8, మే 2017, సోమవారం

సింహ లగ్నములో నవగ్రహముల యొక్క ఫలితములు

సింహ లగ్నములో నవగ్రహముల యొక్క ఫలితములు

ఏ వ్యక్తి యొక్క జననము సింహ లగ్నములో కలుగునో వారు చూడడానికి అందముగాను మరియు అరోగ్యముగాను వుండెదరు. వీరు మహత్వకాంక్ష కలిగి మొండి స్వబావము కలిగి వుండెదరు. వీరు ఎంత సాహసము కలవారో అంతే ఆత్మవిశ్వాసము కలవారు కూడా. వీరిలో సాహసము మరియు ఆత్మ విశ్వాసము అధికముగా వుండును. రాజనీతిలో వీరికి అభిరుచి వుండును. ఈ లగ్నము గల కుండలిలో ప్రధమ బావములో స్థితిలో వున్న గ్రహములు ఏ ప్రకారము ఫలితములను ఇచ్చునో పరిశీలిద్దాము.


సింహ లగ్నములో లగ్నస్థ సూర్యుడు

సూర్యుడు సింహ లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతిగా వుండి శుభకారక గ్రహముగా వుండును. స్వరాశిలో వున్న సూర్యుడు వ్యక్తిని గుణవంతునిగాను మరియు విద్వావంతునిగాను చేయును. ఇది వ్యక్తిలో ఆత్మ విశ్వాసమునకు పరిపూర్ణతను కలిగించును. వారి కార్య కుశలత మరియు ప్రతిభ కారణముగా సమాజములో సన్మానితులు కాగలరు. వీరు ఏ పనిని చేపట్టిన పూర్తి మనోభలముతో చేపట్టెదరు. కార్యములలో త్వరత్వరగా మార్పులను తీసుకొని వచ్చుట వీరు ఇష్టపడరు. వీరు పరాక్రమము కలవారు. ఇతరులకు ఉదార స్వబావముతో సహాయము చేయుదురు. ప్రధమ బావములో స్థితిలో వున్న సూర్యుడు సప్తమములో స్థితి శని యొక్క రాశి కుంభరాశిని చూస్తున్నాడు. దానివలన దాంపత్య జీవితములో అశాంతి కలిగి వుండును. మిత్రుల నుండి మరియు బాగస్వాముల నుండి కోరుకున్న సమ్యోగము లభించక పోవచ్చును. సూర్యుడు లగ్నంలో ఉండటం వలన దీర్ఘకాలిక కోపాలను మనసులో దాచుకొని హృదయ సంబంధ అనారోగ్యాలను పొందుతారు. పొగడ్తలకు లొంగిపోతారు. 
  

సింహ లగ్నములో లగ్నస్థ చంద్రుడు 
చంద్రుడు సింహ లగ్నము యొక్క కుండలిలో ద్వాదశ బావమునకు అధిపతి. ఈ దశావదిలో ఇది మిత్రుడు కావటం వలన శుభ మరియు వ్యయాధిపతి కావటం వలన అశుభ రెండు ప్రకారముల ఫలితములను ప్రదానించును. సింహరాశిలో చంద్రుడు లగ్నములో స్థితిలో వుండిన ఎడల వ్యక్తి చురుకైన స్వబావము కలిగి వుండెదరు. వీరి మనస్సు స్థిరత్వము లేకుండా వుండును. మరియు ఒక చోట వీరు నిలకడగా వుండుటకు ఇష్టపడరు. వీరు ఏ విదమైన సహాయమునైనా నిశ్వార్ధ రూపముగా చేయుటకు ఇష్ట పడతారు. వీరు మంచి స్వబావము కలిగినవారై వుండెదరు. వీరికి తల్లి దండ్రుల నుండి ప్రేమ మరియు సమ్యోగము లభించగలదు. చంద్రుడు వీరికి రాజనీతిలో సఫలతను పొందుటకు సమ్యోగమును ఇచ్చును. సప్తమ బావములో చంద్రుని దృష్టి కుంబముపై వుండుట వలన వైవాహిక జీవితములో కష్టములు కలుగును. చంద్రునితో పాప గ్రహములు వుండుట వలన చంద్రుని శుభ స్థితిలో లోపము ఏర్పడవచ్చును.


సింహ లగ్నములో లగ్నస్థ కుజుడు 
కుజుడు సింహ లగ్నము యొక్క కుండలిలో మిత్ర స్ధానములో ఉండుట వలన శుభకారక గ్రహము కాగలడు. ఇది ఈ లగ్నములో చతుర్ధ మరియు నవమ బావము యొక్క అధిపతి కాగలడు. లగ్నములో కుజుడు వ్యక్తిని సాహసి, నిర్బయుడు మరియు ఆత్మ విశ్వాసముతో పరిపూర్ణముగా చేయును. వ్యక్తి ఒకటి కన్న ఎక్కువ విధముగా ధనమును ప్రాప్తి చెందగలడు. లగ్నములో  వున్న కుజుడు చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావములను చూస్తున్నాడు. కుజుని యొక్క దృష్టి వలన బాగస్వామితో విరోధములకు కారణము కాగలదు. వైవాహిక జీవితములో వొడిదుడుకులు వుండగలవు మరియు శత్రువుల ద్వారా పీడించబడగలరు. కుజుని ప్రబావము వలన సంతానము కలుగును కాని చాలా పరీక్షించవలసి వుండును. లగ్న కుజుడు వేరేవాళ్ళ మీద కోపాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. తొదరగా కోపాన్ని తెచ్చుకుంటారు. తరువాత పశ్చాత్తాప పడతారు.


సింహ లగ్నములో లగ్నస్థ బుధుడు 
సింహ లగ్నము యొక్క కుండలిలో బుధుడు ద్వితీయ మరియు ఏకాదశ బావము యొక్క అధిపతి కాగలడు. ఈ లగ్నము గల వ్యక్తికి రెండు ధన స్ధానాలకు అధిపతి కావటం వలన ధనము కారకముగా వుండును. ఈ లగ్నములో బుధుడు  ఉన్న ఎడల వ్యక్తి ధనవంతుడు కాగలడు. వీరి కళలకు సంబందించిన ఏ రంగములోనైనా సంబందములను కలిగి వుండవచ్చును. వీరికి శత్రుభయము ఎల్లప్పుడూ వుండును. సప్తమ బావములో బుధుని యొక్క దృష్టి జీవిత బాగస్వామి పట్ల ప్రేమను పెంచును. వీరు వారి జీవిత బాగస్వామి పట్ల ప్రేమ కలిగి వుండెదరు. కాని జీవిత బాగస్వామి నుండి వీరికి అనుకూల సమ్యోగము లభించదు. సంతాన సుఖము విల్లంబములను కలిగినదై వుండును. బుధునితో పాటు పాప గ్రహములు లేదా శత్రు గ్రహముల యుతి కలిగి వుండిన ఎడల బుధుని శుభ ప్రభావములో లోపము ఏర్పడవచ్చును.

సింహ లగ్నములో లగ్నస్థ గురువు 
గురువు సింహ లగ్నము యొక్క కుండలిలో పంచమాదిపతి మరియు అష్టమాదిపతి కాగలడు. ఈ రాశిలో గురువు లగ్నస్థములో వుండుట కారణముగా వ్యక్తి శారీరకముగా అందముగాను మరియు ఆకర్షణీయముగాను వుండును. వీరి మాటలు ప్రభావశాలిగా వుండును. గురువు వీరిని బుద్దివంతునిగాను మరియు ఙ్ఞానవంతునిగాను చేయును. పంచమ, సప్తమ మరియు నవమ బావముపై గురువు యొక్క దృష్టి వుండుట వలన వ్యక్తి దయాస్వబావము కలిగి మంచి భావాలు కలిగిన వారై వుండెదరు. వీరిలో ధనమును బద్రపరచు స్వబావము కలిగి వుండెదరు. ఙ్ఞానము మరియు బుద్ది వలన వీరు ఉన్నత పదవులను పొందెదరు. ఉద్యోగ వ్యాపారములు రెండింటిలోనూ వీరికి సఫలత లభించగలదు. గౌరవ మర్యాదలు కూడా వీరికి లభించగలవు. జీవిత బాగస్వామి మరియు సంతానము నుండి వీరికి సుఖము మరియు సమ్యోగము లభించగలదు. పాప గ్రహముల నుండి యుతి లేదా దృష్టి గురువు అయిన ఎడల ఫలితములలో లోపము ఏర్పడగలదు. అప్పుడు గురువుకు పరిహారములు చేయవలసి వుండును.

