ప్రమాణ స్వీకార సమయంలో రాజకీయ నాయకుల భవిష్యత్ తెలియజేసే సింహాసన చక్రం..
ప్రమాణస్వీకారం ఉత్తరాయణంలో చేస్తే మంచిది.సింహాసన చక్రాన్ని పంచ నాడీ చక్రం అని కూడా అంటారు.సింహాసనమనగా పరిపాలించు వ్యక్తి కూర్చునే ఆసనం.ప్రమాణస్వీకార సమయంలోని గ్రహస్ధితిని బట్టి సింహాసనచక్రం నిర్మించి పరిశీలిస్తే దేశంలో లేక రాష్ట్రంలో యుద్ధభయం,ఆకస్మిక సంఘటనలు,ప్రభుత్వంలోని ప్రముఖుని లేక నాయకుని మరణం,కరువు కాటకాలు ఏర్పడటం,వాతావరణ పరిస్ధితి,ప్రభుత్వ పతనం మొదలైనవి ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది.

1)ఆధార నాడి 2)ఆసననాడి 3)పట్టనాడి 4)సింహనాడి 5)సింహాసన నాడి.అని పంచనాడులుంటాయి.
రాజ దర్బారులో రాజు సింహాసనమనే అత్యున్నతమైన ఆసనంపై కూర్చుంటాడు.ఇది సింహాసన నాడి.
తరువాత క్రింది స్ధాయి ఆసనంలో సర్వాధికారి అయిన మంత్రి కూర్చుంటాడు.ఇది సింహనాడి.
తరువాత క్రింద స్ధాయి ఆసనంలో రాణి లేక యువరాజు లేక ఇతర మంత్రులు కూర్చుంటారు.ఇది పట్టనాడి.
తదుపరి క్రింద స్ధాయిలో పరిపాలన వ్యవస్ధలోని ఇతర తక్కువ స్దాయి మంత్రులు,అధికారులు కూర్చుంటారు.ఇది ఆసన నాడి.
అన్నిటికంటే చివరగా సాధారణ ప్రజలుంటారు.ఇది ఆధార నాడి.ఒక దేశానికి ప్రజలే ఆధారం కదా.
సింహాసన చక్రంలో 3 సింహాసనాలుంటాయి.ఒక్కొక్క సింహాసనానికి 9 నక్షత్రాల వంతున మొత్తం 27 నక్షత్రాలు 3 సింహాసనాలలో పంచబడ్డాయి.
మొదటి సింహాసనంలో అశ్విని నుండి ఆశ్లేష వరకు నక్షత్రాలు ఉంటాయి.దీనిని “అశ్వపతి సింహాసనము”అంటారు.
రెండవ సింహాసనంలో మఖ నుండి జ్యేష్ట వరకు నక్షత్రాలు ఉంటాయి.దీనిని “నరపతి సింహాసనము”అంటారు.
మూడవ సింహాసనంలో మూల నుండి రేవతి వరకు నక్షత్రాలు ఉంటాయి.దీనిని “గజపతి సింహాసనము”అంటారు.
ఆధునిక ప్రజాస్వామ్య పద్ధతిలో పూర్తి పాలనాధికారం ప్రధానమంత్రికి కలదు.కావున సింహాసన నాడి ప్రధానమంత్రి (దేశానికి) లేక ముఖ్యమంత్రిని (రాష్ట్రానికి) సూచించును.
ఉప ప్రధాని లేక ఉప ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి తరువాత అంతటి అధికారం ఉన్న పరిపాలనా ప్రముఖులు సింహనాడిచే సూచింపబడతారు.
క్యాబినెట్ మంత్రి వర్గాన్ని,ప్రధాని లేక ముఖ్యమంత్రి యొక్క బార్యా కుమారులను పట్టనాడి సూచించును.
ఎం.పి ,ఎం.ఎల్.ఏ లను ఇతర ప్రభుత్వ అధికారులను ఆసననాడి సూచించును.
సాధారణ ప్రజలను ఆధారనాడి సూచించును.
ప్రమాణస్వీకార సమయానికి గ్రహస్ధితులను పరిశీలించి సింహాసన చక్రంలో ఏయే నక్షత్రాలలో ఏయే గ్రహాలు కలవో గుర్తించాలి.దీనివల్ల ఏయే నాడుల్లో ఏయే గ్రహాలు ఉన్నాయో తెలుసుకోవచ్చును.ఈ సింహాసన చక్రంలో చంద్ర శనులకు ప్రత్యేకత ఉంది.
ప్రమాణస్వీకార సమయానికి గల చంద్రస్ధితి ఆ ప్రభుత్వ సుస్ధిరత్వాన్ని సూచిస్తుంది.ప్రజాస్వామ్యం,రాజకీయాలు,ప్రజాశక్తి,ప్రజల వల్ల అనుకూలత శని వల్ల సూచించబడతాయి.
సింహాసన చక్రంలో చంద్ర, శనులు వివిధ నాడులలో ఉన్న వేరు వేరు ఫలితాలు పూర్వ గ్రంధాలలోని ఫలితాలను ప్రస్తుత పరిస్ధితులకు అన్వయించుకోవాలి.
ఆధారనాడి:-ఆధారనాడిలో చంద్రుడున్న రాజు వేరొకరి ప్రభావంలో పరిపాలన చేస్తాడు.అంటే పరిపాలన చేసే పార్టీకి పూర్తి మెజారిటీ లేక ఇతర పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాడు.లేక పరిపాలన చేసే వ్యక్తి అసమర్ధుడై వేరొకరి సూచనల మేరకు పరిపాలన చేస్తాడు.
ఆధారనాడిలో శని ఉంటే దేశంలో అతివృష్టి,తుఫానులు,కరువుకాటకాలు,ప్రజలకు దుర్భిక్షం ఏర్పడుతాయి.అతి వర్షం లేక అత్యల్ప వర్షం,అననుకూల వాతావరణం,ఊహించని ప్రకృతి వైపరీత్యాల వలన ప్రజలు కష్టపడతారు.
ఆసననాడి:-ఆసననాడిలో చంద్రుడున్న రాజు నీతివంతుడై చట్టబద్ధమైన,న్యాయబద్ధమైన పద్ధతులను అమలు పరుస్తూ సమర్ధవంతంగా పరిపాలించును.ప్రభుత్వ ఉద్యోగుల సహాయ సహకారాలతో దేశంలో శాంతిభద్రతలు స్ధాపించును.ప్రధానమంత్రి లేక ముఖ్యమంత్రి లేక ఇతర మంత్రి వర్గ సభ్యుల మరియు ప్రభుత్వ అధికారుల సలహా సంప్రదింపులతో సంప్రదాయబద్దంగా తన పూర్వీకులు ఏవిధంగా పరిపాలించారో ఆ విధంగా పరిపాలిస్తాడు.పరిపాలించే వ్యక్తికి ప్రజాస్వామ్య ఆలోచనలు ఉంటాయి.
ఆసననాడిలో శని ఉంటే యుద్ధభయం,యుద్ధంలో పరాజయం,రోగభాధలు,జనాలకు కష్ట నష్టాలు,భాధలు కలుగుతాయి.యుద్ధ వాతావరణం ఏర్పడటం,నవ్వుల పాలయ్యే పరిస్ధితి ఏర్పడటం,అంటురోగాలుప్రబలటం,ఇతర కారణాల వల్ల ప్రజలు ఇబ్బంది పడటం జరుగుతుంది.
పట్టనాడి:-చంద్రుడు పట్టనాడిలో ఉంటే తన ముందు వ్యక్తి పరిపాలించినట్లుగా పరిపాలిస్తాడు.తనకంటే ముందు వ్యక్తి ఆచరించిన పద్ధతులను అమలు పరుస్తాడు.
పట్టనాడిలో శని ఉంటే పరిపాలన చేసే వ్యక్తి యొక్క బార్య లేక కుమారుడు లేక క్యాబినెట్లోని మంత్రివర్యుని మరణం జరుగుతుంది.పరిపాలనా వ్యక్తికి చాలా కష్టకాలంగా ఉంటుంది.
సింహనాడి:-చంద్రుడు సింహనాడిలో ఉన్న రాజు సింహం లాగా ధైర్యం కలిగి యుద్ధాశక్తుడౌతాడు.తన ఆలోచనా విధానాలతో పని చేస్తాడు.ప్రధాని లేక ముఖ్యమంత్రి ఎక్కువ అధికారాలు కలిగి ఉండి యుద్ధాసక్తుడు మరియు కలహాసక్తుడు అవుతాడు.తన మంత్రి వర్గ మరియు ఇతర అధికారుల సలహాలు తీసుకోకుండా పనిచేస్తాడు.
సింహనాడిలో శని ఉంటే రాజు యొక్క మరణం సూచిస్తుంది.ప్రధానమంత్రికి గాని,ముఖ్యమంత్రికి గాని తీవ్ర అనారోగ్యం ప్రాణగండం లేక పదవీ గండం ఏర్పడుతుంది.
సింహాసననాడి:-సింహాసననాడిలో చంద్రుడున్న రాజు హుందాగా ఉన్నా,చంచలత్వం,శీఘ్రంగా కోపం తెచ్చుకునే వాడు అయివుంటాడు.క్రూరుడై ప్రజలను బాధిస్తాడు.ప్రధాని లేక ముఖ్యమంత్రి అవసరానికి మించిన అధికారాలు కలిగి క్రూరమైన నిర్ణయాలతో ప్రజలనుబాధ పెడతాడు.తనపై తనకు నియంత్రణ లేక ఇంద్రియ లోలుడౌవుతాడు.తన తెలివితక్కువ నిర్ణయాల వల్ల ప్రజల్లో గౌరవం,పేరు కోల్పోతాడు.చంద్రుడు ఆధారనాడిలో ఉన్న రాజుకి శక్తి,అధికారం లేకపోవటం జరుగుతుంది.చంద్రుడు ఆధారనాడి నుండి సింహాసననాడికి మారుతున్నప్పుడు క్రమంగా వ్యక్తి యొక్క అధికారం పెరగటం గమనించవచ్చు.సింహాసననాడిలో వ్యక్తి అధిక శక్తి కలిగి ప్రజలను బాధిస్తాడు.కాబట్టి ఈ రెండు చంద్ర స్ధితులు మంచివి కావు.చంద్రుడు పట్టనాడిలో ఉన్న వ్యక్తికి సమతుల్యమైన అధికారాలు ఉంటాయని సూచించబడుతుంది.
సింహాసననాడిలో శని ఉంటే సింహనాడి మాదిరి రాజు యొక్క మరణాన్ని సూచిస్తాడు.ప్రధానమంత్రికి గాని,ముఖ్యమంత్రికి గాని తీవ్ర అనారోగ్యం,ప్రాణగండం,లేక పదవీగండం ఏర్పడుతుంది.ఆసననాడిలో చంద్రుడు,శని లేక రాహువు లేక రవి లేక కుజ యుతుడైన రాజును లేక ప్రధాన,ముఖ్య మంత్రుల పాలనను నాశనం చేస్తాడు.ఆసనానాడిలో శని వక్రించి ఉంటే మరియు ఇతర పాప గ్రహాలతో యుటి చెంది ఉంటే రాజును లేదా ప్ధాన,ముఖ్య మంత్రలు పాలనను నాశనం చేస్తారు.శని ఏ నాడిలోనూ శుభ పలితాలనివ్వలేడు.అందువల్ల ముహూర్తచక్రంలో గురుగ్రహ ఆశీర్వాదం కావాలి.గురువు ఆసననాడిలో ఉంటే శుభపలితాల నిస్తాడు.అంతేకాక బలవంతుడైన గురుని దృష్టి నైసర్గిక పాపగ్రహాలపై ఉంటే పాప ఫలితాలు ఉపశమిస్తాయి.
సింహాసన చక్రాన్ని పరిశీలించే విధానం
1)ప్రమాణస్వీకార సమయానికి సింహాసన చక్రాన్ని నిర్మించాలి.
2)గ్రహాలను సింహాసన చక్రంలో వాటి వాటి నాడుల్లో గుర్తించాలి.
3)సింహాసన చక్రంలో చంద్రుడున్న నక్షత్రాన్ని మరియు నాడిని గుర్తించాలి.
4)సింహాసన చక్రంలో శని ఉన్న నక్షత్రాన్ని మరియు నాడిని గుర్తించాలి.శని సింహా లేక సింహాసన నాడిలో ఉన్న ప్రభుత్వానికి లేక ప్రధాన,ముఖ్యమంత్రులకు అరిష్టం.అంటే శనేశ్వరుడు చంద్ర,రాహు,కుజ నక్షత్రాలలో ఉండరాదు.
5)ఆసననాడిలో బలహీనమైన లేక ఇతర పాపగ్రహాలచే ప్రభావితమైన చంద్రుడు లేక శని ఉన్న అశుభ ఫలితాలను ఇస్తుంది.
6)ఆసననాడిలో గురుగ్రహం ఉన్న అశుభ ఫలితాల నుండి లేక అరిష్టాల నుండి రక్షణ లభిస్తుంది.
7)ప్రమాణ స్వీకార ముహూర్త సమయానికి నైసర్గిక పాప గ్రహాలైన శని,కుజ,రవి,రాహు,కేతువులు సింహనాడి,లేక సింహాసననాడిలో ఉన్న అశుభ పలితాలనిస్తుంది.
8)ప్రమాణ స్వీకార ముహూర్త సమయానికి కుజ లేక కేతువులు సింహా లేక సింహాసననాడులలో ఉంటే పరిపాలకుడి మరణం లేక భయానక మరణం కలగవచ్చు.
9)ప్రమాణ స్వీకార ముహూర్త సమయానికి శనేశ్వరుడు లేక ఇతర పాపగ్రహాలు పట్టనాడిలో ఉన్న పరిపాలకుడి భార్యకు లేక కుమారునికి లేక ఇతర మంత్రులకు అరిష్టం కలుగుతుంది.మంత్రులపై పుకార్లు,అభాండాలు ఏర్పడతాయి.
10)ఆసననాడిలో పాపగ్రహాలు ఉన్న యుద్ధ భయాన్ని కలుగజేస్తాయి.
11)ఆధారనాడిలో పాపగ్రహాలు ఉన్న ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి.
ఈ విధంగా ప్రమాణ స్వీకార ముహూర్తానికి సింహాసన చక్రం వేసి పరిశీలించాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి