జ్యోతిష్యశాస్త్రం సిద్ధాంత,హోరా,సంహిత,ప్రశ్న,శకునం అను పంచస్కందాత్మకంగా వివరించబడింది.ఒక
వ్యక్తి ప్రశ్నించు సమయానికి గల గ్రహములస్ధితి ఆ ప్రశ్న గురించిన వివరములు మరియు ఆ
ప్రశ్న యొక్క భవిష్యత్తు తెలుపగలవు అనే ప్రాతిపదికతో ప్రశ్న శాస్త్రం వృద్ధిచెందింది.జాతకంలోని
ఒక అంశము యొక్క సూక్ష్మ కాల నిర్ణయము ప్రశ్న ద్వారా మాత్రమే సాద్యపడుతుంది.రెండు అంశాలలో
దేనిని ఎన్నుకోవాలి అనే సంశయం కలిగినప్పుడు ప్రశ్న ఉపయోగ పడుతుంది.ప్రశ్నించని వానికి
ఫలాదేశం చెప్పకూడదు.ప్రశ్నకు ప్రశ్నాశాస్త్రం ద్వారానే జవాబు చెప్పగలరు.
జాతకుడు ఈ
జన్మలో చేసిన పుణ్య పాపముల యొక్క ప్రభావాలు పరిశీలించవలసిన అవసరాన్ని గురించి “ప్రశ్న మార్గం”గ్రంధం లో ఒక
వివరణ ఇచ్చారు.జాతకం పూర్వజన్మ కర్మ ఫలాలను నిర్దేశించేదైతే ప్రశ్న జ్యోతిష్యం ఈ క్షణం వరకు మనం చేసిన పుణ్య పాపాలను కూడ పరిగణలోకి తీసుకొని
ఫలిత నిర్దేశం చేస్తుందంటాడు.జాతకం అనుకూలంగా ఉండి ,ప్రశ్న వ్యతిరేకంగా వస్తే ఈ జన్మలో ఎక్కువ పాపాలు చేశాడని,జాతకం వ్యతిరేకంగా ఉండి ప్రశ్న అనుకూలంగా వస్తే ఈ జన్మలో పుణ్యాలు
ఎక్కువగా చేసినట్లు గుర్తించమన్నాడు.రెండు సమానంగా వస్తే పుణ్య
పాపాలు సమానంగానే చేసినట్లు గుర్తించమన్నాడు.దీనిని బట్టి జాతకం పరీక్షించే ప్రతి సందర్భంలోనూ
ప్రతి అంశానికి ప్రత్యేకంగా ప్రశ్నను కూడ పరీక్షించి చూడవలసిన ఆవశ్యకత జ్యోతిష్యునికి
ఉంది.
జాతకుడు జాతక సహకారంతో పాటు,ప్రశ్నా శాస్త్రాన్ని కూడ పరిశీలించి,పరిశీలన చేయటానికి అవకాశంలేని తక్కిన అంశాలను తపశ్శక్తితో గమనించే
శక్తిని సంపాదించి ప్రశ్న శాస్త్రంద్వారా దాన్ని నిర్ధారించుకొని ఆ తరువాత ఫలితాన్ని
చెప్పినట్లయితే ఎక్కువశాతం వాస్తవానికి
దగ్గరగా,జాతకుడికి ఉపయుక్తమయ్యే సలహాలను జాతకుడు ఇవ్వగలడు.
చంద్రుడు లగ్నంలో శని కేంద్రంలో మరియు బుడుడు అస్తంగత్వం చెందిన లేక లగ్నములోని
చంద్రునిపై బుధ,కుజుల దృష్టి ఉన్న జాతకుడు ప్రశ్నించు విధానం
మంచిది కాదు అని అర్ధం.అనగా జాతకుని నిజాయితీలో లోపమును సూచించును.జ్యోతిష్యున్ని పరీక్షించటానికి
ప్రశ్న అడిగే సూచనలు ఉన్నాయి.
ప్రశ్నించకూడని సమయాలు:-
నక్షత్రాలు:-భరణి,కృత్తిక,ఆరుద్ర,ఆశ్లేష,మఖ,విశాఖ,జ్యేష్ఠ,మూల,పూర్వాషాడ,పూర్వాభాద్ర,మరియు గండాంత నక్షత్రాలు(ఆశ్లేష,జ్యేష్ఠ,రేవతి చివరి పాదాలు,అశ్వని,మఖ,మూల మొదటి పాదాలు)
తిధులు:-అష్టమి,విదియ,సప్తమి,ద్వాదశి,చవితి,నవమి,చతుర్దశి,మరియు అమావాస్య.
యోగములు:-వ్యతీపాత,వైదృతి యోగాలు.
కరణము:-శకుని,చతుష్పాద,నాగ,కింస్తుఘ్న కరణాలు.
వారములు:-మంగళ,శని వారములు.
సూర్య,చంద్ర గ్రహణముల మూడు రోజులు.గుళిక లగ్నంలో ఉన్నప్పుడు,లగ్నంపై పాపగ్రహాల దృష్టి ఉన్నప్పుడు,సంక్రమణ జరిగిన రోజులలో జాతకుడు జ్యోతిష్యుడిని ప్రశ్నించరాదు.పై
సమయాలు జాతకుడి కంటే జ్యోతిష్యునికే గుర్తించే అవకాశాలు ఎక్కువ కాబట్టి జ్యోతిష్కుడు
ఆసమయాలలో ప్రశ్న ఫలితం చెప్పరాదు.
ప్రశ్న ఫలించు యోగాలు:-
పృష్టోదయ రాశులు:-మేషం,వృషభం,కర్కాటకం,ధనస్సు,మకరం.
శీర్షోదయ రాశులు:-మిధునం,సింహం,కన్య,తుల,వృశ్చికం,కుంభ.
ఉభయోదయ రాశులు:-మీనం.
శీర్షోదయ రాశులు ప్రశ్న లగ్నమైతే శుభం, పృష్టోదయ రాశులు ప్రశ్న లగ్నమైతే ప్రశ్న ఫలించదు.ఉభయోదయ రాశులు ప్రశ్న లగ్నమైతే
మధ్యమ ఫలితాన్ని ఇస్తాయి.
చరరాశులు ప్రశ్న లగ్నమైతే ప్రస్తుత పరిస్ధితులలో మార్పు కనబడుతుంది.స్దిర రాశులు
ప్రశ్న లగ్నమైతే మార్పు కనబడదు.ద్విస్వభావ రాశులు ప్రశ్న లగ్నమైతే ఆలస్యం,కష్టంతో ఫలితం కనిపిస్తుంది.
లగ్నాధిపతికి,కారక భావాదిపతికి సంబంధం ఉంటే ప్రశ్న ఫలిస్తుంది.
లగ్నాధిపతి చంద్రుడు శుభ భావాలలో ఉండాలి.కేంద్రాలలో శుభగ్రహాలు,త్రిషడాయులలో పాప గ్రహాలు ఉండాలి.చంద్రుడు ఉపచయాలలో ఉంటే మంచిది.ప్రశ్నాచక్ర
లగ్నం,జన్మ లగ్నం ఒకదానికొకటి ద్విద్వాదశాలు,షష్టాకాలలో ఉండరాదు.
ప్రశ్న చక్రంలో వక్రగ్రహం ఏ భావంలో కలదో ఆభావానికి సంబందించిన అంశములలో
అడ్డంకులు కలుగుతాయి.వక్రించిన శుభగ్రహాలు 6,8,12 భావాలకు
ఆదిపతులైతే శుభపలితం రావటం కష్టం.పాపగ్రహాలు వక్రించి 6,8,12 భావాలకు అధిపతులైతే శుభ ఫలితం రాకపోగా అడ్డంకులు ఎదురవుతాయి.
ప్రశ్న జ్యోతిష్యం సాప్ట్‌వేర్:-1350.00
పై ప్రశ్న జ్యోతిష్యం సాప్ట్‌వేర్ కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో
వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ
చేయవలెను.
Bank Details:-State Bank Of Hyderabad
;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC
Code:-SBHY0021056.
Free testing available
రిప్లయితొలగించండివరి యంత్రం కొనవచ్చా
రిప్లయితొలగించండివరి యంత్రం కొనవచ్ఛా
రిప్లయితొలగించండి