9, జూన్ 2013, ఆదివారం

చైనా లక్కీ కాయిన్స్(Feng Shui Lucky Coins)

చైనా లక్కీ కాయిన్స్
              ఫెంగ్‌షూయ్ అదృష్ట నాణాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిధ్ధి చెందినవి.ఫెంగ్‌షూయ్ నాణెం సాధారణ నాణెం వలె గుండ్రంగా ఉండి మధ్యలో చతురస్త్రపు రంధ్రం కలిగి ఉంటుంది.మధ్య రంధ్రం భూశక్తిని,నాణెం యొక్క వలయం స్వర్గ శక్తిని,నాణానికి కట్టబడిన ఎర్ర రిబ్బన్ మానవ శక్తిని సూచిస్తుంది.
                  అయస్కాంతం ఇనుమును ఎలా ఆకర్షిస్తుందో ఈ ఫెంగ్‌షుయ్ నాణెం కూడ అదే విధంగా సంపదను ఆకర్షిస్తుంది. ఈ విషయాన్ని ప్రపంచమంతా అనుభవపూర్వకంగా అంగీకరించారు.అమెరికా వంటి దేశాలలో ఈ ఫెంగ్‌షుయ్ నాణాలను ఉపయోగిస్తున్నారు అంటే దీని ప్రాముఖ్యం ఏపాటిదో మీరే ఆలోచించాలి.


                 ఎర్రరిబ్బన్ తో కట్టబడిన మూడు (3)ఫెంగ్‌షుయ్ నాణాలను ఉపయోగించే విధానం. 

              ఫెంగ్‌షుయ్ కాయిన్స్ ని ఎర్రని కవర్లోగాని,పర్సులోగాని పెట్టి బిల్ బుక్స్,ఆర్డర్ బుక్,బ్యాంక్ చలానా మరియు పాస్ బుక్ పైన అంటించాలి.కాయిన్స్‌ని బయటకి కనబడకుండా ఉంచాలి.ఈ పద్దతి ప్రకారం చేస్తే మీకు మనీ రొటేషన్ బాగా జరుగుతుంది.
               
బ్యాంక్ లాకర్ లోపల,బీరువా లోపల,వ్యాపారస్తులు డబ్బు దాచుకొనే గల్లాపెట్టె లోపల ఈకాయిన్స్‌ని ఉంచిన ధనానికి ఎప్పుడు కొరత ఉండదు.టెలీపోన్ ,కంప్యూటర్ వంటి వాటి ద్వారా వ్యాపారాలు చేసే వారు ఈ నాణాలను వాటిపై అంటిస్తే వ్యాపార వ్యవహారాలన్నీ విజయవంతమై ధనలాభం కలుగుతుంది.ఈకాయిన్స్‌ని అన్ని వర్గాలవారు,అన్ని కులాలవారు, స్త్రీ పురుష బేదం లేకుండా మనిపర్స్‌లో గాని,పాకెట్,హ్యాండ్ బ్యాగ్,సూట్ కేస్,బ్రీప్ కేసు,వంటి వాటిలో ఈకాయిన్స్‌ని ఉంచితే ధనం వృధాగా ఖర్చు కాదు.ముఖ్యమైన ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కానుకతోపాటు ఈ కాయిన్స్‌ని ఇచ్చినట్టైతే ఇచ్చినవారికి పుచ్చుకున్నవారికి సకల సంపదలు లభించగలవు.             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...