12, మే 2017, శుక్రవారం

కన్యా లగ్నములో నవగ్రహముల ఫలితములు


కన్యా లగ్నములో నవగ్రహముల ఫలితములు

బుధుడు కన్యా రాశి యొక్క అధిపతి. ఈ లగ్నములో జన్మించు వ్యక్తి బుద్దివంతుడుగాను, వివేక వంతుడుగాను మరియు వ్యాపారములో నిపుణత కలిగి వుండెదరు. ఈ లగ్నములో ఏ వ్యక్తి యొక్క జననము కలుగునో వారు కల్పనాశీలత కలవారై కోమల హృదయము కలవారై వుండెదరు. ఈ లగ్నములో లగ్నస్థ గ్రహముల యొక్క ఫలితములు వేరువేరుగా వుండును.

కన్యా లగ్నములో లగ్నస్థ సూర్యుడు

కన్యా లగ్నము యొక్క కుండలిలో సూర్యుడు ద్వాదశమాదిపతిగా  వున్నాడు  ఏ వ్యక్తి యొక్క కుండలిలో కన్యా లగ్నములో సూర్యుడు లగ్నస్థములో వుండునో వారు చూడడానికి అందముగా వుంటారు. వీరి వ్యక్తిత్వము ప్రభావశాలిగా వుండును. వీరికి దగ్గు, జలుబు మరియు హృదయ సంబందమైన సమస్యలు కలిగే అవకాశములు వున్నవి. సూర్యుని ప్రభావము కారణముగా వీరికి విదేశ యాత్రలు చేసే అవకాశము కూడా కలుగవచ్చును. లగ్నస్థ సూర్యుని యొక్క ధృష్టి సప్తమ బావముపై వుండుట వలన గృహస్థ జీవితములోని సుఖములో లోపము ఏర్పడవచ్చును. కృషి మరియు జన క్షేత్రమునకు సంబందమైన వ్యాపారములు వీరికి లాభదాయకముగా వుండును. లగ్నములో  వున్న సూర్యుడు అశుభ గ్రహములతో యుతి లేదా ధృష్టి కలిగి వున్న ఎడల అనారోగ్య సమస్యలు కలుగవచ్చును.

కన్నా లగ్నములో లగ్నస్థ చంద్రుడు

చంద్రుడు కన్యా లగ్నము యొక్క కుండలిలో ఏకాదశాదిపతిగా వుండును. చంచల మనస్తత్వం కలుగును. బయటకు చెప్పుకోలేని మానసికమైన సమస్యలు అనుభవిస్తారు.  లగ్నస్థుడుగా వుండుట వలన చంద్రుడు వ్యక్తిని అందమైన మరియు కల్పనాశీలత కలవాడుగా చేయును. చంద్రుని యొక్క ప్రభావము కారణముగా వ్యక్తి దయ మరియు ఆత్మ విశ్వాసము కలవాడుగా వుండును. వీరు వారి జీవితములో తీవ్రగతిలో ప్రగతిని సాదించెదరు. సప్తమ బావములో స్థితిలో వున్న గురువు యొక్క రాశిపై చంద్రుని దృష్టి వుండుట కారణముగా జీవిత బాగస్వామితో ప్రేమపూరితమైన సంబందములు కలిగి వుండును. జీవిత బాగస్వామితో అపేక్షిత సమ్యోగము కూడా ప్రాప్తించవచ్చును. వీరికి అకస్మాత్తుగా లాభము కలుగును. యది లగ్నస్థ చంద్రుడు అశుభ గ్రహముతో దృష్టి లేదా యుతి కలిగి వున్న ఎడల కష్టకారిగాను మరియు పీడాకారిగాను వుండును.

కన్యా లగ్నములో లగ్నస్థ కుజుడు

కుజుడు కన్యా లగ్నము యొక్క కుండలిలో తృతీయాదిపతి మరియు అష్టమాదిపతిగా వుండి శత్రు స్ధానంలో ఉండును. కుజుడు కన్యా లగ్నములో లగ్నస్థముగా వుండి వ్యక్తిని క్రోదము మరియు ఉగ్రము కలవాడుగా చేయును. చతుర్ధ బావములో కుజుని యొక్క ధృష్టి సోదరులతో అనుకూల సంబందములను కలిగించును. మరో ప్రక్క తల్లి దండ్రుల నుండి విభేదములను కలిగించును. ప్రధమ బావములో స్థితిలో వున్న కుజుడు తండ్రికి ఆరోగ్య సంబందమైన సమస్యలను కలిగించును. అష్టమ బావములో కుజుని దృష్టి వుండిన ఎడల శారీరక కష్టములు కలిగే అవకాశములు వుండును. గృహస్థ జీవనము కొరకు కుజుని యొక్క ఈ స్థితి శుభకారిగా వుండదు.  లగ్నస్థ కుజుడు సప్తమ బావములోని ఫలితములను పీడితము చేయును. భాగస్వాముల వలన మోసపోయే అవకాశము వున్నది. కోపస్వభావము, దూకుడు తనం వలన సహకారాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.


కన్యా లగ్నములో లగ్నస్థ బుధుడు

బుధుడు కన్యా లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతి మరియు కర్మాదిపతిగా  వున్నాడు. లగ్నాదిపతి యొక్క స్వరాశిలో స్థితిలో వుండుట వలన వ్యక్తి  ఆరోగ్యముగాను, అందముగాను మరియు ఆకర్షణీయముగాను వుంటారు. బుధుడు వ్యక్తికి దీర్ఘాయువును ఇచ్చును. లగ్నాదిపతి బుధుని ప్రబావము కారణముగా వ్యక్తిలో ఆత్మ విశ్వాసము పరిపూర్ణముగా వుండును. వారి ఆత్మబలము కారణముగా వ్యవసాయము మరియు వ్యాపార రంగములలో నిరంతర ప్రగతిని సాదించెదరు. వీరికి సమాజములో గౌరవము మరియు ఆదరణ లభించగలదు. ప్రధమ బావములో స్థితిలో వున్న బుధుడు సప్తమ బావమును వారి పూర్ణ దృష్టి ద్వారా చూస్తున్నాడు. బుదుని ఈ దృష్టి కారణముగా మీకు మంచి జీవిత బాగస్వామి లభించగలదు. గృహస్థ జీవితము సుఖమయము గాను మరియు ఆనందమయము గాను వుండును.

కన్యా లగ్నములో లగ్నస్థ గురువు

కన్యాలగ్నము యొక్క కుండలిలో గురువు శతృ గ్రహం కాగలడు. ఇది చతుర్ధ మరియు సప్తమ బావము యొక్క అధిపతి కాగలడు. గురువు లగ్నస్థుడుగా వుండుట వలన వ్యక్తికి తన జీవితములో తండ్రి పేరు వలన పలుకబడి లభించును. బందుమిత్రులతో వొడిదుడుకులు వుండును. పుత్రుల నుండి ఆదరము మరియు సమ్యోగము లభించగలదు. పితృ సంపత్తి నుండి వీరికి లాభము కలుగును. ప్రధమ బావములో స్థితిలో వున్న గురువు పంచమ, సప్తమ మరియు నవమ బావమును చూస్తున్నాడు. గురువు యొక్క దృష్టి కారణముగా వ్యక్తి దీర్ఘాయువు, పుత్రసంతానం మరియు విక్యాతి కలుగును. గురువు అశుభ గ్రహములలో దృష్టి లేదా యుతి కలిగి వున్న ఎడల సంతానమునకు కష్టకారి కాగలదు. మాతృ ప్రేమ కలిగి ఉంటాడు.

కన్యా లగ్నస్థ శుక్రుడు

శుక్రుడు కన్యా లగ్నము యొక్క కుండలిలో దనాదిపతి మరియు భాగ్యాదిపతిగా శుభ గ్రహముగా వుండును. లగ్నములో కన్యా రాశిలో  వున్న శుక్రుడు వ్యక్తిని జీవితములో ప్రగతి బాటలో ముందుకు తీసుకు వెళ్ళును. శుక్రుని ప్రభావము కారణముగా వ్యక్తి సంగీతము లేదా కళలకు సంబందించిన మరే ఇతర రంగములోనైనా అభిరుచి కలిగి వుండెదరు. వీరిలో దార్మిక బావనలు అధికముగా వుండును. వీరికి క్రీడలు, లలిత కళలలో  మంచి సఫలత లభించగలదు. ప్రభుత్వము మరియు ప్రభుత్వ విబాగముల నుండి వీరికి సమ్యోగము లభించగలదు. లగ్నస్థ శుక్రుని యొక్క దృష్టి సప్తమ బావముపై వుండిన ఎడల జీవిత బాగస్వామి సుయోగ్యము మరియు సమ్యోగము కలిగిన వారై వుండును. శుక్రుడు అశుభ గ్రహములతో యుతి లేదా దృష్టి కలిగి వుండుట వలన శుక్రుని యొక్క శుభత ప్రబావితము కాగలదు. కన్యారాశిలో శుక్రుడు నీచస్ధితి పొందుట వలన వివాహా విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు.

కన్యా లగ్నములో లగ్నస్థ శని

కన్యా లగ్నము యొక్క కుండలిలో శని మిత్ర స్ధాన స్థితిలో వున్నాడు. ఈ లగ్నములో శని పంచమాదిపతి మరియు షష్టమాదిపతిగా వుండును. శని యొక్క ప్రభావము కారణముగా వ్యక్తి శారీరకముగా బలమైన వారుగా వుండును. కఠిన పరిశ్రమ చేయుటకు వీరు వెనుకాడరు. ఙ్ఞానము మరియు బుద్ది కుశలతలో కూడా వీరు ఉన్నత శ్రేణిగా వుండెదరు. వీరి పరివారిక జీవితము అశాంతితో కూడినదై వుండును. సంతానముతో సమ్యోగాత్మక సంబందములు వుండక పోవచ్చును. ప్రదమస్థ శని తృతీయ, సప్తమ మరియు దశమ బావమును చూస్తున్నాడు. దానివలన సంతాన విషయములో వీరికి కష్టములను ఎదుర్కొన వలసి వుండును. జీవిత బాగస్వామి చూడడానికి అందముగాను మరియు అత్యాద్మిక విచారములు గల వ్యక్తిగా వుండును. కాని వారి స్వబావము మొండిగాను మరియు క్రోదము కలిగి వుండును. గృహస్థ జీవితములో వీరిలో అప్పుడప్పుడు సమస్యలను ఎదుర్కొన వలసి వుండును.

కన్యా లగ్నములో లగ్నస్థ రాహువు

రాహువు కన్యా లగ్నములో ప్రధమ బావములో స్థితిలో వుండుట వలన వ్యక్తి పొడుగుగాను మరియు అరోగ్యముగాను కనిపించును. వీరిలో వేళాకోల లక్షణాలు  మరియు స్వార్ధము వుండును. వారి పనిని ఏవిధముగానైనా చేపట్టగలరు. స్త్రీ యొక్క కుండలిలో సప్తమ బావములో రాహువు యొక్క దృష్టి వుండుట కారణముగా సంతాన సంబందములలో కష్టకారిగా వుండును. రాహువు యొక్క ఈ దృష్టి జీవిత బాగస్వామిని పీడించును. కుటుంబ జీవితమును అశాంతిగాను మరియు కలహపూరితమైనదిగాను చేయును.

కన్యా లగ్నములో లగ్నస్థ కేతువు

ప్రధమ బావములో కన్యా లగ్నములో స్థితిలో వున్న కేతువు వ్యక్తిని స్వార్ధిగా చేయును. దీనివలన ప్రభావితమైన వ్యక్తిలో స్వాభిమాన లోపము కలుగును. గుప్తాచారము మరియు డిటెక్టివ్ వంటి పనులలో వీరికి సఫలత లభించగలదు. వీరికి వాత రోగము కలిగే అవకాశములు వున్నవి. నడుములో కూడా వీరికి నొప్పి వుండగలదు. సప్తమ బావము కేతువుతో దృష్టి కలిగి వుండుట కారణముగా ఈ బావములో సంబందిత ఫలితములు పీడించబడగలవు. ఇది జీవిత బాగస్వామిని రోగగ్రస్తునిగా చేయును. సప్తమ బావము శుభ గ్రహములో యుతు లేదా దృష్టి కలిగించని ఎడల వివాహేతర సంబందములకు కూడా అవకాశములు వున్నవి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...