31, మే 2017, బుధవారం

108 నవాంశలు వాటి ఫలితాలు.

108 నవాంశలు వాటి ఫలితాలు.

27 నక్షత్రాలలోను ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. మొత్తం నూట ఎనిమిది పాదాలే గాక వాటికి విడివిడిగా రాశ్యంశలు కూడా ఉంటాయి.

           అశ్వని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణం, పూర్వాభాద్ర అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు మేషాంశకు, ద్వితీయ పాదాలు వృషభాంశకు, తృతీయ పాదాలు మిధునాంశకు, చతుర్ధ పాదాలు కర్కటాంశకు చెంది ఉంటాయి.

          భరణి, మృగశిర, పుష్యమి, పుబ్బ, చిత్ర, అనూరాధ, పూర్వాషాడ, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు సింహాంశకు, ద్వితీయ పాదాలు కన్యాంశకు, తృతీయ పాదాలు తులాంశకు, చతుర్ధ పాదాలు వృశ్చికాంశకు చెంది ఉంటాయి.


         కృత్తిక, ఆరుద్ర, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, జ్యేష్ఠ, ఉత్తరాషాడ, శతభిషం, రేవతి  అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు ధనురాంశకు, ద్వితీయ పాదాలు మకరాంశకు, తృతీయ పాదాలు కుంభాంశకు, చతుర్ధ పాదాలు మీనాంశకు చెంది ఉంటాయి.

1) అశ్వని నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
1) తస్కరాంశ:- అశ్వని నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. మంచి సంపద, భోగాలను అనుభవించువాడు, తగాదాలనిన ఇష్టం కలవాడు, లోభ గుణం కలవాడు, పరస్త్రీల యందు ఆసక్తి కలవాడు, చోర గుణం కలవాడు అగును.
2) భోగ్యాంశ:- అశ్వని నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ధర్మ నిరతుడు, తేజస్సు కలవాడు, ధన, ధాన్యాభివృద్ధి కలవాడు, దాన గుణం కలవాడు అగును.
3) విచక్షణాంశ:- అశ్వని నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. సమస్త భోగాలు కలవారు, ప్రతి పనిని సాధించువాడు, పనులను నేర్పుతో చేయువాడు అగును.
4) ధర్మాంశ:-అశ్వని నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది.  భగవంతుడి పైన భక్తి కలవాడు, పూజలు చేయువాడు, సంధ్యావందన తత్పురుడును, నిత్యం ధర్మ కార్యాచరణలో ఉండువారు అగును.


2) భరణి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
5)నృపాంశ:- భరణి నక్షత్ర ప్రధమ పాదం రవిది. గౌరవ, మర్యాదలు పొందువారు, మంచి లక్షణాలు కలిగి ఉంటారు. కార్య సఫలత కలవారు, ధర్మాత్ముడు అగును.
6) నపుంసకాంశ:- భరణి నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. లోభత్వం కలవారు, నపుంసకుడు, పిసినారి, పనులయందు నేర్పరి, మధ్యవర్తిత్వం చేయువారు అగును.
7) అభయాంశ:-భరణి నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ప్రశాంతమైన మనస్సు కలవారు, ఉత్సాహవంతులు, శూరులు, బాద్యతారాహిత్యమైన జీవితాన్ని ఆశించేవారు అగును.
8) పాపాంశ:- భరణి నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. క్రూర స్వభావం కలవారు, కృతజ్ఞత కలవారు, అధిక పుత్ర సంతానవంతులు, ఫలితాలను ఆశించని వారు అగును.

24, మే 2017, బుధవారం

వృశ్చిక లగ్నములో లగ్నస్థ నవ గ్రహముల ఫలితములు

వృశ్చిక లగ్నములో లగ్నస్థ నవ గ్రహముల ఫలితములు


వృశ్చిక లగ్నము యొక్క అధిపతి కుజుడు. సూర్యుడు, చంద్రుడు, గురువు ఈ లగ్నములో యోగ కారక గ్రహములు కాగలరు. కుజుడు కూడా లగ్నాదిపతిగా వుండుట వలన యోగకారక గ్రహము కాగలడు. బుధుడు, శుక్రుడు మరియు శని బలహీన ఫలితములను ఇచ్చును. లగ్న బావములో నవ గ్రహములు వున్నప్పుడు ఇది వ్యక్తి యొక్క జీవితమును ఏవిదముగా ప్రభావితము చేయును, మరియు ఏ గ్రహము యొక్క ఏ ఫలితము వుండునో పరిశీలిద్దాము.

వృశ్చిక లగ్నములో లగ్నస్థ సూర్యుడు
వృశ్చిక లగ్నము గల కుండలిలో సూర్యుడు దశమాదిపతిగా వుండుట వలన యోగకారక గ్రహము కాగలడు. కుజుని యొక్క రాశిలో లగ్నస్థముగా వుండి సూర్యుడు వ్యక్తికి ఆత్మబలమును ప్రసాదించును. ఇది బుద్దివంతునిగాను మరియు మహిమాన్వితునిగాను చేయును. ప్రభుత్వ పక్షము నుండి లాభములను కలిగించును. సూర్యుడు కర్మాదిపతిగా వుండుట వలన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగము లభించుటకు అవకాశములు ప్రభలముగా వున్నవి. ఏ వ్యక్తి యొక్క కుండలిలో ఈ స్థితి వున్నదో వారికి తండ్రి వద్ద నుండి సమ్యోగము మరియు స్నేహము లభించగలదు. పిత్రార్జితం లభించగలదు.సప్తమ బావములో స్థితిలో వున్న శుక్రుని రాశి వృషభముపై సూర్యుని యొక్క దృష్టి శృంగార మరియు సౌందర్య సంబందమైన వస్తువుల వ్యాపారము వీరికి విషేశ లాభములను ఇచ్చును. జీవిత బాగస్వామితో అశాంతి వుండును కాని తల్లిగారితో స్నేహపూరితమైన బందములు వుండగలవు.


వృశ్ఛిక లగ్నములో లగ్నస్థ చంద్రుడు
వృశ్చిక లగ్నము యొక్క కుండలిలో చంద్రుడు భాగ్యాధిపతి మరియు త్రికోణాధిపతి కాగలడు. ఇది ఈ లగ్నము గల జాతకునికి చాలా శుభ పలదాయకముగా వుండును. లగ్నములో చంద్రుడు స్థితిలో వుండుట వలన వ్యక్తి చూడడానికి అందముగాను మరియు ఆకర్షణీయముగాను వుండును. వీరు ప్రభావశాలి వ్యక్తిత్వము గలవారై వుండెదరు. వీరిలో దార్మిక బావన అధికముగా వుండును. తీర్ధాటనము చేయుట వలన వీరికి ఆనందము లభించును. దయ మరియు కరుణభావన వీరిలో వుండును. వీరిలో నడుము నెప్పి మరియు పిత్త సంబందమైన రోగములు కలిగే అవకాశములు వున్నవి. భాగ్యము యొక్క బలము కారణముగా వీరి పని సునాయసముగా జరుగును మరియు గౌరవ మర్యాదలను మరియు ప్రత్యేకతలను పొందగలరు. సప్తమ బావములో చంద్రుని యొక్క దృష్టి కారణముగా అందమైన మరియు సుయోగ్యమైన జీవిత బాగస్వామి ప్రాప్తించును. జీవిత బాగస్వామి నుండి వీరికి సమ్యోగము లభించును.


వృశ్చిక లగ్నములో లగ్నస్థ కుజుడు
వృశ్చిక లగ్నములో కుజుడు లగ్నాదిపతిగా వుండుట వలన శుభ యోగకారక గ్రహము కాగలడు. షష్టమ బావము యొక్క అధిపతిగా వుండుట వలన భావ కారకత్వం యొక్క శుభ ఫలితాలను ఇవ్వగలదు.  లగ్నాదిపతిగా వుండుట వలన శుభ ప్రభావములనే ఇచ్చును. లగ్నస్థుడుగా వుండుట వలన విశేష లాభకారిగా వుండును. ప్రధమ బావములో స్థితిలో వున్న గ్రహములు వ్యక్తికి దీర్ఘాయువును ప్రదానించును. వ్యక్తిని శారీరకముగా శక్తిశాలి, పరిశ్రమి మరియు నిరోగిగా చేయును. శత్రువుల వలన వీరు భయబీతి పొందరు. సమాజములో వీరి గౌరవ మర్యాదలతో ఆదరణీయముగా వుండెదరు. మాతృ పక్షము నుండి వీరికి లాభము కలుగును. లగ్నస్థ కుజుడు చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావములను చూస్తున్నాడు. కుజుడు ఏ బావమునైతే చూస్తాడో ఆ బావము యొక్క ఫలితములు పీడించబడగలవు. అనగా భూమి, భవనము మరియు వాహన సుఖము బలహీన పడగలదు. తల్లితో కూడా మతబేధములకు అవకాశములు వుండును. జీవిత బాగస్వామికి కష్టములు కలుగును. వైవాహిక జీతివములో కష్టములను ఎదుర్కొన వలసి వచ్చును.


వృశ్చిక లగ్నములో లగ్నస్థ బుధుడు
బుధుడు శుభ గ్రహము అయినప్పటికీ ఈ లగ్నములో అష్టమాదిపతి మరియు దశమాదిపతిగా వుండి అశుభ  గ్రహముగా వుండును. వృశ్చిక లగ్నము యొక్క కుండలిలో బుధుడు లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తి సాహసి మరియు ఙ్ఞాని కాగలడు. బుధుని ప్రభావము కారణముగా వ్యక్తి బోజన పానీయములలో ఆసక్తి గలవాడుగా వుండును. వీరు జన్మించిన తరువాత వీరి తండ్రి గారి ఆర్ధిక పరిస్థితి బలపడును. తండ్రి మరియు తండ్రి పక్షము నుండి స్నేహము మరియు లాభము కలుగును. లగ్నస్థ బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ బావములో స్థితిలో వున్న శుక్రుని రాశి వృషభమును చూస్తున్నాడు. దాని ప్రభావము కారణముగా జీవిత బాగస్వామి మరియు సంతానము నుండి సమ్యోగము లభించగలదు. ధన సేకరణలో నిపుణులు అయినప్పటికీ కొన్ని సమయాలలో  అలవాట్లు మరియు ఉల్లాస సంబందమైన అలవాట్ల కారణముగాను వీరి ఆర్ధిక నష్టములను ఎదుర్కొన వలసి వచ్చును. బుధుడు పాప గ్రహములతో యుది లేదా దృష్టి కలిగి వున్న ఎడల గృహస్థ జీవితము కలహ పూరితమైనదిగా వుండును. ఖర్చులు అధికముగా వుండుటల వలన ఋణములు కూడా తీసుకొనవలసి వచ్చును.


వృశ్చిక లగ్నములో లగ్నస్థ గురువు
గురువు వృశ్చిక లగ్నము యొక్క కుండలిలో ద్వితీయాదిపతి మరియు పంచమాదిపతి కాగలడు. ద్వితీయాదిపతిగా వుండుట వలన భావ కారకత్వం యొక్క శుభ ఫలితాలను పొందుతారు.  త్రికోణాదిపతిగా వుండుట వలన కారక గ్రహము యొక్క ఫలితములను ఇచ్చును. ఈ లగ్నము గల కుండలిలో గురు యది లగ్నస్తుడుగా వుండిన ఎడల వ్యక్తి చూడడానికి అందముగాను మరియు పరిపూర్ణ ఆత్మ విశ్వాసము కలిగి వుండును. గురువు యొక్క ప్రభావము కారణముగా  బుద్ధి కుశలత కలవారై వుండెదరు. వాక్ ప్రభావత కలిగిన వారై వుండెదరు. భవిష్యత్తు కొరకు ధనం కూడ బెట్టు అలవాట్లు వుండుట కారణముగా సాదారణముగా వీరి జీవితము సుఖ మయముగాను మరియు సంతోషమయముగాను వుండును. లగ్నస్థ గురువు తన యొక్క పూర్ణ దృష్టితో పంచమ, సప్తమ మరియు నవమ బావములను చూస్తున్నాడు. గురువు యొక్క దృష్టి కారణముగా వ్యక్తి ధనవంతుడు, సంతానము కలవాడు మరియు గౌరవనీయమైన వ్యక్తికాగలడు. జీవిత బాగస్వామి నుండి సమ్యోగము లభించగలదు.


వృశ్చిక లగ్నములో లగ్నస్థ శుక్రుడు
శుక్రుడు వృశ్చిక లగ్నము గల కుండలిలో సప్తమాదిపతి మరియు ద్వాదశాదిపతిగా వుండుట వలన అశుభ ఫలితాలను ఇచును. శుక్రుడు కుండలిలో లగ్నస్థుడుగా వుండిన ఎడల శరీరము మరియు వ్యవహారములలో విపరీత ప్రభావములను కలిగించును. ఆరోగ్య హాని కలిగించును. మానసికముగా సమస్యలను కలిగించును. వ్యక్తిని కామప్రధునిగాను మరియు విలాసవంతునుగాను చేయును. లగ్నస్థ శుక్రుడు పూర్ణ దృష్టి ద్వారా సప్తమ బావములో స్వరాశి వృషభమును చూస్తున్నాడు. జీవిత బాగస్వామితో మతబేదములు వుండగలవు. జీవిత బాగస్వామి యొక్క ఆరోగ్యము కష్టములతో ప్రభావితము కాగలడు. భాగస్వామి నుండి హాని కలుగవచ్చును. వస్త్రము, శృంగారము మరియు సుగంధ పదార్ధముల వ్యాపారములు వీరికి లాభములను కలిగించును. వ్యవసాయ సంబంద వ్యాపారములు కూడా వీరికి లాభములను కలిగించును.


వృశ్చిక లగ్నములో లగ్నస్థ శని
వృశ్చిక లగ్నము యొక్క కుండలిలో శని తృతీయాదిపతి మరియు చతుర్ధాదిపతిగా వుండుట వలన అశుభ గ్రహము కాగలదు. ఏ వ్యక్తి యొక్క కుండలిలో ఇది ప్రధమ బావములో వుండునో వారికి అరోగ్య సంబంద సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. వీరికి ప్రభుత్వ రంగము నుండి కష్టములు కలుగును. ప్రమాదకర దుర్ఘటన జరిగే అవకాశములు వున్నవి. స్త్రీల కుండలిలో వృశ్చిక లగ్నములో లగ్నస్థ శని సంతాన విషయములో కష్టకారి కాగలడు. ప్రదమస్థ శని తృతీయ, సప్తమ మరియు దశమ బావములను పూర్ణ దృష్టి ద్వారా చూస్తున్నాడు. శని యొక్క దృష్టి ఫలితము కారణముగా సోదరుల నుండి సమ్యోగము లబించగలదు. చాలా ప్రేమ ప్రసంశలు వుండగలవు. మెట్టింటి వారి నుండి లాభము కలుగును. కాని జీవిత బాగస్వామి నుండి వొడిదుడుకులు వుండును.

17, మే 2017, బుధవారం

తులా లగ్నములో లగ్నస్థ నవగ్రహములు

తులా లగ్నములో లగ్నస్థ నవగ్రహములు

తులా లగ్నము యొక్క అధిపతి శుక్రుడు. ఈ లగ్నములో జన్మించిన వ్యక్తి చూడటానిని అందముగా వుండును. సత్యవాదిగా వుండెదరు. వీరిలో పరోపకారము యొక్క భావన వుండును. గృహస్థ జీవితము కూడా సామాన్యముగా సుఖదాయకముగా వుండును. ఈ లగ్నములో ప్రధమ బావములో స్థితిలో గ్రహముల కారణముగా వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు అనుభూతులు వుండగలవు.

తులా లగ్నములో లగ్నస్థ సూర్యుడు 

తులా లగ్నము యొక్క కుండలిలో సూర్యుడు ఏకాదశ బావము యొక్క అధిపతిగా శత్రు స్ధానంలో ఉన్నాడు. శత్రు రాశి యొక్క లగ్నములో వున్న సూర్యుడు వ్యక్తికి నేత్ర సంబందమైన రోగములను ఇచ్చును. లాభ భావం యొక్క అధిపతిగా వుండుట వలన తిరిగి తిరిగి ఆర్ధిక స్థితి ప్రభావితము కాగలదు. ఆర్ధిక లావాదేవీలలో  లోపమును తీసుకువచ్చును. లగ్నములో సూర్యునితో పాప గ్రహముల యుతి లేదా దృష్టి కలిగి వుండిన ఎడల వ్యక్తి ఉగ్రము మరియు క్రోదస్వబావము కలవారై వుండెదరు. ప్రధమ బావములో స్థితిలో వున్న సూర్యుడు వారి సప్తమ దృష్టి ద్వారా సప్తమ బావములో స్థితిలో వున్న మేషరాశిని చూస్తున్నాడు. సూర్యుని యొక్క దృష్టి కుజునిపై వుండుట కారణముగా వ్యక్తి సాహసము మరియు పరాక్రమము కలవాడై వుండును. వీరి వివాహము విల్లంభములతో కూడినదై వుండును మరియు జీవిత బాగస్వామితో సమ్యోగములో లోపము వుండగలదు.

తుల లగ్నములో లగ్నస్థ చంద్రుడు

చంద్రుడు తుల లగ్నము గల కుండలిలో లగ్నస్థుడుగా వుండుట వలన వ్యక్తి బాల్యము సంఘర్షణతో కూడి కఠినముగా వుండును. యువావస్త మరియు వృద్దావస్త సుఖమయముగాను మరియు ఆనందమయముగాను కొనసాగును. చంద్రుడు వీరిని గుణవంతునిగాను మరియు విద్వానునిగాను చేయును. వీరి మనస్సు కల్పనాశీలత మరియు అస్తిరత్వముతో కూడినదై వుండును. ఈ లగ్నములలో చంద్రుడు దశమాదిపతిగా వుండి అశుభ కారకుడు కాగలడు. సప్తమ బావములో దీని దృష్టి వుండుట వలన జీవిత బాగస్వామి క్రోది, సాహసి మరియు మహత్వకాంక్ష కలవారై వుండెదరు. లగ్నస్థ చంద్రుడు యది శుభ గ్రహములతో యుతి లేదా ధృష్టి కలిగి వున్న ఎడల సప్తమ బావముతో సంబందిత ఉత్తమ ఫలితములను పొందగలరు.

