లగ్నం అంటే తూర్పు దిగ్మండలంపై ఏ రాశి ఉదయిస్తుందో అదే
లగ్నం అంటారు.పుట్టిన వ్యక్తి యొక్క జన్మ సమయాన్ని శిశువు గర్బాశయం నుండి బయటకు తీసినప్పుడు కాకుండా అతని మొదటి శ్వాస ,మొదటి ఏడుపు ద్వారా శిశువు జన్మ సమయాన్ని తీసుకొనవలెను.శిశువు ఏడ్చినప్పుడు గ్రహాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
లగ్నభావాన్నే తనూభావం అంటారు.బాల్యం,ఆరోగ్యం,వ్యక్తిత్వం,దేహం,నడవడిక,శరీర వర్ణం,శారీరక,మానసిక స్ధితి,జన్మించిన విధం,ఎత్తు,సామర్ధ్యం,గుణాలు,తెలివితేటలు,ఆయుర్ధాయం మొదలుగునవి తనూభావం ద్వారా తెలుసుకోవచ్చును. లగ్న కారకత్వాలు: పరాశరుడు లగ్నం గురించి వివరిస్తూ లగ్నం ద్వారా తెలుసుకోదగిన
అంశాలను ఈ విధంగా చెప్పాడు.
శ్లో।। తనుం రూపంచ జ్ఞానంచ, వర్ణం చైవ బలాబలం ।
ప్రకృతిం సుఖ దుఃఖంచ, తనుభావద్విచింత్యయేత్
।। -
బృహత్పరాశరి, భావవివేచనాధ్యాయం, శరీరము, రూపము, వర్ణము,
జ్ఞానము, బలాబలాలు, స్వభావము, సుఖదుఃఖాలు
తనుభావమునుంచి తెలుసుకోవాలి.
కాళిదాసు తన
ఉత్తర కాలామృతములో లగ్నభావకారకత్వాల్ని మరింతనిశితముగా విశ్లేషించాడు. శ్లో।।దేహశ్చావయవస్సుఖరాస్తే జ్ఞాన జన్మస్థలే, కీర్తిస్వప్న బలాయతీర్నృ -పనయాఖ్యాశాంతిర్వయః।
కేశాకృత్యభిమాన జీవనపరద్యూతాంకమానత్వచో,
నిద్రాజ్ఞాన ధనాపహార నృతిరస్కార
స్వభావారుజః । వైరాగ్యప్రకృతీచ
కార్యకరణం, జీవక్రియాసూద్యమః,
మర్యాదప్రవినాశనంత్వితిభవేద్వర్థోపవాదస్తనోః
।।
దేహము,
కాళ్ళు, చేతులు మొదలైన అవయవములు, సుఖదుఃఖములు, ముసలితనము, జ్ఞానము, జన్మభూమి, కీర్తి,
స్వప్నము, బలము, ఆకారము, తర్వాత
జరిగే ఫలితాలు అంటే ఒక కార్యముయొక్క పర్యవసానము ఏ విధముగా ఉంటుందో
తెలుసుకోవటము, రాజనీతి,
ఆయుర్దాయము, శాంతి, వయస్సు, కేశములు, అభిమానము,
జీవనము, అపర విషయములు, జూదము, చిహ్నము, పౌరుషము,
చర్మము, నిద్ర, అజ్ఞానము, ధనమును
దొంగలించటము, మనుష్యులను
తిరస్కరించు స్వభావము, రోగము
లేకపోవటము, వైరాగ్యము,
ప్రకృతి, కార్యములను చేయటం, జీవకార్యములయందు ప్రయత్నించుట, మర్యాదను పోగొట్టుకొనుట, మొదలైన ఫలితాలను లగ్నము ద్వారా చూడాలి.
చరలగ్నం అయిన సంచారం చేయువాడుగాను,స్ధిర లగ్నం అయిన స్ధిరంగా ఉండటం,ద్విస్వభావ
లగ్నం అయిన మిశ్రమంగా ఉండటం.
లగ్నంలో రవి ఉంటే:-లగ్నంలో రవి ఉంటే కోపం,శిరోవేదన,ఉష్ణతత్వం,శరీరం పుష్ఠి,పల్చని జుట్టు,బట్టతల(లేత వయస్సులో),పాపగ్రహాల కలయిక వలన దయాగుణం లేక క్రూరంగా ప్రవర్తించటం,సృజనాత్మక శక్తి,ధైర్యం,సాహసం,ఉంటాయి.
లగ్నంలో చంద్రుడు ఉంటే :-లగ్నంలో చంద్రుడు ఉంటే గుండ్రని ముఖం,దట్టమైన జుట్టు,సున్నితమైన మనస్సు,బిడియం,సౌమ్యం,మానసిక ఇబ్బందులు,ఆటుపోటులు,కంటివ్యాది,మానసిక వ్యాది (అంతర్గత జబ్బు),ఎడమ చెవి ప్రాబ్లం ,మాట త్వరగా రాకపోవటం,ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉండవు.
లగ్నంలో కుజుడు ఉంటే:-లగ్నంలో కుజుడు దూకుడుతనం,కలర్ తక్కువ,ముఖంపైన స్పాట్స్,ముఖంపై దెబ్బలు,గాయాలు ఉండటం,జన,సోదర సహకారం,స్పోర్ట్స్ పైన మక్కువ,వాగ్ధాటి,వివాదాలు,త్వరగా
కోపం,యాక్సిడెంట్,ఇతరులను నిందించటం,కొట్టటం,చెడు అలవాట్లకు బానిస కావటం జరుగుతుంది.
లగ్నంలో బుధుడు ఉంటే:-లగ్నంలో బుదుడు ఉంటే తెలివి,అతి తెలివి,మంచి వస్త్రాలు,చక్కని భాష,మ్యాధ్స్ పైన మక్కువ,అంచనా వేయగలిగే సామర్ధ్యం,వాక్ శుద్ధి,రాయభారాలు,కమ్యూనికేషన్,లాజిక్స్,తెలివితేటలను వ్యక్త పరచటం,ఇతరులు ఏది చేబితే వింటారో అది చెప్పగలగటం,నపుంసకత్వం,నరాల బలహీనత.
లగ్నంలో గురువు ఉంటే:-లగ్నంలో గురువు ఉంటే ఆరోగ్యవంతమైన లావైన
శరీరం,కొవ్వు పట్టిన లావైన శరీరం,ఊబకాయం,దర్మాన్ని కాపాడటం,శాంత
స్వభావం,ప్లానింగ్,తను కష్టపడి ఎవరికైన(శత్రువులకైనా) మంచి చేస్తాడు.శుభ్రత కలిగి ఉండటం,తీర్ద యాత్రలపైన మక్కువ,దైవ చింతన,మంచి అలవాట్లు,ఉన్న దానితో సంతృప్తి పడలేరు.
లగ్నంలో శుక్రుడు ఉంటే:-లగ్నంలో శుక్రుడు ఉంటే అందమైన
ఆకర్షవంతమైన శరీరం,సుగంద ద్రవ్యాలపైన(సెంటు) మమకారం,సున్నితమైన శరీరం,సుఖవంతమైన,సుఖ జీవన విధానంపైన మక్కువ,కష్టపడి పని చేయలేక పోవటం,ఆకర్షణ,స్త్రీలను ఆకర్షించటం,ఇతరుల ఆకర్షణలకు లొంగి పోవటం.లగ్జరీగా ఉండటం.
లగ్నంలో శని ఉంటే:-లగ్నంలో శని ఉంటే బద్దకం,బ్లాక్ కలర్ గా ఉండటం,నెమ్మది నిధానం,లోభి,పిసినారితనం,పొడవైన శరీరం,అపరి శుభ్రం,చింపిరి జుట్టు,చిన్నతనంలోనే ముసలి ఛాయలు,మురికి బట్టలు,ఆలస్య వివాహం,ప్రతి పనిలో ఆటంకం,నిరాశ ఉండటం.మొండిగా ప్రవర్తించటం.
లగ్నంలో రాహువు ఉంటే :-లగ్నంలో రాహువు ఉంటే మోసపోవటం,మోసగించటం,లొంగిపోవటం,లొంగతీసుకోవటం, కులాంతర వివాహం చేసుకోవటం,ఉద్రేకంగా,క్రూరంగా ఉండటం,మనస్సులోని భావాలు బయటకు చెప్పకపోవటం, ఊహాత్మకమైన విషయాలు,అనుమానాలు,ఏదో జరుగుతుందని ముందుగానే ఊహించుకొని బయపడటం,అనవసరమన ఆపోహాలు ఉండటం.
లగ్నంలో కేతువు ఉంటే:-లగ్నంలో కేతువు ఉంటే తప్పుడు సలహాలు ఇవ్వటం,తీసుకోవటం,వివాహంపైన మక్కువ లేకపోవటం,ఏ పని సరిగా చేయలేకపోవటం,నిలకడ లేకపోవటం,వితండవాదం,ప్రతి చిన్న విషయానికి
అలగటం,భయపడటం,మౌనవ్రతం పాటించటం.దైవంపైన అతి భక్తి,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి