గృహ
నిర్మాణం చేయవలసిన స్ధలం యొక్క ఉచ్చ నీచల (ఎత్తు పల్లాలు) ఫలితాలు
వాస్తులో
ఉచ్చ నీచలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆధునిక కాలంలో ఎత్తు పల్లాలకు అధిక
ప్రాదాన్యతను ఇస్తూ చాలా ఎక్కువగా చూస్తున్నారు. ఉచ్చ నీచల విషయంలో వివిధ
గ్రంధాలలోని శాస్త్రజ్ఞుల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.
“వాస్తు
విద్య” అను వాస్తు శాస్త్ర గ్రంధంలో తూర్పు ఎత్తుగా ఉంటే పుత్రహాని, ఆగ్నేయం ఎత్తుగా ఉంటే
ధన లాభం, దక్షిణం ఎత్తుగా ఉన్న మంచి ఆరోగ్యం, నైరుతి ఎత్తుగా ఉన్నచో స్త్రీ సౌఖ్యం, పడమర ఎత్తుగా
ఉన్నచో ధన హాని, ఉత్తరం ఎత్తుగా ఉన్నచో రోగం, ఈశాన్యం ఎత్తుగా ఉన్న మహా రోగం కలుగును.స్ధలం యొక్క తూర్పుదిశ పల్లంగా
ఉన్న అభివృద్ధినిస్తుంది. ఉత్తర దిశ పల్లంగా ఉన్న ఐశ్వర్యం,
పడమర దిశ పల్లంగా ఉన్న ధనక్షయం, దక్షిణం పల్లంగా ఉన్న మరణం
కలుగుతాయి.
“అపరాజిత
పృచ్ఛ” అను వాస్తు శాస్త్ర గ్రంధంలో స్ధలం యొక్క తూర్పుదిశ పల్లంగా ఉంటే ఆయుర్ధాయం, సంపద, బలం పెంపొందిస్తుంది. ఆగ్నేయదిశ పల్లంగా ఉన్న స్ధలం అగ్ని భయం, శత్రువుల వలన ఇబ్బందులు, పాప కృత్యాలను
చేపిస్తుంది. దక్షిణ భాగం పల్లంగా ఉన్న స్ధలం రోగం, ధన హాని, పురుషులకు ఇబ్బందులు, దేవాలయం నిర్మించిన అభివృద్ధి
ఉండదు. నైరుతి దిశ పల్లంగా ఉన్న స్ధలంలో ధనహాని, పురుషులకు
దీర్ఘకాల వ్యాధులు, గృహ యజమానికి మృత్యుబాధలు ఉంటాయి. పశ్చిమ
దిశ పల్లంగా ఉన్న ధన ధాన్యాదులను నశింపజేస్తాయి. వాయువ్య దిశ పల్లంగా ఉన్న స్ధలంలో
శత్రుబాధలు, స్త్రీ సంతతి తక్కువ,
ఎప్పుడు కలతలు, అజీర్ణ వ్యాధి, భయాలు
కలుగుతాయి. ఉత్తరం పల్లంగా ఉన్న స్ధలంలో గౌరవం, పుత్ర
పౌత్రాభివృద్ధి, ధన ధాన్యాభివృద్ధిని కలిగిస్తుంది. ఈశాన్యం
పల్లంగా ఉన్న స్ధలం సౌఖ్యం, సౌభాగ్యం,
ధన ధాన్యాలను, ధర్మాన్ని వృద్ధి చేస్తుంది.
“జ్యోతిర్నిబంధం”
అను గ్రంధంలో తూర్పు, పడమర దిశలు పొడవుగా ఉండి ఉత్తర, దక్షిణ దిశలు
ఎత్తుగా ఉన్న స్ధలం “ నాగపృష్ట స్ధలం” అని పిలుస్తారు. ఇందు గృహ నిర్మాణం చేసిన
భార్య, పుత్ర నష్టం కలిగించి శత్రు వృద్ధిని కలిగిస్తుంది.
తూర్పు
ఆగ్నేయ,
ఈశాన్య దిశలు ఎత్తుగా ఉండి పశ్చిమదిశ పల్లంగా ఉన్న స్ధలాన్ని “దైత్య పృష్టమని”
పిలుస్తారు. ఇందు గృహ నిర్మాణం చేసిన ధన నాశనం, పుత్ర
నాశనం, పశు సంపద లేకపోవటం జరుగుతుంది.
మధ్యభాగం
ఎత్తుగా నుండి నాలుగు దిశలు పల్లంగా ఉన్న స్ధలం “ కూర్మ పృష్ట స్ధలమని”
పిలుస్తారు. ఇందు గృహ నిర్మాణం చేసిన సుఖం, ధనం, ధాన్యం, ఐశ్వర్యం
సంప్రాప్తిస్తాయి.