తుల లగ్నములో లగ్నస్థ కుజుడు

తుల లగ్నము గల కుండలిలో కుజుడు ద్వితీయ మరియు సప్తమ బావము యొక్క అధిపతి కాగలడు. ప్రధమ బావములో స్థితిలో వున్న కుజుడు వ్యక్తిని ద్వితీయాదిపతుడుగా వుండుట వలన ఆర్ధిక లాభములను కలిగించును. వ్యాపారము మరియు వర్తకములలో మంచి సఫలత లభించగలదు. స్వతంత్రముగా పనిచేపట్టుట వలన వీరికి లాభములు కలుగును. బాగస్వామ్యకత్వములో అధికముగా నష్టము కలిగే అవకాశములు వున్నవి. లగ్నస్థ కుజుడు వారి పూర్ణ ధృష్టితో చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావములను చూస్తున్నాడు. సుఖ బావములో కుజునితో దృష్టి కలిగి వుండుట కారణముగా సోదరుల నుండి అపేక్షిత సమ్యోగము లభించకపోవచ్చును. పూర్ణ భౌతిక సుఖము లభించుటకు అవకాశములు తక్కువగా వున్నవి. వైవాహిక జీవితములో కష్టములను ఎదుర్కొన వలసి వచ్చును. అష్టమ బావము పీడించబడి వుండుట వలన కుజుని యొక్క దశావదిలో అరోగ్య సంబందమైన సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును.

12, మే 2017, శుక్రవారం

కన్యా లగ్నములో నవగ్రహముల ఫలితములు


కన్యా లగ్నములో నవగ్రహముల ఫలితములు

బుధుడు కన్యా రాశి యొక్క అధిపతి. ఈ లగ్నములో జన్మించు వ్యక్తి బుద్దివంతుడుగాను, వివేక వంతుడుగాను మరియు వ్యాపారములో నిపుణత కలిగి వుండెదరు. ఈ లగ్నములో ఏ వ్యక్తి యొక్క జననము కలుగునో వారు కల్పనాశీలత కలవారై కోమల హృదయము కలవారై వుండెదరు. ఈ లగ్నములో లగ్నస్థ గ్రహముల యొక్క ఫలితములు వేరువేరుగా వుండును.

కన్యా లగ్నములో లగ్నస్థ సూర్యుడు

కన్యా లగ్నము యొక్క కుండలిలో సూర్యుడు ద్వాదశమాదిపతిగా  వున్నాడు  ఏ వ్యక్తి యొక్క కుండలిలో కన్యా లగ్నములో సూర్యుడు లగ్నస్థములో వుండునో వారు చూడడానికి అందముగా వుంటారు. వీరి వ్యక్తిత్వము ప్రభావశాలిగా వుండును. వీరికి దగ్గు, జలుబు మరియు హృదయ సంబందమైన సమస్యలు కలిగే అవకాశములు వున్నవి. సూర్యుని ప్రభావము కారణముగా వీరికి విదేశ యాత్రలు చేసే అవకాశము కూడా కలుగవచ్చును. లగ్నస్థ సూర్యుని యొక్క ధృష్టి సప్తమ బావముపై వుండుట వలన గృహస్థ జీవితములోని సుఖములో లోపము ఏర్పడవచ్చును. కృషి మరియు జన క్షేత్రమునకు సంబందమైన వ్యాపారములు వీరికి లాభదాయకముగా వుండును. లగ్నములో  వున్న సూర్యుడు అశుభ గ్రహములతో యుతి లేదా ధృష్టి కలిగి వున్న ఎడల అనారోగ్య సమస్యలు కలుగవచ్చును.

కన్నా లగ్నములో లగ్నస్థ చంద్రుడు

చంద్రుడు కన్యా లగ్నము యొక్క కుండలిలో ఏకాదశాదిపతిగా వుండును. చంచల మనస్తత్వం కలుగును. బయటకు చెప్పుకోలేని మానసికమైన సమస్యలు అనుభవిస్తారు.  లగ్నస్థుడుగా వుండుట వలన చంద్రుడు వ్యక్తిని అందమైన మరియు కల్పనాశీలత కలవాడుగా చేయును. చంద్రుని యొక్క ప్రభావము కారణముగా వ్యక్తి దయ మరియు ఆత్మ విశ్వాసము కలవాడుగా వుండును. వీరు వారి జీవితములో తీవ్రగతిలో ప్రగతిని సాదించెదరు. సప్తమ బావములో స్థితిలో వున్న గురువు యొక్క రాశిపై చంద్రుని దృష్టి వుండుట కారణముగా జీవిత బాగస్వామితో ప్రేమపూరితమైన సంబందములు కలిగి వుండును. జీవిత బాగస్వామితో అపేక్షిత సమ్యోగము కూడా ప్రాప్తించవచ్చును. వీరికి అకస్మాత్తుగా లాభము కలుగును. యది లగ్నస్థ చంద్రుడు అశుభ గ్రహముతో దృష్టి లేదా యుతి కలిగి వున్న ఎడల కష్టకారిగాను మరియు పీడాకారిగాను వుండును.

కన్యా లగ్నములో లగ్నస్థ కుజుడు

కుజుడు కన్యా లగ్నము యొక్క కుండలిలో తృతీయాదిపతి మరియు అష్టమాదిపతిగా వుండి శత్రు స్ధానంలో ఉండును. కుజుడు కన్యా లగ్నములో లగ్నస్థముగా వుండి వ్యక్తిని క్రోదము మరియు ఉగ్రము కలవాడుగా చేయును. చతుర్ధ బావములో కుజుని యొక్క ధృష్టి సోదరులతో అనుకూల సంబందములను కలిగించును. మరో ప్రక్క తల్లి దండ్రుల నుండి విభేదములను కలిగించును. ప్రధమ బావములో స్థితిలో వున్న కుజుడు తండ్రికి ఆరోగ్య సంబందమైన సమస్యలను కలిగించును. అష్టమ బావములో కుజుని దృష్టి వుండిన ఎడల శారీరక కష్టములు కలిగే అవకాశములు వుండును. గృహస్థ జీవనము కొరకు కుజుని యొక్క ఈ స్థితి శుభకారిగా వుండదు.  లగ్నస్థ కుజుడు సప్తమ బావములోని ఫలితములను పీడితము చేయును. భాగస్వాముల వలన మోసపోయే అవకాశము వున్నది. కోపస్వభావము, దూకుడు తనం వలన సహకారాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.

10, మే 2017, బుధవారం

బుధాదిత్య యోగం

బుధాదిత్య యోగం

శ్లో :-మేషే సింహే యదా భానుః సోమ పుత్రేణ సంయుతః
దీర్ఘయుర్భల సంపన్నో సాధకో బహు పోషకః

సూర్యుడికి ఉచ్చ స్ధానమైన మేషంలోగాని, స్వక్షేత్రమైన సింహాంలో గాని రవి, బుధులు కలిసి ఉండటం బుధాదిత్య యోగం అవుతుంది. ఈ బుధాదిత్య యోగం కలిగిన జాతకులు దీర్ఘాయుర్ధాయం కలిగి ఉంటారు. శక్తి సామర్ధ్యాలు కలిగి ఉంటారు. అనేకమందిని పోషించే సాధకునిగా చేస్తుంది. బుధాదిత్య యోగం రవి, బుధులు కన్య, మిధున రాశులలో ఉన్న ఏర్పడుతుందని కొందరి భావన.

8, మే 2017, సోమవారం

సింహ లగ్నములో నవగ్రహముల యొక్క ఫలితములు

సింహ లగ్నములో నవగ్రహముల యొక్క ఫలితములు

ఏ వ్యక్తి యొక్క జననము సింహ లగ్నములో కలుగునో వారు చూడడానికి అందముగాను మరియు అరోగ్యముగాను వుండెదరు. వీరు మహత్వకాంక్ష కలిగి మొండి స్వబావము కలిగి వుండెదరు. వీరు ఎంత సాహసము కలవారో అంతే ఆత్మవిశ్వాసము కలవారు కూడా. వీరిలో సాహసము మరియు ఆత్మ విశ్వాసము అధికముగా వుండును. రాజనీతిలో వీరికి అభిరుచి వుండును. ఈ లగ్నము గల కుండలిలో ప్రధమ బావములో స్థితిలో వున్న గ్రహములు ఏ ప్రకారము ఫలితములను ఇచ్చునో పరిశీలిద్దాము.


సింహ లగ్నములో లగ్నస్థ సూర్యుడు

సూర్యుడు సింహ లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతిగా వుండి శుభకారక గ్రహముగా వుండును. స్వరాశిలో వున్న సూర్యుడు వ్యక్తిని గుణవంతునిగాను మరియు విద్వావంతునిగాను చేయును. ఇది వ్యక్తిలో ఆత్మ విశ్వాసమునకు పరిపూర్ణతను కలిగించును. వారి కార్య కుశలత మరియు ప్రతిభ కారణముగా సమాజములో సన్మానితులు కాగలరు. వీరు ఏ పనిని చేపట్టిన పూర్తి మనోభలముతో చేపట్టెదరు. కార్యములలో త్వరత్వరగా మార్పులను తీసుకొని వచ్చుట వీరు ఇష్టపడరు. వీరు పరాక్రమము కలవారు. ఇతరులకు ఉదార స్వబావముతో సహాయము చేయుదురు. ప్రధమ బావములో స్థితిలో వున్న సూర్యుడు సప్తమములో స్థితి శని యొక్క రాశి కుంభరాశిని చూస్తున్నాడు. దానివలన దాంపత్య జీవితములో అశాంతి కలిగి వుండును. మిత్రుల నుండి మరియు బాగస్వాముల నుండి కోరుకున్న సమ్యోగము లభించక పోవచ్చును. సూర్యుడు లగ్నంలో ఉండటం వలన దీర్ఘకాలిక కోపాలను మనసులో దాచుకొని హృదయ సంబంధ అనారోగ్యాలను పొందుతారు. పొగడ్తలకు లొంగిపోతారు. 
  

సింహ లగ్నములో లగ్నస్థ చంద్రుడు 
చంద్రుడు సింహ లగ్నము యొక్క కుండలిలో ద్వాదశ బావమునకు అధిపతి. ఈ దశావదిలో ఇది మిత్రుడు కావటం వలన శుభ మరియు వ్యయాధిపతి కావటం వలన అశుభ రెండు ప్రకారముల ఫలితములను ప్రదానించును. సింహరాశిలో చంద్రుడు లగ్నములో స్థితిలో వుండిన ఎడల వ్యక్తి చురుకైన స్వబావము కలిగి వుండెదరు. వీరి మనస్సు స్థిరత్వము లేకుండా వుండును. మరియు ఒక చోట వీరు నిలకడగా వుండుటకు ఇష్టపడరు. వీరు ఏ విదమైన సహాయమునైనా నిశ్వార్ధ రూపముగా చేయుటకు ఇష్ట పడతారు. వీరు మంచి స్వబావము కలిగినవారై వుండెదరు. వీరికి తల్లి దండ్రుల నుండి ప్రేమ మరియు సమ్యోగము లభించగలదు. చంద్రుడు వీరికి రాజనీతిలో సఫలతను పొందుటకు సమ్యోగమును ఇచ్చును. సప్తమ బావములో చంద్రుని దృష్టి కుంబముపై వుండుట వలన వైవాహిక జీవితములో కష్టములు కలుగును. చంద్రునితో పాప గ్రహములు వుండుట వలన చంద్రుని శుభ స్థితిలో లోపము ఏర్పడవచ్చును.


సింహ లగ్నములో లగ్నస్థ కుజుడు 
కుజుడు సింహ లగ్నము యొక్క కుండలిలో మిత్ర స్ధానములో ఉండుట వలన శుభకారక గ్రహము కాగలడు. ఇది ఈ లగ్నములో చతుర్ధ మరియు నవమ బావము యొక్క అధిపతి కాగలడు. లగ్నములో కుజుడు వ్యక్తిని సాహసి, నిర్బయుడు మరియు ఆత్మ విశ్వాసముతో పరిపూర్ణముగా చేయును. వ్యక్తి ఒకటి కన్న ఎక్కువ విధముగా ధనమును ప్రాప్తి చెందగలడు. లగ్నములో  వున్న కుజుడు చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావములను చూస్తున్నాడు. కుజుని యొక్క దృష్టి వలన బాగస్వామితో విరోధములకు కారణము కాగలదు. వైవాహిక జీవితములో వొడిదుడుకులు వుండగలవు మరియు శత్రువుల ద్వారా పీడించబడగలరు. కుజుని ప్రబావము వలన సంతానము కలుగును కాని చాలా పరీక్షించవలసి వుండును. లగ్న కుజుడు వేరేవాళ్ళ మీద కోపాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. తొదరగా కోపాన్ని తెచ్చుకుంటారు. తరువాత పశ్చాత్తాప పడతారు.


సింహ లగ్నములో లగ్నస్థ బుధుడు 
సింహ లగ్నము యొక్క కుండలిలో బుధుడు ద్వితీయ మరియు ఏకాదశ బావము యొక్క అధిపతి కాగలడు. ఈ లగ్నము గల వ్యక్తికి రెండు ధన స్ధానాలకు అధిపతి కావటం వలన ధనము కారకముగా వుండును. ఈ లగ్నములో బుధుడు  ఉన్న ఎడల వ్యక్తి ధనవంతుడు కాగలడు. వీరి కళలకు సంబందించిన ఏ రంగములోనైనా సంబందములను కలిగి వుండవచ్చును. వీరికి శత్రుభయము ఎల్లప్పుడూ వుండును. సప్తమ బావములో బుధుని యొక్క దృష్టి జీవిత బాగస్వామి పట్ల ప్రేమను పెంచును. వీరు వారి జీవిత బాగస్వామి పట్ల ప్రేమ కలిగి వుండెదరు. కాని జీవిత బాగస్వామి నుండి వీరికి అనుకూల సమ్యోగము లభించదు. సంతాన సుఖము విల్లంబములను కలిగినదై వుండును. బుధునితో పాటు పాప గ్రహములు లేదా శత్రు గ్రహముల యుతి కలిగి వుండిన ఎడల బుధుని శుభ ప్రభావములో లోపము ఏర్పడవచ్చును.

