15, జులై 2016, శుక్రవారం

మాణిక్యం (కెంపు)

మాణిక్యం (కెంపు)

         మాణిక్యం స్పటిక ఆమ్ల జాతికి చెందిన రత్నం. అత్యంత విలువైన ఈ రత్నాన్ని పద్మరాగమణి, మాణిక్యం, కెంపు అని కూడా అంటారు. మాణిక్యమణిని సూర్యగ్రహానికి ప్రతిరూపంగా చెబుతారు. బృహత్సంహితలో మాణిక్యమణి మూడు రకాలుగా లభిస్తుందని తెలియజేయబడింది. గంధకం, కురువిందం, స్పటికాలలో ఉద్భవిస్తుందని చెప్పబడింది. గంధకం నుండి పుట్టినవి పెళుసుగాను, కురువిందం నుండి పుట్టినవి కాంతిహీనంగాను, స్పటికం నుండి పుట్టినవి స్వచ్చంగా, కాంతివంతంగా ఉంటాయని చెప్పటం జరిగింది. మాణిక్యమణిని అత్యదిక వేడి వద్ద వేడి చేసినను ఆకుపచ్చరంగులోకి మారి చల్లారిన తరువాత సహజ సిద్ధమైన రంగులోకి మారుతాయి. రత్నపరీక్ష గ్రంధం ఆదారంగా మనకు ప్రకృతిలో ఆరు రకాల కెంపులు లభ్యమవుతాయి.


ఉదయించే సూర్య బింబంవలె ప్రకాశించునది “పద్మరాగ మణి”. దానిమ్మ పూవు వలె ప్రకాశించునది “సౌగంధిక మణి” కుందేలు మాంసం లా ప్రకాశించేది “మాంసగంధి మణి” నలుపు కలసిన ఎరుపు రంగులో ప్రకాశించేది “నీలగంధి మణి” పావురం మెడలోని గులాబీ రంగులా ప్రకాశించేది “కోమల మణి”. పాము శిరస్సులపై కెంపులు ఉంటాయని చక్రవర్తులు ధరించి విష ప్రయోగాల నుండి రక్షణ పొందేవారని, శత్రువులపై విజయాలు పొందేవారని రాజ్యం సస్య శ్యామలంగా ఉంటుందని దీని ధర వెలకందని రీతిలో ఉంటుందని వరాహమిహరుని బృహత్సంహితలో వర్ణించటం జరిగింది.

 “పటలదోషం” ఉన్న తెలుపురంగు దారిద్రాన్ని, “త్రాస దోషం” బీటలు ఉన్నవి కలహాలు, “చిన్న దోషం” చిన్న చిన్న ముక్కలుగా ఉన్నవి కష్టాలు, “జర్ఘర దోషం” పొరలుగా ఉండేవి విరోదాలు, “కర్కశ దోషం” ఉన్న ఆకర్షణ తక్కువ ఉన్నవి ప్రాణాపాయాన్ని, “నీల దోషం” ఉన్న నల్లటి మచ్చలు ఉన్నవి శతృ దోషాలను కలుగజేస్తాయి. ఇటువంటి దోషాలు ఉన్న మాణిక్య మణులను ధరించరాదు.

జాతి కెంపులు పైభాగము నునుపుగా ఉండి నిర్మలమైన కిరణములతో ప్రకాశించును. దీపంవలె వెలుగును ప్రకాశింపజేయు రత్నాన్ని ధరించాలి. ఒకపక్క నుండి చూసిన రెండవవైపు కనబడుతుంది. అర చేతిలో పెట్టుకొని చూసిన అర చేతిలో గీతలు కనపడగలవు. కెంపులు శ్రీలంక, ఆప్ఘనిస్తాన్, తూర్పుఆఫ్రికా, బర్మా, థాయిలాండ్ దేశాలలోని నదుల ఇసుకలలోను, తరుచు కంకర రాళ్ళలోను లభ్యమగును.

రత్నములు ధరించుటలో అనేక విధానాలు కలవు. మనదేశంలో ఎక్కువగా జన్మలగ్నాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి, దశలను బట్టి ధరిస్తున్నారు. సింహలగ్నానికి అధిపతి సూర్యుడు. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ నక్షత్రాలవారు, రవిదశలు నడిచేవారు, జాతకంలో సూర్యుడు జన్మలగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న నీచ స్ధానమైన తులారాశి యందు ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న రవి దశ అంతర్దశలో కష్టాలు కలిగించే సూచనలు ఉన్నాయి కావున జాతకులు తప్పనిసరిగా కెంపు ధరించటం మంచిది. కెంపు కుడిచేతి ఉంగరం వ్రేలుకి ధరించటం మంచిది. మొదటిసారి దరించేవారు శివాలయంలో అభిషేకం చేపించి “అశ్వద్యజాయే విద్మహే పాష హస్తయా దీమా హీతానో సూర్య ప్రచోదయాత్” అనే మంత్రం జపిస్తూ 3 క్యారెట్స్ బరువు కలిగిన మాణిక్య రత్నాన్ని  ఉంగరపు వేలుకు ఒకటిన్నర కిలోల గోధుమలు గాని, గోధుమ రొట్టెలు గాని దానం చేసి ఆదివారం రోజు రవి హోరలో ధరించాలి.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మాణిక్యాన్ని గుర్రపు మూత్రం నందు ఒకరోజు నాననిచ్చి మూడు రోజులు తీవ్రమయిన ఎండలో ఉంచి వేడి నీళ్ళతో కడిగి శుద్ధి చేసిన కెంపును జిల్లేడు పాలలో మూడు రోజులు ఉంచి శాస్త్రోక్తంగా పిడకల అగ్నిలో భస్మం చేసిన కెంపు పొడిని స్వీకరించుట వలన అతి మూత్ర వ్యాధి, మంధబుద్ధి, నిద్ర లేమితనం, నేత్రరోగాలు, నపుంసకశక్తి తొలగి సంభోగశక్తి కలుగుతుంది. మాణిక్యమణిని ధరించిన వారికి ప్లేగు, తేలు, పాముల విష సర్పబాధలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. దంత వ్యాధులు, పక్షవాతం, హిస్టీరియా, చర్మ రోగాలు, కీళ్ళవాతాలు మొదలగు వ్యాధులను సమర్ధుడైన ఆయుర్వేద వైద్యుని సలహా పాటించి ఇన్ని వ్యాధుల నుంచి నివారణ పొందవచ్చును.

కెంపు ధరించటం వలన ప్రయోజనాలు:- జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆరోగ్య కారకుడు సూర్యుడు. తరచుగా అనారోగ్యం కలుగుతున్న వారు, రోగాల బారిన పడి అవస్ధలు పడేవారు, ధన లాభం కొరకు, ఆయువృద్ధి కొరకు, వ్యాపార, ఉద్యోగ అభివృద్ధికి, అత్యున్నత స్ధాయి కొరకు, మంద బుద్ధి ఉన్నవారు, వాగ్ధాటి, మేధాశక్తి లేనివారు మాణిక్యం ధరించటం మంచిది. శరీరంలోని రక్త ప్రసరణ శక్తిని బాగు పరచి మేధాశక్తిని, వాగ్ధాటిని పెంచుతుంది.      

రాజకీయాలు, కోర్టువ్యవహారాలలో రాణింపు, పవిత్రమైన మనస్సు, పట్టుదల, దైర్యసాహసాలు, భూత, భవిష్యత్, వర్తమానకాలాలలో, దూర ప్రదేశాలలో జరుగు విషయాలు తెలుసుకొను శక్తి సామర్ధ్యములు కలిగి ఉంటారు. ఉద్యోగంలో ఉన్నతి కొరకు, ప్రమోషన్స్ కొరకు కెంపు ధరించటం మంచిది. పూజారులు, పీఠాదిపతులు, భక్తులు తమ తమ దేవతా విగ్రహాల యందు ఉంచి పూజించిన వశీకరణ శక్తి, సర్వకార్య విజయాలు,  అనారోగ్యాల పాలిట సంజీవినిగా పని చేస్తుంది.


మాణిక్యం (కెంపు):- క్యారెట్ :-1000.00 (Each One Caret)


పై  మాణిక్యం (కెంపు) కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.

Bank Details:- State Bank Of Hyderabad ; Name:-N.Raja Sekhar ; A/c No:-52207626721, Place :-Hyderabad, IFSC Code:-SBHY0021056.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...