దక్షిణ, పశ్చిమ, నైరుతి వాయువ్య దిశలు ఎత్తుగా ఉండి మిగిలిన దిశలు పల్లంగా ఉన్న స్ధలాన్ని
“గజ పృష్టం” అని పిలుస్తారు. ఇందు గృహ నిర్మాణం చేసిన ఐశ్వర్యప్రాప్తి, ఆయువృద్ధిని కలిగిస్తాయి.
“వాస్తు
విద్య” అను గ్రంధంలో ఉచ్చ నీచల గురించి తూర్పు ఆగ్నేయ దిశల మధ్యభాగం పల్లంగా ఉన్న
స్ధలం “పితామహవాస్తు” అంటారు. ఇది అశుభాలనిస్తుంది.
దక్షిణ
ఆగ్నేయ దిశల మధ్యభాగం ఎత్తుగా ఉండి వాయువ్య ఉత్తరాల మధ్య దిశల మధ్యభాగం పల్లంగా ఉన్న
స్ధలాన్ని “సుపధ వాస్తు” అంటారు. ఇది సర్వకర్మలకు యోగ్యమైనది.
ఉత్తర, ఈశాన్య దిశలు పల్లంగా
ఉండి నైరుతి దక్షిణ దిశలు ఎత్తుగా ఉన్న స్ధలాన్ని “దీర్ఘాయుర్వాస్తూ” అంటారు. ఇది వంశాభివృద్ధిని
కలిగిస్తుంది.
ఈశాన్య, తూర్పు దిశలు పల్లంగా
ఉండి నైరుతి, దక్షిణ దిశలు ఎత్తుగా ఉన్న స్ధలాన్ని “పుణ్యక
వాస్తు” అంటారు. ఇది శుభకరమైనది.
తూర్పు, ఆగ్నేయ దిశలు పల్లంగా
ఉండి వాయువ్య పశ్చిమ దిశలు ఎత్తుగా ఉన్న “ఆపద వాస్తు” అంటారు. ఇది కలహాలను
కలిగిస్తుంది.
దక్షిణ, ఆగ్నేయ దిశలు పల్లంగా
ఉండి వాయువ్య, ఉత్తర దిశలు ఎత్తుగా ఉన్న స్ధలాన్ని “రోగ
కృద్వాస్తు” అంటారు. ఇందు గృహ నిర్మాణం చేసిన రోగాలను కలిగిస్తుంది.
నైరుతి, దక్షిణ దిశలు పల్లంగా
ఉండి ఉత్తర ఈశాన్యాలు ఎత్తుగా ఉన్న “ఆర్గళ వాస్తు” అంటారు. పాప కృత్యాలను
చేయిస్తుంది.
ఈశాన్య, తూర్పు దిశలు ఎత్తుగా
ఉండి పశ్చిమ నైరుతి దిశలు పల్లంగా ఉన్న “శ్మశానవాస్తు” అంటారు. ఇది వంశ నాశనాన్ని
కలిగిస్తుంది.
ఆగ్నేయం
పల్లంగా ఉండి నైరుతి, ఈశాన్య, వాయువ్య దిశలు ఎత్తుగా ఉన్న స్ధలాన్ని
“శ్యేనక వాస్తు” అంటారు. ఇది నాశనాన్ని, మరణాన్ని
కలిగిస్తుంది.
ఈశాన్య
ఆగ్నేయ పశ్చిమ భాగాలు ఎత్తుగా ఉండి నైరుతి దిశ పల్లంగా ఉన్న “శ్వముఖ వాస్తు”
అంటారు. ఇది ఎల్లప్పుడు దారిద్ర్యాన్ని కలిగిస్తుంది.
నైరుతి, ఆగ్నేయ, ఈశాన్య దిశలు ఎత్తుగా ఉండి వాయువ్య, తూర్పు దిశలు
పల్లంగా ఉన్న స్ధలాన్ని “బ్రహ్మఘ్న వాస్తు” అంటారు. ఇది సర్వదా నింద్యమైనది.
ఆగ్నేయ
దిశ ఎత్తుగా ఉండి నైరుతి ఈశాన్య వాయువ్య దిశలు పల్లంగా ఉన్న “స్ధావర వాస్తు”
అంటారు. ఇది వంశ నాశనం కలిగిస్తుంది.
నైరుతి
భాగం ఎత్తుగా ఉండి ఆగ్నేయ, వాయువ్య, ఈశాన్య దిశలు పల్లంగా ఉన్న స్ధలాన్ని
“స్ధండిల వాస్తు” అంటారు. ఇది సర్వ నాశనం కలిగిస్తుంది.
ఈశాన్య
భాగం ఎత్తుగా ఉండి ఆగ్నేయ నైరుతి వాయువ్య భాగాలు పల్లంగా ఉన్న స్ధలం “శాండుల
వాస్తు” అంటారు. ఇది అశుభాలను కలిగిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి