26, జూన్ 2013, బుధవారం

ద్విముఖి రుధ్రాక్ష(2 Face Rudraksha)


ద్విముఖి రుధ్రాక్ష
                    ద్విముఖి రుధ్రాక్షకు రెండు ముఖాలు కలిగి ఉంటాయి.ఇది అర్ధనారీశ్వర స్వరూపానికి ప్రతిరూపం.ద్విముఖి రుధ్రాక్షకి పార్వతి దేవి అధిపతి.ద్విముఖి రుధ్రాక్ష బధ్రాక్ష రూపం లోను,రుధ్రాక్ష రూపంలోను దొరుకుతుంది.
                  ద్విముఖి రుధ్రాక్ష గుండ్రని ఆకారంలో వున్నది అరుదుగాను,మరియు ధర ఎక్కువగాను ఉంటుంది కాబట్టి కొంతమంది బధ్రాక్షని ధరిస్తారు.బధ్రాక్షకి రంధ్రం ఉండదు.ద్విముఖి రుధ్రాక్ష మన నవగ్రహాలలో చంద్రగ్రహానికి సంబందించినది.ద్విముఖి రుధ్రాక్ష ధరిస్తే గోహత్యాపాతకాలు నశిస్తాయి.
             ద్విముఖి రుధ్రాక్షని కార్తీకమాసం రోజుగాని సోమవారం రోజుగాని శివాలయంలో అభిషేకార్చనలతో పూజించి ధరించాలి."ఓం శ్రీ అర్ధనారీశ్వరాయ నమః" అనే ధారణ మంత్రాన్ని 11 సార్లు మనస్సులో జపించుకొంటు రుధ్రాక్షని ధరించాలి.
ద్విముఖి రుధ్రాక్ష ఉపయోగాలు:-
              ద్విముఖి రుధ్రాక్షని ధరించిన వారికి జాతకంలో చంద్రగ్రహా దోషాలు తొలిగిపోతాయి.వ్యాపారాలలో మెలుకవలు ,క్రయవిక్రయాలలో అనుభవాన్ని ఇస్తుంది.మతిమరుపు ఉన్నవారు తప్పకుండా ద్విముఖి రుధ్రాక్షని ధరించాలి.
               ద్విముఖి రుధ్రాక్షని ధరించిన వారికి కళలు,సాహిత్యం,కవిత్వం,సంగీతం,ఆటపాటలయందు ఆసక్తిని కలిగిస్తుంది.నిర్మలమైన మనస్సును,మంచి ఆలోచనా విధానాన్ని కలిగిస్తుంది.
               ద్విముఖి రుధ్రాక్షని ధరించిన వారికి ఆధ్యాత్మిక చింతన కలిగిస్తుంది.విధి నిర్వహణలో ఏకాగ్రతను కలిగిస్తుంది.వశీకరణ శక్తిని కలిగిస్తుంది.ప్రతి వ్యవహారంలోను విజయం,సర్వాభీష్టసిద్ధి చేకూరతాయి.
                ద్విముఖి రుధ్రాక్షను గర్భిణి స్త్రీలు ధరించిన సుఖప్రసవం అవుతుంది.స్త్రీల ఋతు దర్మం మీద పనిచేస్తుంది.మూర్చ,కామెర్ల రోగాలను, స్ధనాల కేన్సర్ ,గర్భాశయ సంబంద రోగాలు నివారణవుతాయి.
                  ద్విముఖి రుధ్రాక్షని అదికంగా ప్రయాణాలు చేసేవారు,మహిళాసంఘాల వారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ,కుటుంబంలలో కలతలు లేకుండా చేస్తుంది.మనుషులలో ఉద్రేక స్వభావాలను తగ్గిస్తుంది.శరీరంలోని తెల్లరక్తకణాల అభివృద్ధి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగే సామర్ద్యాన్ని కలిగిస్తుంది.శరీరంలోని రక్తప్రసరణ సరిగా జరిగేటట్టు చేస్తుంది.
                  ద్విముఖి రుధ్రాక్షని వాటర్ షాపు వాళ్ళు,గృహా నిర్మాణపనులు చేసేవారు,పెద్ద పెద్ద కట్టడాలు కట్టెవారు,డ్యాం నిర్మాణ పనులు చేసేవారు ,హోటల్ మేనేజ్‌మెంట్ చేసేవారు ,వ్యవసాయం చేసేవారు  ద్విముఖి రుధ్రాక్షని తప్పకధరించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...