గుర్రపు నాడా
గుర్రపు నాడాని నల్లగుర్రానికి కొట్టబడిన వెనకనున్న ఎడమకాలి నాడాని మాత్రమే స్వీకరించాలి.గుర్రానికి కొట్టకుండా ఉన్న నాడాని ఉపయోగించినను ఎటువంటి ఫలితము ఉండదు.గుర్రపునాడాని శనివారం గాని, శనిత్రయోదశి నాడు గాని సేకరించి గుర్రపునాడాకి హనుమాన్ సింధూరం పూసి ఉంచాలి.
సింధూరంతో పూసిన గుర్రపునాడాని శని వారం ఉదయం ఇల్లు లేదా ఆఫీసు లేదా ప్యాక్టరీ యొక్క ప్రదాన ద్వారానికి ఎడమవైపున ఉంచాలి.ఇంటికి సంబందించినంతవరకు గుర్రపునాడాని "A" ఆకారంలో ఉంచాలి.అనగా ఊర్ధ్వ ముఖంగా ఉంచాలి.ఇలా ఉంచటంవలన శనిదోషం ,నరదృష్టి ప్రభావాలు కిందకి అనగద్రొక్కబడతాయి.
గుర్రపునాదాని వ్యాపార స్ధలంలో గాని ప్యాక్టరీ ప్రధాన ద్వారానికి ఎడమవైపున "U" ఆకారంలో ఉంచాలి.ఇలా ఉంచడంవలన శత్రుభాధలు,దృష్టి దోషాలు దరిచేరనివ్వదు.
ఉపయోగాలు:-
1)ఏలినాటి శని,అష్టమ శని,అర్ధాష్టమ శని ఉన్నవారు వారు నివసిస్తున్న ఇంటిలోగాని వ్యాపారస్ధలంలో గాని గుర్రపునాడాని ఉంచిన లేదా నాడా చేసిన రింగుని ఎడమచేతి మధ్య వ్రేలుకి ధరించిన,నాడాని కడియంలాగా చేసుకొని ఎడమచేతికి ధరించిన శనితీవ్రత తగ్గు ముఖం పడుతుంది.
2)అంగారక దోషం కూడ తగ్గుతుందని కొంతమంది నమ్మకం.
3)గుర్రపునాడా ఉన్న ఇల్లు ఇంటిలోనివారికి రక్షణ కవచంలాగా ఉంటుంది.
4)చేతబడులు,రోగాలు,దృష్టిదోషాలు ధరిచేరనివ్వదు.
5)మంచి ఆరోగ్యాన్ని చురుకు తనాన్ని ప్రసాదిస్తుంది.
6)ఇనుము,నూనె,పెట్రోల్ బంక్ లు ,నువ్వులు,మిరియాల వ్యాపారాలు చేసేవారు తప్పకుండా వారి వ్యాపారస్ధలంలో గుర్రపునాడాని ప్రధాన ద్వారానికి ఉంచాలి.
7)రాజకీయ నాయకులు, సినిమా,సాప్ట్‌వేర్ ,టెలికమ్యూనికేషన్,అధికారుల తోటి అవమానాలు ఉన్నవారు ఈ గుర్రపునాడాని ఉపయోగించాలి.
శని సంచారం అంటే సాధారణంగా అందరూ అధికంగా భయపడతారు. నిజంగా ఆయన అంత భయంకరమైన గ్రహమా? రాశి చక్రంలో మకర కుంభ రాశులకు అధిపతి. అనూరాధ, పుష్యమీ, ఉత్తరాభాద్రలకు ఆధిపత్యం వహిస్తూ 19 సంవత్సరాల కాలం దశాకాలం తీసుకున్న శని, అందరినీ ఇబ్బంది పెడతారా? శని వచ్చాక మాత్రమే బాగు పడినవారూ ఉన్నారు.
‘యుష్యం జీవనోపాయం మరణంచ శనైశ్చరమ్’ అని ‘ముహూర్త దర్పణం కారక నిఘంటువు’లో ఉంటుంది. ఆయుష్షు జీవనోపాధి రెండింటికీ శనియే కారకుడు.ఇటువంటి కారకత్వాలు వేరే ఇతర గ్రహాలకు లేవు. ఇబ్బంది పెట్టవలసిన సందర్భంలో ఎంత ఎక్కువ ఇబ్బంది పెడతాడో వరములు ఇచ్చే విషయంలో కూడా ఆయన ఇచ్చే స్థాయి అధికమైనదే అంటే ఆశ్చర్యమే. మారకత్వం ఇవ్వాలి అంటే ఇతర ఏ గ్రహాలు సరియగు స్థితిలో లేవు అంటే అప్పుడు ‘అతిక్రమ్యేతరాన్ సర్వా భవత్సేన సంశయః’ అని ఎవరి కారకత్వాలతోనూ సంబంధం లేకుండా మారకం ఇచ్చే గ్రహం శనైశ్చరుడు.
జైమిని సూత్రాలతో బాగా రీసెర్చ్ చేసేవారు ఒక మంచి మాట చెబుతారు. ఎవరి వ్యాపకములలో వారు వుంటే శని ఏమీ చేయడు అని. అది నిజమే. ఇతరుల పనులలో తలదూర్చినా చేయు వృత్తితో పాటు కొత్త వృత్తి ఆశ్రయించినా అది ఇబ్బంది పెట్టే అంశాలుగా మారుస్తాడు. ప్రాకృత ధర్మం తప్పిన వారి విషయంలోనే శని ప్రభావం అధికం అని చెబుతారు.
ఐరన్, స్టీల్, సిమెంట్, సాల్ట్‌బేస్డ్ వ్యాపారాలు, ఫర్నీచర్, మందులు వంటి వ్యాపారులు, వైద్యులు బాగున్నారు అంటే వారికి శని అనుగ్రహం వున్నది అని గ్రహించవచ్చు. అలాగే శని దోషం త్వరగా ప్రసరించేది మాలిన్యమైన సందర్భాలలోనే. అందులో భాగంగా పురాణాలలో విజ్ఞానం ఉండి అలాగే జ్యోతిశ్శాస్త్రం మీద అవగాహన ఉన్నవారు చెప్పే శని శాంతి మార్గాలు.
ప్రాకృతమయిన ధర్మాలు విడనాడటం, ఒకరి చెప్పులు మరొకరు ధరించడం, ఒకరోజు ధరించిన వస్తమ్రులు మరుసటిరోజు ధరించడం, పగలు నిద్రా సామాగ్రి వాడటం, మంచం మీద పగలు కూర్చోవడం, పడుకోవడం, ఎప్పుడూ నిద్రమత్తుగా ఉండటం, రాత్రులందు తైలము రాసుకోవడం, ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడడం, పురుషుడు రోజూ తలస్నానం చేయకపోవడం, తోలు, ఉప్పు ఇనుము చెక్క వంటి వస్తువులు ఉచితంగా తీసుకోవడం, పాదప్రక్షాళన లేకుండా బయట తిరిగి ఇంటిలోకి రావడం, ఇలా జ్యేష్ఠాదేవిని ఆహ్వానించే అంశాలు అన్నీ కూడా ఎవరయితే పాటిస్తారో వారిని శనైశ్చరుడు ఇబ్బందికి గురి
చేస్తాడు అని చెబుతారు.

Nijama namacha
రిప్లయితొలగించండి