జ్యోతిష్య శాస్త్ర చిట్కాలు
లగ్నం నుండి శరీర విషయాలు, చంద్ర లగ్నం నుండి మనోభావాలు, రవి లగ్నం నుండి మన ప్రయత్నం లేకుండా జరిగే సంఘటనలు పరిశీలించాలని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు.
గురువు, శుక్రుడు అగ్నితత్వ రాశులలో ఉండి, కుజ, శని దృష్టి ఉంటే ఒంటి మీదకు అమ్మవారు వస్తుంది. మీన లగ్నానికి ద్వితీయ స్ధానంలో శుక్రుడు ఉంటే కంటికి సంబందించిన అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
భార్య ఆరోగ్య విషయాన్ని సప్తమ స్ధానం నుండి అష్టమాన్ని పరిశీలించాలి. మేనమామను చతుర్ధానికి తృతీయం చూడాలి.
ఇంద్రుడు- విద్వంసకారకుడు, విద్రోహ కారకుడు, వరణుడు- మందుప్రియుడు, వీళ్ళిద్దరు పంచమంలో ఉంటే మిలియనీర్, చతుర్ధంలో ఉంటే కోటీశ్వరులు, తృతీయంలో ఉంటే లక్షాధికారి అవుతారు.
సాధారణ విద్య గురించి చతుర్ధ స్ధానం చతుర్ధాధి పతి, గురువు వలన తెలుస్తాయి. గురువు, శుక్రులు కేంద్ర స్ధానాలలో ఉంటే పలు విషయాలను గ్రహించగలుగు మేధావి అవుతాడు
తృతీయాధిపతి, లగ్నాధిపతి, రాహువు ఒకేరాశి యందుండిన కవలలు జన్మించే అవకాశాలు ఎక్కువ.
ఏ లగ్నానికి అయిన బుధుడు స్వక్షేత్రములో ఉన్నప్పుడు బాగా యోగిస్తాడు. మిగతా స్ధానాలలో ఉన్నప్పుడు అంతగా యోగించడు.
ఒక భావంలో ఒకటి కన్న ఎక్కువ గ్రహాలు ఉంటే ఈ గ్రహానికి షడ్వర్గుల ద్వారా ఎక్కువ బలం లభిస్తుందో ఆ గ్రహ ప్రభావం ఆ భావం మీద ఎక్కువగా ఉంటుంది. ఆ భావం యొక్క ఫలితాలు ఎక్కువ ఉంటాయి.
గ్రహాలకు రెండు ఆదిపత్యాలు ఉన్నప్పుడు అందులో మూలత్రికోణ రాశి యొక్క సంబంధం అధికంగా ఉంటుంది. గ్రహం యొక్క దశా కాలంలో ముందు సగభాగంలో మూల త్రికోణ రాశి ఆదిపత్య ఫలితాన్ని, తరువాతి సగ భాగంలో స్వరాశి ఆదిపత్య ఫలితాన్ని ఇస్తుంది.
ఆదిపత్య గ్రహం బేసిరాశిలో ఉన్నట్లయితే భేసిరాశి ఫలితాన్ని ముందుగాను, తరువాత సరిరాశి ఫలితాన్ని ఇస్తుంది. ఆదిపత్యగ్రహం సరిరాశిలో ఉన్నట్లయితే మొదట సరిరాశి ఫలితాన్ని, తరువాత భేసిరాశి ఫలితాన్ని ఇస్తాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి