24, మే 2017, బుధవారం

వృశ్చిక లగ్నములో లగ్నస్థ నవ గ్రహముల ఫలితములు

వృశ్చిక లగ్నములో లగ్నస్థ నవ గ్రహముల ఫలితములు


వృశ్చిక లగ్నము యొక్క అధిపతి కుజుడు. సూర్యుడు, చంద్రుడు, గురువు ఈ లగ్నములో యోగ కారక గ్రహములు కాగలరు. కుజుడు కూడా లగ్నాదిపతిగా వుండుట వలన యోగకారక గ్రహము కాగలడు. బుధుడు, శుక్రుడు మరియు శని బలహీన ఫలితములను ఇచ్చును. లగ్న బావములో నవ గ్రహములు వున్నప్పుడు ఇది వ్యక్తి యొక్క జీవితమును ఏవిదముగా ప్రభావితము చేయును, మరియు ఏ గ్రహము యొక్క ఏ ఫలితము వుండునో పరిశీలిద్దాము.

వృశ్చిక లగ్నములో లగ్నస్థ సూర్యుడు
వృశ్చిక లగ్నము గల కుండలిలో సూర్యుడు దశమాదిపతిగా వుండుట వలన యోగకారక గ్రహము కాగలడు. కుజుని యొక్క రాశిలో లగ్నస్థముగా వుండి సూర్యుడు వ్యక్తికి ఆత్మబలమును ప్రసాదించును. ఇది బుద్దివంతునిగాను మరియు మహిమాన్వితునిగాను చేయును. ప్రభుత్వ పక్షము నుండి లాభములను కలిగించును. సూర్యుడు కర్మాదిపతిగా వుండుట వలన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగము లభించుటకు అవకాశములు ప్రభలముగా వున్నవి. ఏ వ్యక్తి యొక్క కుండలిలో ఈ స్థితి వున్నదో వారికి తండ్రి వద్ద నుండి సమ్యోగము మరియు స్నేహము లభించగలదు. పిత్రార్జితం లభించగలదు.సప్తమ బావములో స్థితిలో వున్న శుక్రుని రాశి వృషభముపై సూర్యుని యొక్క దృష్టి శృంగార మరియు సౌందర్య సంబందమైన వస్తువుల వ్యాపారము వీరికి విషేశ లాభములను ఇచ్చును. జీవిత బాగస్వామితో అశాంతి వుండును కాని తల్లిగారితో స్నేహపూరితమైన బందములు వుండగలవు.


వృశ్ఛిక లగ్నములో లగ్నస్థ చంద్రుడు
వృశ్చిక లగ్నము యొక్క కుండలిలో చంద్రుడు భాగ్యాధిపతి మరియు త్రికోణాధిపతి కాగలడు. ఇది ఈ లగ్నము గల జాతకునికి చాలా శుభ పలదాయకముగా వుండును. లగ్నములో చంద్రుడు స్థితిలో వుండుట వలన వ్యక్తి చూడడానికి అందముగాను మరియు ఆకర్షణీయముగాను వుండును. వీరు ప్రభావశాలి వ్యక్తిత్వము గలవారై వుండెదరు. వీరిలో దార్మిక బావన అధికముగా వుండును. తీర్ధాటనము చేయుట వలన వీరికి ఆనందము లభించును. దయ మరియు కరుణభావన వీరిలో వుండును. వీరిలో నడుము నెప్పి మరియు పిత్త సంబందమైన రోగములు కలిగే అవకాశములు వున్నవి. భాగ్యము యొక్క బలము కారణముగా వీరి పని సునాయసముగా జరుగును మరియు గౌరవ మర్యాదలను మరియు ప్రత్యేకతలను పొందగలరు. సప్తమ బావములో చంద్రుని యొక్క దృష్టి కారణముగా అందమైన మరియు సుయోగ్యమైన జీవిత బాగస్వామి ప్రాప్తించును. జీవిత బాగస్వామి నుండి వీరికి సమ్యోగము లభించును.


వృశ్చిక లగ్నములో లగ్నస్థ కుజుడు
వృశ్చిక లగ్నములో కుజుడు లగ్నాదిపతిగా వుండుట వలన శుభ యోగకారక గ్రహము కాగలడు. షష్టమ బావము యొక్క అధిపతిగా వుండుట వలన భావ కారకత్వం యొక్క శుభ ఫలితాలను ఇవ్వగలదు.  లగ్నాదిపతిగా వుండుట వలన శుభ ప్రభావములనే ఇచ్చును. లగ్నస్థుడుగా వుండుట వలన విశేష లాభకారిగా వుండును. ప్రధమ బావములో స్థితిలో వున్న గ్రహములు వ్యక్తికి దీర్ఘాయువును ప్రదానించును. వ్యక్తిని శారీరకముగా శక్తిశాలి, పరిశ్రమి మరియు నిరోగిగా చేయును. శత్రువుల వలన వీరు భయబీతి పొందరు. సమాజములో వీరి గౌరవ మర్యాదలతో ఆదరణీయముగా వుండెదరు. మాతృ పక్షము నుండి వీరికి లాభము కలుగును. లగ్నస్థ కుజుడు చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావములను చూస్తున్నాడు. కుజుడు ఏ బావమునైతే చూస్తాడో ఆ బావము యొక్క ఫలితములు పీడించబడగలవు. అనగా భూమి, భవనము మరియు వాహన సుఖము బలహీన పడగలదు. తల్లితో కూడా మతబేధములకు అవకాశములు వుండును. జీవిత బాగస్వామికి కష్టములు కలుగును. వైవాహిక జీతివములో కష్టములను ఎదుర్కొన వలసి వచ్చును.


వృశ్చిక లగ్నములో లగ్నస్థ బుధుడు
బుధుడు శుభ గ్రహము అయినప్పటికీ ఈ లగ్నములో అష్టమాదిపతి మరియు దశమాదిపతిగా వుండి అశుభ  గ్రహముగా వుండును. వృశ్చిక లగ్నము యొక్క కుండలిలో బుధుడు లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తి సాహసి మరియు ఙ్ఞాని కాగలడు. బుధుని ప్రభావము కారణముగా వ్యక్తి బోజన పానీయములలో ఆసక్తి గలవాడుగా వుండును. వీరు జన్మించిన తరువాత వీరి తండ్రి గారి ఆర్ధిక పరిస్థితి బలపడును. తండ్రి మరియు తండ్రి పక్షము నుండి స్నేహము మరియు లాభము కలుగును. లగ్నస్థ బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ బావములో స్థితిలో వున్న శుక్రుని రాశి వృషభమును చూస్తున్నాడు. దాని ప్రభావము కారణముగా జీవిత బాగస్వామి మరియు సంతానము నుండి సమ్యోగము లభించగలదు. ధన సేకరణలో నిపుణులు అయినప్పటికీ కొన్ని సమయాలలో  అలవాట్లు మరియు ఉల్లాస సంబందమైన అలవాట్ల కారణముగాను వీరి ఆర్ధిక నష్టములను ఎదుర్కొన వలసి వచ్చును. బుధుడు పాప గ్రహములతో యుది లేదా దృష్టి కలిగి వున్న ఎడల గృహస్థ జీవితము కలహ పూరితమైనదిగా వుండును. ఖర్చులు అధికముగా వుండుటల వలన ఋణములు కూడా తీసుకొనవలసి వచ్చును.


వృశ్చిక లగ్నములో లగ్నస్థ గురువు
గురువు వృశ్చిక లగ్నము యొక్క కుండలిలో ద్వితీయాదిపతి మరియు పంచమాదిపతి కాగలడు. ద్వితీయాదిపతిగా వుండుట వలన భావ కారకత్వం యొక్క శుభ ఫలితాలను పొందుతారు.  త్రికోణాదిపతిగా వుండుట వలన కారక గ్రహము యొక్క ఫలితములను ఇచ్చును. ఈ లగ్నము గల కుండలిలో గురు యది లగ్నస్తుడుగా వుండిన ఎడల వ్యక్తి చూడడానికి అందముగాను మరియు పరిపూర్ణ ఆత్మ విశ్వాసము కలిగి వుండును. గురువు యొక్క ప్రభావము కారణముగా  బుద్ధి కుశలత కలవారై వుండెదరు. వాక్ ప్రభావత కలిగిన వారై వుండెదరు. భవిష్యత్తు కొరకు ధనం కూడ బెట్టు అలవాట్లు వుండుట కారణముగా సాదారణముగా వీరి జీవితము సుఖ మయముగాను మరియు సంతోషమయముగాను వుండును. లగ్నస్థ గురువు తన యొక్క పూర్ణ దృష్టితో పంచమ, సప్తమ మరియు నవమ బావములను చూస్తున్నాడు. గురువు యొక్క దృష్టి కారణముగా వ్యక్తి ధనవంతుడు, సంతానము కలవాడు మరియు గౌరవనీయమైన వ్యక్తికాగలడు. జీవిత బాగస్వామి నుండి సమ్యోగము లభించగలదు.


