29, జులై 2015, బుధవారం

జాతకం పరిశీలించటం

జాతకం పరిశీలించటం

ఏ వ్యక్తి జాతకాన్ని అయిన పరిశీలన చేసేటప్పుడు జాతక చక్రంలోని గ్రహాలు పరిశీలించాలి.

1)ఉదయించే సమయానికి సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో అదే ఉదయ లగ్నం అవుతుంది.
సూర్యుడు ఉన్న రాశిలో లగ్నమున్న సుమారుగా సూర్యోదయ కాలం.
సూర్యుడికి 7 వ రాశిలో లగ్నమున్న సూర్యాస్తమయ కాలం.
సూర్యుడికి 4 వ రాశిలో లగ్నమున్న మిట్ట మద్యాన్నం.
సూర్యుడికి 10 వ రాశిలో లగ్నమున్న అర్ధరాత్రి అవుతుంది కాబట్టి గమనించాలి.

28, జులై 2015, మంగళవారం

వివాహ లగ్న యంత్ర పిరమిడ్



వివాహ లగ్న యంత్ర పిరమిడ్

వివాహ లగ్న యంత్ర  పిరమిడ్ లోపల వివాహం కాని వారు,వివాహ సంబంధాలలో ఆటంకాలు ఉన్నవారు,వివాహమయిన తరువాత దంపతుల మద్య ఏర్పడే మనస్పర్దలు,కుజ,శుక్ర గ్రహ దోషాలు ఉన్నవారు వారి యొక్క కలర్ పోటో గాని,బ్లాక్ &వైట్ పోటో గాని తీసుకొని పోటోలోని బొమ్మ వైపును యంత్రానికి ఆనించి ఉంచి పిరమిడ్ క్యాప్ తో మూసివేసి కనీసం 45 రోజులపాటు ఎవరు కదిలించని సురక్షిత ప్రదేశంలో ఉంచిన ఆపోటో లోని వ్యక్తులకు పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది.ఈ విధంగా చేయటం వలన వివాహ సమస్యలు,దంపతుల మద్య సమస్యలు తొలగిపోతాయి.

వివాహ లగ్న యంత్ర  పిరమిడ్:-100.00
  
పై  వివాహ లగ్న యంత్ర  పిరమిడ్ కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.

Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.

27, జులై 2015, సోమవారం

వక్క గణపతి


కేతుగ్రహ దోష నివారణకు వక్క గణపతి

కేతువు జాతకంలో బలీహనంగా ఉన్నట్లయి తే... మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవి తంపై విరక్తి, ఏకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్టు ఊహించుకోవడం, తనలో తా నే మాట్లాడుకోవడం, తనను తాను చాలా గొ ప్పవాడిగా లేదా దేవుడు, దేవతగా ఊహించు కోవడం, దేన్ని చూసినా భయపడడం, ఉద్యో గం, భార్యాపిల్లలను వదిలివేసి దేశసంచారం చేయడం, పిచ్చివానిలా ప్రవర్తించడం, విచిత్ర వేషధారణ, సంతానం కలుగకపోవడం, గర్భం వచ్చి పోవడం, చిన్న పిల్లలకు తీవ్ర అనారో గ్యం, చదువులో ఆటంకాలు,అంటువ్యాధులు, వైద్యులు కూడా గుర్తిం చలేని రోగాలు కేతుగ్రహ దోషం వల్ల కలుగు ను.

కేతువు ద్వాదశ భావంలో ఉంటే బాలారిష్ట దోషం.పంచమంలో ఉంటే సంతాన సమస్యలు,చతుర్దంలో బలహీనంగా ఉంటే విద్యా సమస్యలు,ఇలా కేతుగ్రహ సమస్యలు ఉన్నవారు వక్క గణపతిని పూజిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చును.

ప్రశ్న జ్యోతిష్యం సాప్ట్‌వేర్



ప్రశ్న జ్యోతిష్యం

జ్యోతిష్యశాస్త్రం సిద్ధాంత,హోరా,సంహిత,ప్రశ్న,శకునం అను పంచస్కందాత్మకంగా వివరించబడింది.ఒక వ్యక్తి ప్రశ్నించు సమయానికి గల గ్రహములస్ధితి ఆ ప్రశ్న గురించిన వివరములు మరియు ఆ ప్రశ్న యొక్క భవిష్యత్తు తెలుపగలవు అనే ప్రాతిపదికతో ప్రశ్న శాస్త్రం వృద్ధిచెందింది.జాతకంలోని ఒక అంశము యొక్క సూక్ష్మ కాల నిర్ణయము ప్రశ్న ద్వారా మాత్రమే సాద్యపడుతుంది.రెండు అంశాలలో దేనిని ఎన్నుకోవాలి అనే సంశయం కలిగినప్పుడు ప్రశ్న ఉపయోగ పడుతుంది.ప్రశ్నించని వానికి ఫలాదేశం చెప్పకూడదు.ప్రశ్నకు ప్రశ్నాశాస్త్రం ద్వారానే జవాబు చెప్పగలరు.

20, జులై 2015, సోమవారం

భాదకులు



భాదకులు

భాదకులు:-చర లగ్నాలకు లాభాదిపతి భాదకుడు అవుతాడు.
స్ధిర లగ్నాలకు భాగ్యాదిపతి భాదకుడు అవుతాడు.
ద్విస్వభావ లగ్నాలకు సప్తమాధిపతి భాదకుడు అవుతాడు.

చరలగ్నాలు అయిన మేషం,కర్కాటకం,తుల,మకర రాశులకు వరుసగా మేషరాశికి లాభాదిపతి శని,కర్కాటక రాశికి లాభాదిపతి శుక్రుడు,తులారాశికి లాభాదిపతి సూర్యుడు ,మకర రాశికి లాభాదిపతి కుజుడు భాదకులు అవుతారు.

7, జులై 2015, మంగళవారం

లగ్నభావం(తనూభావం)



లగ్నభావం

లగ్నం అంటే తూర్పు దిగ్మండలంపై ఏ రాశి ఉదయిస్తుందో అదే లగ్నం అంటారు.పుట్టిన వ్యక్తి యొక్క జన్మ సమయాన్ని శిశువు గర్బాశయం నుండి బయటకు తీసినప్పుడు కాకుండా అతని మొదటి శ్వాస ,మొదటి ఏడుపు ద్వారా శిశువు జన్మ సమయాన్ని తీసుకొనవలెను.శిశువు ఏడ్చినప్పుడు గ్రహాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

లగ్నభావాన్నే తనూభావం అంటారు.బాల్యం,ఆరోగ్యం,వ్యక్తిత్వం,దేహం,నడవడిక,శరీర వర్ణం,శారీరక,మానసిక స్ధితి,జన్మించిన విధం,ఎత్తు,సామర్ధ్యం,గుణాలు,తెలివితేటలు,ఆయుర్ధాయం మొదలుగునవి తనూభావం ద్వారా తెలుసుకోవచ్చును. లగ్న కారకత్వాలు: పరాశరుడు లగ్నం గురించి వివరిస్తూ లగ్నం ద్వారా తెలుసుకోదగిన అంశాలను ఈ విధంగా చెప్పాడు. 

2, జులై 2015, గురువారం

సింహాసన చక్రం

ప్రమాణ స్వీకార సమయంలో రాజకీయ నాయకుల భవిష్యత్ తెలియజేసే సింహాసన చక్రం..

ప్రమాణస్వీకారం ఉత్తరాయణంలో చేస్తే మంచిది.సింహాసన చక్రాన్ని పంచ నాడీ చక్రం అని కూడా అంటారు.సింహాసనమనగా పరిపాలించు వ్యక్తి కూర్చునే ఆసనం.ప్రమాణస్వీకార సమయంలోని గ్రహస్ధితిని బట్టి సింహాసనచక్రం నిర్మించి పరిశీలిస్తే దేశంలో లేక రాష్ట్రంలో యుద్ధభయం,ఆకస్మిక సంఘటనలు,ప్రభుత్వంలోని ప్రముఖుని లేక నాయకుని మరణం,కరువు కాటకాలు ఏర్పడటం,వాతావరణ పరిస్ధితి,ప్రభుత్వ పతనం మొదలైనవి ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...