సహకారం కలిగి ఉంటారు. సమీప వ్యక్తుల ప్రభావం ఎక్కువ. సన్నిహితులు, బంధువుల సహకారం. ప్రాతినిధ్యం చేయటంలో మంచి నేర్పరులు. సందేశాలు పంపటంలో ముందుంటారు. సమాచారాన్ని సేకరించగల సమర్ధులు. రచనలు చేయటంలోను, వ్రాయటంలోను మంచి నైపుణ్యం కలవారు. చూచిన దానిని కావాలని కోరుకుంటారు. 

మిధునరాశి వారు పఠనా సామర్ధ్యం కలవారు. విన్న వాటిని, చూచిన వాటిని ఊహాత్మకంగా మలుస్తారు. వ్రాత సంబంధమైన వృత్తులలో రాణిస్తారు. ఇతరులతో ఎప్పుడూ సంభాషిస్తుంటారు. తన మనసులో ఉన్న ఆలోచనలను పుస్తక రూపంలో ప్రచురించగలరు. ప్రసారమాద్యమాల వృత్తి, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఇతరులకు తమ బోధనల ద్వారా చైతన్యవంతులను చేస్తారు. మిధున రాశికి బుధుడు అధిపతి కావటం వలన ఎప్పుడూ ఏదో ఒకటి చదవటం, వినటం చేస్తూ ఉంటారు. పలు విషయాలను అధ్యయనం చేస్తారు. 

తులారాశి:- తులారాశి మేషాదిగా సప్తమ రాశి కావటం వలన సప్తమం దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతుంది. ఈ రాశివారు కోరికలను అదుపులో ఉంచుకోలేరు. ఇతరులను లొంగదీసుకోవటంలో సిద్ధహస్తులు. లలితకళలపై ఆసక్తి ఎక్కువ. ఎప్పుడు ఆకర్షణీయంగా కనపడాలని కోరుకుంటారు. అందమైన దుస్తులను ధరిస్తారు. జీవిత భాగస్వామి కోరికలను తీరుస్తారు. సౌందర్య సాదనాలపై మక్కువ. బంగారు నగలను ధరించవలేనంటే వీరి తర్వాతే. ఎన్ని నగలు ఉన్నా ఇంకా ఏదో లేదనే అసంతృప్తిని వెలిబుస్తారు. వాటిని కొన్నదాకా విడిచిపెట్టరు.

తులారాశికి శుక్రుడు అధిపతి కావటం వలన అందంగా, ఆకర్షణగా కనపడాలని కోరుకుంటారు. ఈ రాశివారికి దాపరికాలు ఎక్కువ. అందరిని కలుపుకొని ఐకమత్యంగా ఉండాలనుకుంటారు. సామాజిక సంబంధాలు బాగుంటాయి. ఈ రాశి వారికి విరోధులు ఎక్కువ. వీరిని పోటీలో గెలవటం కష్టం. లలితకళలు, నృత్యం మొదలగు వాటిలో ప్రవేశం ఉంటుంది. భవిష్యత్ కార్యక్రమాలపై ఆసక్తి ఎక్కువ.

కుంభరాశి :- కుంభరాశి మేషాదిగా ఏకాదశ రాశి కావటం వలన ఎప్పుడూ ప్రయోజనం పొందాలనుకుంటారు. అభివృద్ధి పదంలో పయనిస్తారు. శ్రమకు తగిన ఫలితాన్ని ఆశిస్తారు. సమిష్టిగా ప్రయోజనం పొందాలనుకుంటారు. ఆదర్శాలు కలవారు. కొత్త కొత్త ఆశయాలు, కోరికలు కలవారు. అధికంగా స్నేహితులు కలవారు. వారి వలన ప్రయోజనం పొందుతారు. బంధు మిత్రుల సహకారం ఎక్కువ. 

కుంభరాశి శని అధిపతి కావటం వలన అందరిని కలుపుకొని నిదానంగా, నిలకడగా ఆలోచించి ముందడుగు వేస్తారు. ఈ రాశి వారు ముఖ్యంగా సమూహం, సముదాయం, సమిష్టి విషయాలపై మక్కువ చూపిస్తారు. ఎక్కువమందితో సంబందాలు ఉన్న సంస్ధలు, సహకార సంఘాలు, వివిధ శాఖలు, కార్పోరేషన్లు ఉన్న వృత్తి ఉద్యోగాలలో ప్రయోజనం, గుర్తింపు పొందుతారు. మానవతావాదులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...