భాదకులు
భాదకులు:-చర లగ్నాలకు లాభాదిపతి భాదకుడు అవుతాడు.
స్ధిర లగ్నాలకు భాగ్యాదిపతి భాదకుడు అవుతాడు.
ద్విస్వభావ లగ్నాలకు సప్తమాధిపతి భాదకుడు అవుతాడు.
చరలగ్నాలు అయిన మేషం,కర్కాటకం,తుల,మకర రాశులకు వరుసగా మేషరాశికి లాభాదిపతి శని,కర్కాటక రాశికి లాభాదిపతి శుక్రుడు,తులారాశికి లాభాదిపతి సూర్యుడు ,మకర రాశికి లాభాదిపతి కుజుడు భాదకులు అవుతారు.
స్ధిర లగ్నాలు అయిన వృషభం,సింహం,వృశ్చికం,కుంభ రాశులకు వరుసగా వృషభరాశికి భాగ్యాదిపతి శని,సింహారాశికి భాగ్యాదిపతి కుజుడు వృశ్చిక రాశికి భాగ్యాదిపతి
చంద్రుడు,కుంభరాశికి భాగ్యాదిపతి శుక్రుడు భాదకులు అవుతారు.
ద్విస్వభావ లగ్నాలు అయిన మిధునం,కన్య,ధనస్సు,మీన రాశులకు వరుసగా మిధున రాశికి సప్తమాధిపతి గురువు,కన్యారాశికి సప్తమాధిపతి గురువు,ధనస్సు రాశికి సప్తమాధిపతి బుధుడు,మీనరాశికి సప్తమాదిపతి బుధుడు భాదకులు అవుతారు.
స్దిర లగ్నాల వారికి భాదకులు పరస్పర మిత్రత్వం కూడా ఉంది కాబట్టి భాద పెట్టి మాత్రమే
ఫలితాన్ని ఇస్తారు.ప్రతి లగ్నాలకు లగ్నాదిపతి,పంచమాదిపతి,భాగ్యాదిపతి యోగకారకులు అవుతారు.స్దిర లగ్నాలకు బాగ్యాధిపతి భాదకుడు,యోగకారకుడు కావటం
వలన భాద పెట్టి మాత్రమే యోగాన్నిస్తాయి.
భాదక గ్రహాల యొక్క దశ ,అంతర్దశ లలో భాదకుడు ఏ భావానికి ఆదిపత్యం వహిస్తున్నాడో ,ఏ భావాన్ని చూస్తున్నాడో ఆ భావ కారకత్వాలకు ఇబ్బందులు,భాద కలుగుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి