3, మే 2017, బుధవారం

మిధున లగ్నములో నవగ్రహముల ప్రభావము

మిధున లగ్నములో నవగ్రహముల ప్రభావము

రాశి చక్రము యొక్క మూడవ రాశి మిధునము. మీ కుండలిలో లగ్నబావములో ఈ రాశి వుండిన ఎడల మీ లగ్నము మిధునముగా చెప్పబడును. మీ లగ్నముతో పాటు ప్రధమ బావములో ఏ గ్రహమైతే వుండునో అది మీ లగ్నమును ప్రభావితము చేయును. మీ జీవితములో జరిగే అన్ని విషయములకు ఈ లగ్నములో వున్న గ్రహముల ప్రభావము కూడా వుండవచ్చును.
మిధున లగ్నములో సూర్యుడు
మిధున లగ్నము యొక్క కుండలిలో లగ్నములో  వున్న సూర్యుడు వారి మిత్ర రాశిలో వుండును  సూర్యుని యొక్క ప్రభావము కారణముగా వ్యక్తి యొక్క ముఖముపై రక్తిత్వము ప్రకాశవంతముగా వుండును. వ్యక్తి అందముగాను మరియు ఆకర్షణీయముగాను వుండును. వీరి వ్యక్తిత్వము ఉదార స్వభావము కలిగి వుండును. వీరిలో సాహసము, ధైర్యము మరియు పురుషార్ధము అధికముగా వుండును. బాలావస్థలో వీరు అనేక రోగములను ఎదుర్కొన వలసి వచ్చును. యువావస్థలో కష్టములను మరియు సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. వృద్దావస్థ సుఖము మరియు ఆనందమయముగా వుండును. వీరికి ఆర్దిక సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. సప్తమ బావములో సూర్యుని దృష్టి వుండుట కారణముగా వివాహములో ఆటంకములు కలుగును. వైవాహిక జీవితము అశాంతికరముగా వుండును.


మిధున లగ్నములో చంద్రుడు

మిధున లగ్నములో చంద్రుడు ధన బావమునకు అధిపతి కాగలడు. ఈ రాశిలో చంద్రుడు లగ్నస్థముగా వుండుట కారణముగా వ్యక్తి ధనవంతునిగాను మరియు సుఖముగాను వుండును. వీరు అస్థిర వ్యక్తిత్వము కలవారై వుండెదరు. దుష్టస్వబావము కలిగి వుండును. మనోభలము అధికముగా వుండి వాణి కోమలముగా వుండును. వీరి వ్యక్తిత్వములో మెరటితనము మరియు అభిమానము కూడా సమపాల్లలో వుండును. సంగీతము పట్ల ప్రేమ కలిగి వుండెదరు. లగ్నములో వున్న చంద్రుడు సప్తమ బావమును చూస్తున్నాడు. అందువలన అందముగాను మరియు ఙ్ఞానం గల జీవిత బాగస్వామి లభించగలదు. గృహస్థ జీవితము సుఖమయముగా వుండును. ఆర్ధిక స్థితి బాగుండును ఎందుకంటే ధన సేకరణ చేయుటలో తెలివిగా ప్రవర్తించెదరు. చంద్రునితో పాటు పాప గ్రహములు వుండుట కారణముగా చంద్రుని శుభత ప్రబావితము కాగలదు. అందువలన చంద్రుని ప్రభలముగా చేయుటకు తప్పక ఉపాయములను చేయవలెను.

మిధున లగ్నములో కుజుడు

కుజుడు మిధున లగ్నము యొక్క కుండలిలో శత్రువుగా వుండును. ఇది ఈ రాశిలో షష్టమాదిపతి మరియు ఏకాదశాదిపతి కాగలడు. మిధున లగ్నములో కుజుడు లగ్నస్థుడుగా వుండిన శక్తి మరియు పరాక్రమము కలిగి వుండెదరు. జీవితములో అస్థిరత అధికముగా వుండును. వ్యక్తి యాత్రలను ఆనందించువాడిగా వుండును. సేన లేదా రక్షణా విభాగములో వీరికి సఫలత లభించగలదు. వీరికి తల్లి దండ్రుల నుండి పూర్తి సుఖము లభించక పోవచ్చును. శత్రువుల వలన కూడా వీరికి కష్టము కలుగును. సప్తమ బావములో కుజుని యొక్క దృష్టి కారణముగా గృహస్థ జీవితములో అనేక విధములైన కష్టములు ఎదురుకాగలవు. జీవిత బాగస్వామి ఆరోగ్య సంబందమైన సమస్యలతో పీడించబడగలడు.

మిధున లగ్నములో బుధుడు

బుధుడు మిధున లగ్నము యొక్క అధిపతి. ఈ లగ్నములో ఇది శుభ మరియు కారక గ్రహము. మిధున లగ్నములో ప్రధమ బావములో  వున్న బుధుడు వ్యక్తిని బుద్ధివంతునిగాను, వాక్ పుష్టి మరియు ఉత్తమ స్మరణ శక్తిని ప్రదానించును. వీరు ప్రాకృతికముగానే కుశల వ్యాపార మెలుకవలను తెలిసుకొని వుండెదరు. ఆర్ధిక స్థితి సామాన్యరూపముగా బాగుండును ఎందుకంటే వీరికి ధన సంపాదనకు ఒకే మార్గములో నడిచే అలవాటు లేకుండును. ఒకటి కన్నా ఎక్కువ మార్గముల నుండి ధన సంపాదన చేయుట వీరి వ్యక్తిత్వము యొక్క గుణముగా చెప్పబడును. వీరు లేఖకునిగా, రచయితగా లేదా సంపాదకునిగా సఫలతను పొందగలరు. భూమి, భవనము మరియు వాహన సుఖము లభించగలదు. జీవిత బాగస్వామి నుండి సమ్యోగము మరియు ప్రసన్నత లభించగలదు.

మిధున లగ్నములో గురువు

మిధున లగ్నములో గురువు సప్తమ మరియు దశమ బావము యొక్క అధిపతి కాగలడు.  రెండు కేంద్రములకు అధిపతిగా వుండుట వలన మిధున లగ్నములో గ్రహము శత్రు గ్రహముగా వుండును. ప్రధమ బావములో గురువుతో పాటు బుధుడు వుండిన ఎడల ఇది గురువు యొక్క అశుభ ప్రభావములను తగ్గించును. గురువు యొక్క లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తి అందముగాను మరియు తెల్లగాను వుండును. గురువు యొక్క ప్రభావము కారణముగా వీరికి జలుబు, దగ్గు వంటి సమస్యలు వుండగలవు. చతురత, ఙ్ఞానం మరియు సత్య ఆచరణలు కలిగిన వ్యక్తిగా వుండెదరు. వీరికి సమాజములో గౌరవ మర్యాదలు లభించును. గురువు యొక్క విషేశత ఏమనగా అది దాని సంబందమైన విషయములలో విశెషశుభతను ప్రదానించును మరియు పంచమ, సప్తమ మరియు నవమ బావమునకు సంబందించిన విషయములలో వ్యక్తికి అనుకూల పరిణామములు ప్రాప్తించును. యది లగ్నములో గురువుతో పాటు పాప గ్రహము వుండిన ఎడల పరిణామములు కష్టకరముగా వుండును.

మిధున లగ్నములో శుక్రుడు

మిధున లగ్నము యొక్క కుండలిలో శుక్రుడు పంచమాదిపతి మరియు దశమాదిపతి కాగలడు. త్రికోణాదిపతిగా వుండుట కారణముగా ఈ లగ్నములో శుక్రుడు యోగకారక గ్రహము కాగలడు. లగ్నములో మిత్ర రాశిలో వున్న శుక్రుడు శుభప్రభావములను ఇచ్చు వాడగును. దానివలన కుండలిలో ఈ గ్రహస్థితి వున్న వాళ్ళు చూడటానికి సన్నముగా వున్న ఆకర్షణీయముగా వుంటారు. ఆర్ధిక స్థితి బాగుండును. బౌతిక సుఖముల పట్ల వీరు అత్యంత అభిరుచి కలిగి వుండెదరు మరియు సుఖ సంతోషముల కొరకు ధనమును ఖర్చు చేయుట వీరికి ఇష్టముగా వుండును. సమాజములో గౌరనీయముగా వుండెదరు. సప్తమ బావములో దీని దృష్టి వుండుట కారణముగా వైవాహిక జీవితములో జీవిత బాగస్వామి పట్ల ప్రేమ అబిమానములు వుండును.

మిధున లగ్నములో శని

మిధున లగ్నము యొక్క కుండలిలో శని అష్టమ మరియు నవమ బావము యొక్క అధిపతిగా వుండును. త్రికోణ బావము యొక్క అధిపతిగా వుండుట కారణముగా శని అష్టమ బావమును యొక్క దోషములను దూరము చేయును.  మరియు కారకముగా వాటి పాత్రను పాటించును. మిదున లగ్నము యొక్క కుండలిలో లగ్నములో  వున్న శని ఆరోగ్యముపై కొంతవరకు సమస్యలను కలిగించును. దీని ప్రబావము కారణముగా వ్యక్తి సన్నగా వుండి వాతము, పిత్తము మరియు చర్మరోగముల వలన సమస్యలను కలిగి వుండెదరు. ఇది భాగ్యమును ప్రభలముగా చేయును మరియు ఈశ్వరుని పట్ల శ్రద్దను కలిగించును. లగ్నస్థ శని యొక్క దృష్టి సప్తమ బావములో వుండుట కారణముగా వ్యక్తికి కామ ప్రదమైన కోరికలు అధికముగా వుండును. దశమ బావముపై శని యొక్క దృష్టి ప్రభుత్వ పక్షము నుండి దండనను మరియు కష్టములను కలిగించును. తల్లి దండ్రుల సంబందములలో కష్టములను కలిగించును. శని వ్యక్తిని పరిశ్రమిగా చేయును.

మిధున లగ్నములో రాహువు

రాహువు మిధున లగ్నములో మిత్రరాశిలో వుండును. ఈ రాశిలో రాహువు ఉచ్చరాశిలో వుండుట కారణముగా వ్యక్తిని తెలివిగల వాడిగాను మరియు కార్య కుశలత గల వ్యక్తిగాను చేయును.  వ్యక్తి వారి పని చేపట్టులలో తెలివిగా వుండెదరు. వీరిలో సాహసము అధికముగా వుండును. లగ్నస్థ రాహువు వ్యక్తిని ఆకర్షణీయముగాను మరియు అరోగ్యకరమైన శరీరమును ప్రదానించును. మిదున లగ్నము గల స్త్రీలకు లగ్నస్థ రాహువు సంతానము యొక్క సందర్బములో కష్టములను కలిగించును. రాహువు వీరి వైవాహిక జీవితములో కలహములను ఉత్పన్నము చేయును. 

మిధున లగ్నములో కేతువు

కేతువు మిధున లగ్నము యొక్క కుండలిలో వుండుట కారణముగా స్వాబిమానములో లోపము ఏర్పడవచ్చును. స్వతంత్ర రూపముగా పనిచేయక ఇతరులతో పాటు పనిచేయుటలో ఎక్కువ ఆసక్తి కలిగి వుండెదరు. వ్యాపారములో కోరిక, మరియు ఉద్యోగము చేయుట వీరికి ఇష్టము. వీరు స్వార్ధ ప్రవృత్తి కలిగిన వారై వుండెదరు. కేతువు యొక్క ప్రబావము కారణముగా వాతము మరియు పిత్తము వంటి వ్యాదులు వీరిని బాదించును. కామ ప్రదమైన కోరికలు వీరికి ప్రభలముగా వుండును. వైవాహిక జీవితము వొడిదుడుకులలో వుండును.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...