5, మే 2017, శుక్రవారం

కర్కాటక లగ్నములో నవగ్రహములు

కర్కాటక  లగ్నములో నవగ్రహములు

కర్కాటక లగ్నము యొక్క అధిపతి చంద్రుడు.  మీ లగ్నము  కర్కాటకమైన ఎడల మీరు ప్రయాణములందు ఆసక్తి కలిగి వుండెదరు. మీ కల్పనాశీలత మరియు స్మరణ క్షమత బాగుండును. మీలో ఎల్లప్పుడు ప్రగతిబాటలో ముందుకు నడిచే కోరిక కలిగి వుండెదరు. యది మీ కుండలిలో లగ్న బావములో మరే గ్రహమైనా వున్న ఎడల దానివలన మీరు ప్రబావితులు కాగలరు.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ సూర్యుడు
కర్కాటక లగ్నము యొక్క కుండలిలో సూర్యుడు ద్వితీయ బావము యొక్క అధిపతి కాగలడు. ప్రధమ బావములో చంద్రుని యొక్క రాశి కటకములో వుండుట వలన గ్రహము ఆరోగ్య సంబందమైన విషయములో కష్టకారిగా వుండును. సూర్య దశలో ఆరోగ్యము వలన వ్యక్తి కష్టపడుచుండును. వీరిలో అభిమానము మరియు కోపము వుండును. వీరిలో వ్యాపారము పట్ల అపేక్ష మరియు ఉద్యోగము చేయుట ఇష్టకరముగాను వుండును. ప్రభుత్వ సంబంద విషయములలో సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. తండ్రితో మతబేదములు వుండును. వీరు నిలకడగా ఒకచోట కూర్చొనుటకు ఇష్టపడరు. బందుమిత్రులతో వివాదములను ఎదుర్కొన వలసి వుండును.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ చంద్రుడు

చంద్రుడు కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతిగా వుండుట కారణముగా శుభకారక గ్రహముగా వుండును. చంద్రుడు స్వరాశిగా వుండును. మంచి స్వబావము కలిగి పరోపకారిగా వుండును. వీరిలో భగవంతుని పట్ల భక్తి మరియు పెద్దవారిపై గౌరవ మర్యాదలు కలిగి వుండెదరు. వీరిలో మనోభలము అధికముగా వుండును. వారి ప్రయత్నములో సమాజములో ఉన్నత స్థానమును పొందెదరు. వ్యాపారములో వీరికి సఫలత లభించును. కళా క్షేత్రములో కూడా వీరికి మంచి సఫలత లభించగలదు. చంద్రుని యొక్క దృష్టి సప్తమ బావములో వుండుట కారణముగా జీవితభాగస్వామి యొక్క సంబందములలో ఉత్తమ ఫలితములను ఇచ్చును. వ్యక్తిని విద్యావానుడుగాను మరియు ఙ్ఞానవంతునిగాను చేయును. ధన బావములో చంద్రుని యొక్క ప్రభావము వుండిన ఎడల ఆర్ధిక స్థితి బాగుండును. వివాహము తరువాత వీరికి విషేశమైన లాభములు కలుగును. కఠినమైన సత్యము మరియు నేరుగా మాట్లాడు అలవాట్లు వుండుట వలన వీరు విరోధములను ఎదుర్కొన వలసి వచ్చును.

3, మే 2017, బుధవారం

మిధున లగ్నములో నవగ్రహముల ప్రభావము

మిధున లగ్నములో నవగ్రహముల ప్రభావము

రాశి చక్రము యొక్క మూడవ రాశి మిధునము. మీ కుండలిలో లగ్నబావములో ఈ రాశి వుండిన ఎడల మీ లగ్నము మిధునముగా చెప్పబడును. మీ లగ్నముతో పాటు ప్రధమ బావములో ఏ గ్రహమైతే వుండునో అది మీ లగ్నమును ప్రభావితము చేయును. మీ జీవితములో జరిగే అన్ని విషయములకు ఈ లగ్నములో వున్న గ్రహముల ప్రభావము కూడా వుండవచ్చును.
మిధున లగ్నములో సూర్యుడు
మిధున లగ్నము యొక్క కుండలిలో లగ్నములో  వున్న సూర్యుడు వారి మిత్ర రాశిలో వుండును  సూర్యుని యొక్క ప్రభావము కారణముగా వ్యక్తి యొక్క ముఖముపై రక్తిత్వము ప్రకాశవంతముగా వుండును. వ్యక్తి అందముగాను మరియు ఆకర్షణీయముగాను వుండును. వీరి వ్యక్తిత్వము ఉదార స్వభావము కలిగి వుండును. వీరిలో సాహసము, ధైర్యము మరియు పురుషార్ధము అధికముగా వుండును. బాలావస్థలో వీరు అనేక రోగములను ఎదుర్కొన వలసి వచ్చును. యువావస్థలో కష్టములను మరియు సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. వృద్దావస్థ సుఖము మరియు ఆనందమయముగా వుండును. వీరికి ఆర్దిక సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. సప్తమ బావములో సూర్యుని దృష్టి వుండుట కారణముగా వివాహములో ఆటంకములు కలుగును. వైవాహిక జీవితము అశాంతికరముగా వుండును.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...