సింహ లగ్నములో లగ్నస్థ శుక్రుడు
శుక్రుడు సింహ లగ్నములో తృతియాదిపతి మరియు దశమాదిపతిగా వుండును. ఈ లగ్నములో ఇది కేంద్రాదిపతి దోషము వలన పీడించబడిన  గ్రహముగా వుండును. శుక్రుడు యది సింహ రాశిలో లగ్నస్థముగా వుండిన ఎడల వ్యక్తికి అందమైన మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వమును ప్రదానించును. శుక్రుని ప్రభావము వలన వ్యక్తి యొక్క మనస్సు బౌతిక సుఖముల పట్ల ఆకర్షణీయముగా వుండును. మెట్టింటి నుండి సమయమునకు తగ్గట్టు లాభములు ప్రాప్తించగలవు. శుక్రుడు సప్తమ బావమును పూర్ణ దృష్టితో చూస్తున్నాడు దాని వలన వ్యక్తి వారి ధనమును అపవ్యయము చేయును. ఈ స్థితిలో వ్యక్తి స్వయముపై అదుపు లేకుండా వుండును. అన్య వ్యక్తితో వీరికి అనౌతిక సంబందములు వుండగలవు. దానివలన ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. సప్తమ బావములో శుభ గ్రహము స్థితిలో వుండి మరియు దీనిపై శుభ గ్రహముల దృష్టి వున్న ఎడల వ్యక్తి జీవిత బాగస్వామికి నమ్మకమైన వారుగా వుండగలరు.

సింహ లగ్నములో లగ్నస్థ శని 
శని సింహ లగ్నము యొక్క కుండలిలో షష్టమ మరియు సప్తమ బావము యొక్క అధిపతి కాగలడు. శని సిమ్హా లగ్నంలో శత్రు స్ధానంలో ఉన్నట్టు. సింహ లగ్నము యొక్క కుండలిలో లగ్నములో  వున్న శని అశుభ ఫలదాయకముగా వుండును. ఇది వ్యక్తిని అసమాజికమైన కార్యములను చేయుటకు ప్రోత్సాహించును. వ్యక్తిని అపకీర్తిని పొందుటకు బాగముగా వుండును. లగ్నములో విరాజితమైన శని తృతీయ, సప్తమ మరియు దశమ బావమును పూర్ణ దృష్టి ద్వారా చూస్తున్నాడు. శని యొక్క దృష్టి యొక్క ప్రబావము కారణముగా తెలివిగాను మరియు కపటస్వభావము కలవాడై వుండును. వీరి వ్యవహారముల కారణముగా మిత్రుల నుండి వీరికి కోరుకున్న సమ్యోగము లభించకపోవచ్చును. జీవిత బాగస్వామి నుండి కూడా కష్టములు కలుగును. ఇతరుల సంపత్తిపై వీరు పేరాశ కలిగి వుండెదరు. శనితో పాటు శుభ గ్రహముల యుతి లేదా శని శుభ గ్రహముల దృష్టిలో వుండిన ఎడల అశుభ కొంత తగ్గవచ్చును.

సింహ లగ్నములో లగ్నస్థ రాహువు
సింహ లగ్నము యొక్క కుండలిలో రాహువు అశుభ పలదాయకముగా వుండును. ఈ లగ్నములో ప్రధమ బావములో  వున్న రాహువు వ్యక్తి యొక్క ఆత్మ భలమును బలహీన పరచును. ఆత్మవిశ్వాస లోపము కారణముగా వ్యక్తి స్వతంత్ర రూప నిర్మాణమునకు బయపడును. వీరు గౌరవ మర్యాదలను కాపాడుకొనుటకు చాలా పయత్నించవలసి వుండును. తంత్ర మంత్రములు మరియు గుప్త విద్యలందు ఆసక్తి అధికముగా వుండును. రాజనీతిలో వీరికి రాహువు యొక్క సమ్యోగము లభించగలదు. రాహువు యొక్క సప్తమ దృష్టి యొక్క ప్రభావము కారణముగా వర్తక వ్యాపారములలో భాగస్వాములు మరియు మిత్రుల నుండి విషేశ లాభములు లభించవు. వ్యాపారములో నష్టము కూడా కలుగవచ్చును. స్త్రీ పక్షము నుండి కూడా వీరికి కష్టము కలుగవచ్చును.

సింహ లగ్నములో లగ్నస్థ కేతువు
సింహరాశి సూర్యుని యొక్క రాశి. కేతువు సూర్యుని యొక్క శత్రువు. అందువలన ఈ రాశిలో కేతువు శుభ ఫలితములను ఇవ్వడు. లగ్నములో కేతువు ఉన్న ఎడల వ్యక్తి ఆరోగ్యము బలహీనముగా వుండును. కేతువు యొక్క దశలో వ్యక్తి అరోగ్యములో వొడిదుడుకులు వుండగలవు. తల్లిదండ్రులతో విషేశమైన ప్రేమ ఏమీ వుండదు. మానసిక చింతన మరియు సమస్యలను వీరిని బాదించు చుండును. సప్తమ బావములో కేతువు యొక్క పూర్ణ దృష్టి కారణముగా వైవాహిక జీవితములోని సుఖములో లోపము ఏర్పడగలదు. జీవిత బాగస్వామి జబ్బుపడగలరు లేదా వారితో వొడిదుడుకులు వుండగలవు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...