వృశ్చిక లగ్నములో లగ్నస్థ శుక్రుడు
శుక్రుడు వృశ్చిక లగ్నము గల కుండలిలో సప్తమాదిపతి మరియు ద్వాదశాదిపతిగా వుండుట వలన అశుభ ఫలితాలను ఇచును. శుక్రుడు కుండలిలో లగ్నస్థుడుగా వుండిన ఎడల శరీరము మరియు వ్యవహారములలో విపరీత ప్రభావములను కలిగించును. ఆరోగ్య హాని కలిగించును. మానసికముగా సమస్యలను కలిగించును. వ్యక్తిని కామప్రధునిగాను మరియు విలాసవంతునుగాను చేయును. లగ్నస్థ శుక్రుడు పూర్ణ దృష్టి ద్వారా సప్తమ బావములో స్వరాశి వృషభమును చూస్తున్నాడు. జీవిత బాగస్వామితో మతబేదములు వుండగలవు. జీవిత బాగస్వామి యొక్క ఆరోగ్యము కష్టములతో ప్రభావితము కాగలడు. భాగస్వామి నుండి హాని కలుగవచ్చును. వస్త్రము, శృంగారము మరియు సుగంధ పదార్ధముల వ్యాపారములు వీరికి లాభములను కలిగించును. వ్యవసాయ సంబంద వ్యాపారములు కూడా వీరికి లాభములను కలిగించును.


వృశ్చిక లగ్నములో లగ్నస్థ శని
వృశ్చిక లగ్నము యొక్క కుండలిలో శని తృతీయాదిపతి మరియు చతుర్ధాదిపతిగా వుండుట వలన అశుభ గ్రహము కాగలదు. ఏ వ్యక్తి యొక్క కుండలిలో ఇది ప్రధమ బావములో వుండునో వారికి అరోగ్య సంబంద సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. వీరికి ప్రభుత్వ రంగము నుండి కష్టములు కలుగును. ప్రమాదకర దుర్ఘటన జరిగే అవకాశములు వున్నవి. స్త్రీల కుండలిలో వృశ్చిక లగ్నములో లగ్నస్థ శని సంతాన విషయములో కష్టకారి కాగలడు. ప్రదమస్థ శని తృతీయ, సప్తమ మరియు దశమ బావములను పూర్ణ దృష్టి ద్వారా చూస్తున్నాడు. శని యొక్క దృష్టి ఫలితము కారణముగా సోదరుల నుండి సమ్యోగము లబించగలదు. చాలా ప్రేమ ప్రసంశలు వుండగలవు. మెట్టింటి వారి నుండి లాభము కలుగును. కాని జీవిత బాగస్వామి నుండి వొడిదుడుకులు వుండును.

వృశ్చిక లగ్నములో లగ్నస్థ రాహువు
ఈ లగ్నము యొక్క కుండలిలో రాహువు లగ్నస్థములో వుండిన ఎడల వ్యక్తికి శారీరక సమస్యలు కలుగవచ్చును. ఆరోగ్య హాని కలుగవచ్చును. రాహువు యొక్క దశావదిలో రోగములకు అవకాశములు అధికముగా వుండును. దీని వలన ప్రభావితము అయ్యే వ్యక్తిలో ఆత్మవిశ్వాసము బలహీన పడును. రాహువు యొక్క దృష్టి కారణముగా వ్యక్తికి ఉద్యోగ వ్యాపారములలో కష్టములను ఎదుర్కొన వలసి వచ్చును. అకస్మాత్తుగా హాని కలిగే అవకాశములు వున్నవి.  వైవాహిక జీవితములో కష్టములను ఎదుర్కొన వలసి వచ్చును. జీవిత బాగస్వామితో వివాదములు మరియు వొడిదుడుకులు వుండగలవు. రహస్య ప్రవర్తన కలిగి ఉంటారు.

వృశ్చిక లగ్నములో లగ్నస్థ కేతువు
కేతువు వృశ్చిక లగ్నము యొక్క కుండలిలో వుండిన ఎడల వ్యక్తి సామాన్యముగా అరోగ్యముగా వుండును. కేతువు యొక్క ప్రభావము కారణముగా వ్యక్తి శారీరకముగా శక్తిశాలి మరియు దృడమైన వ్యక్తి కాగలడు. సామాజిక ప్రతిష్ట మరియు గౌరవ మర్యాదలను పొందెదరు. మాతృ పక్షము నుండి స్నేహము మరియు సమ్యోగము లభించగలదు. జీవిత బాగస్వామి మరియు సంతానము యొక్క విషయాలలో కష్టాలు కలూను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...