చర, స్ధిర, ద్విస్వభావ రాశుల వారి స్వభావాలు
మేషం, కర్కాటకం, తుల, మకర రాశులు చర రాశులు.
వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులు స్ధిర రాశులు.
మిధునం, కన్య, ధనస్సు, మీనం రాశులు ద్విస్వభావ రాశులు.

చర రాశులు:- మేషం, కర్కాటకం, తుల, మకర చర రాసులలో జన్మించిన వారికి చురుకుదనం, శీఘ్ర గమనం, దైర్యం, సాహసం, కొత్త విషయాల యందు ఆసక్తి, పరిసరాలు, పరిస్ధితులు, వృత్తులు, దినచర్యలలో మార్పులు కోరుకుంటూ ఉంటారు. క్షణ కాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్సాహము చూపుట, ఎప్పుడు తిరుగుతుండుట వీరి లక్షణాలు. ప్రేరణ కలిగి ఉంటారు. కార్యసాధనలో ఉత్సుకత కలిగి ఉంటారు. సంకల్ప బలం, ఆత్మ విశ్వాసం, పనులు ప్రారంబించటంలో ఉత్సాహాన్ని కనబరుస్తారు. చపలత్వం ఎక్కువ కలిగి ఉంటారు. అభిప్రాయాలు, ఆలోచనలు, విధానాలు మార్చుకోగలిగే సామర్ధ్యం కలిగి ఉంటారు. ఎప్పుడు పర్యటనలు, మార్పులు, వైవిధ్యం ఇష్టపడతారు. సుస్ధిరత తక్కువ కలిగి ఉంటారు. ఆవేశం ఎక్కువ కలిగి ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక వ్యాపకం కలిగి ఉంటారు.
స్ధిర రాశులు:- వృషభం, సింహం, వృశ్చికం, కుంభ స్ధిర రాశులలో జన్మించిన వారికి స్ధిరమైన అభిప్రాయాలు, సుఖ జీవనం, ఉన్న చోటును, ఇంటిని వదులుకోలేక వచ్చిన అవకాశాలు జార విడిచికొందురు. పొలం, గృహం, స్ధిరాస్తులపైనా మక్కువ చూపిస్తారు. పనులు కార్య రూపం దాల్చవలెనన్న వీరి సహాయం తీసుకొన్నచో పనులు కార్య రూపం దాల్చేదాకా నిద్రపోరు. మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. స్ధిర సంకల్పం, దీక్ష, ఏకాగ్రత, నిగ్రహం, ఓర్పు, సుస్ధిరత, పట్టుదల, కార్యసాధన, ఆత్మ విశ్వాసం, సమర్ధత, వాగ్ధానాలు చెల్లించాలనే స్వభావం, ప్రయోజన దృష్టి కలిగి ఉంటారు. కొన్ని విషయాల పట్ల, కొన్ని పనుల విషయాలలో, కొంతమంది వ్యక్తుల పట్ల స్ధిరమైన అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. వాటిని మార్చటం కష్టం. తరచుగా మార్పులు ఇష్టపడరు.
ద్వి స్వభావ రాశులు:- మిధున, కన్య, ధనస్సు, మీన ద్విస్వభావ రాశులలో జన్మించిన వారికి పలు అంశాలపైనా సమన్వయం ఉండును. వ్యాక్యాతలు, భోధన చేసేవారుగా రాణిస్తారు. సందేహాలు ఎక్కువ, సంకోచాలు ఎక్కువ, ఏ విషయాన్ని నిర్దారించలేరు. తొందరగా ఒక నిర్ణయానికి రాలేరు. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తారు. ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలరు. స్వతంత్రంతో ఏ పని చేయలేరు. కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలలో మాత్రమే స్ధిరత్వం కనిపిస్తుంది. మరికొన్ని విషయాలలో సందర్భాలలో అభిప్రాయాలు మారుతుంటాయి. పరిస్ధితులకు అనుగుణంగా మార్పులకు సర్దుబాట్లకు ఇష్టపడతారు. ప్రధానమైన వృత్తితో పాటు ఒక ఉప వృత్తిని కూడా చేపడతారు. స్నేహం, అనురాగం విషయంలోను ద్వంద్వ అలోచన చేస్తారు. విభిన్నమైన ఆశయాలు, అభిరుచులు, అనుబంధాల మూలంగా నిర్ణయాలకు రావటంలో తికమక పడతారు. మంచి చెడులు, యుక్తాయుక్తాలు గ్రహించగలరు. విమర్శలు, సమీక్షలు, విచారణలు చేయగలరు. విచక్షణను చక్కగా ఉపయోగించగలరు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి