26, జూన్ 2013, బుధవారం

ఏకముఖి రుధ్రాక్ష(One Face Rudraksha)

ఏకముఖి రుధ్రాక్ష
                ఏకముఖి రుధ్రాక్ష అర్ధచంద్రాకృతిలో జీడిపప్పు ఆకారంలో మాత్రమే లభిస్తుంది.దీనిని భధ్రాక్ష అని అంటారు.దీనికి ఎటువంటి రంధ్రం ఉండదు.ఏకముఖి రుధ్రాక్ష గుండ్రని సైజులో లభించదు.ఏకముఖి రుధ్రాక్ష సాక్షాత్తు శివ స్వరూపం.

               ఏకముఖి రుధ్రాక్ష మన నవగ్రహాలలో సూర్య గ్రహానికి సంబందించింది.దీనిని ధరించినచో బ్రహ్మహత్యాది మహాపాతకాలు సైతం నశిస్తాయి.ఏకముఖి రుధ్రాక్షని స్త్రీ ,పురుష భేదం లేకుండా అందరు ధరించవచ్చును.

                ఏకముఖి రుధ్రాక్షని రెండు రాగి రేకుల మధ్య ఉంచితే గిరగిరా తిరుగుతుంది అని ,పాలల్లో వేస్తే పాలు విరిగిపోతాయని,ఏకముఖి రుధ్రాక్ష పైన బియ్యం పోసి వుంచితే పైకి వస్తుంది అని కొంతమంది వ్యాపారస్తులు అమ్ముకోవటానికి చేసే మాయమాటలే అని వినియోగదారులు గ్రహించాలి.

              ఏకముఖి రుధ్రాక్షకు ఏటువంటి పరీక్షలు లేవు.కేవలం కంటి చూపుతో మాత్రమే అనుభవపూర్వకంగా నమ్మకమైన వ్యక్తుల వద్ద మాత్రమే ఏకముఖి రుధ్రాక్షని స్వీకరించాలి.ఏకముఖి రుధ్రాక్షని కొంతమంది వ్యక్తులు ప్లాస్టిక్,చెక్క మరియు కెమికల్ పదార్ధాలతోటి తయారుచేస్తారు కావున నమ్మకమైన వ్యక్తులు లేదా షాపుల వాళ్ళ దగ్గర మాత్రమే స్వీకరించాలి.
               ఏకముఖి రుధ్రాక్షని స్వీకరించిన తరువాత శివాలయంలో అభిషేకించాలి."ఓం హ్రీం శ్రీం క్లీం ఏకముఖాయనమః "అనే ధారణ మంత్రాన్ని 11 సార్లు మనస్సులో జపిస్తూ ఏకముఖి రుధ్రాక్షని ధరించాలి.ఏకముఖి రుధ్రాక్షని మహాశివరాత్రి నాడుగాని,సోమవారం నాడుగాని లేదా ఇతర పర్వదినాలలో అభిషేక అర్చనల జరిపిన తరువాత ఏకముఖి రుధ్రాక్షని ధరించాలి.ఏకముఖి రుధ్రాక్షను పూజామందిరంలో ఉంచి పూజించవచ్చు లేదా మెడలో ధరించవచ్చు.
           ఏకముఖి రుద్రాక్షను రాత్రి పూట నిదురించు సమయంలలో తీసివేసి మరల మరుసటి రోజు ఉదయం స్నానంచేసిన తరువాత మాత్రమే ధరించాలి.కొంతమంది స్నానంచేసేటప్పుడు రుధ్రాక్షని మెడలో ఉంచుకొని స్నానం చేస్తారు.ఈవిధంగా చేయటం వలన సబ్బులో ఉండే కెమికల్స్ మనం వేసుకొన్న రుధ్రాక్షని తొందరగా పాడయ్యే విధంగా చేస్తాయి.
ఏకముఖి రుధ్రాక్ష ఉపయోగాలు.
                   ఏకముఖి రుధ్రాక్షకి సూర్య గ్రహాం అధిపతి.కాబట్టి జాతకంలో సూర్య గ్రహా దోషాలు ఉన్నవారు తప్పకుండా ధరించాలి.అనారోగ్య సమస్యలను తొలిగిస్తుంది.తలనొప్పి,కంటి సమస్యలు వున్నవారు తప్పకుండా ఏకముఖి రుధ్రాక్షని ధరించాలి.ఇతరులకు అపకారం కోరని మనశ్శుద్దిని కలిగిస్తుంది.దీర్ఘకాల కోపాల్ని తగ్గిస్తుంది.ఇతరులు మిమ్మల్ని గౌరవించే విధంగా మీ మాట తీరుని మారుస్తుంది.
                  ఏకముఖి రుధ్రాక్ష రాజకీయాలలో రాణింపు,పెద్దమనిషిగా గుర్తింపుని ఇస్తుంది.ప్రతి పనిలోను ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది.పలువురు చెప్పిన విషయాలను సమన్వయాత్మకంగా ఆలోచించి కొత్తదనంతోకూడిన ఆలోచనని పొందుతారు.వ్యవహారనైపుణ్యం,జనసహాకారం కలిగి ఉంటారు.శివుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది.
                 ఏకముఖి రుధ్రాక్ష ప్రభుత్వ ఉద్యోగాలలోరాణింపు,గుర్తింపుని కలిగిస్తుంది.హృదయ సంబంద రోగాలను తగ్గిస్తుంది.బయటకు కనిపించని పిరికితనాన్ని పోగొడుతుంది.మానవ సంబంద విషయాలలో అధికశ్రద్ధని కలిగిస్తుంది.

                  ఏకముఖి రుధ్రాక్ష సమస్యని తమంతట తాముగా పరిష్కరించుకొనే సామర్ధ్యాన్ని కలిగిస్తుంది.కుటుంబ విషయాలలో నిర్లక్ష్యం లేకుండా చేస్తుంది.ఆపత్కాలంలో నూతన విషయాలు స్పురిస్తాయి.శత్రువుల పై విజయం సాదిస్తారు.తండ్రితో విబేధాలు వుండవు.ధనాభివృద్ధిని కలిగిస్తుంది.ఇతరులపై ప్రభావంచూపటమేకాక వారిని తమ బాటలో నడుపుకొనే విధంగా అధికారాన్ని కలిగిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...