27, ఆగస్టు 2015, గురువారం

చంద్ర ద్వాదశావస్ధలు



కేరళ జ్యోతిష్య రహస్యాలు

గ్రహావస్ధలు శుక్ర కేరళ రహస్య గ్రంధంలోనివి.పరాశర మహాముని చేత చెప్పబడిన ఈ గ్రహావస్ధలు రహస్య అవస్ధలని తెలియజేయబడినవి.

శ్లో:-మేషాది గణయే త్ప్రా ఙ్ఞా  శ్చంద్రావస్ధా ప్రకీర్తితః
ఇతరేషాంగ్రహాణాంతు చంద్రస్ధం రాశిమారభేత్

మేషరాశి మొదలుకొని చంద్రుడున్న రాశి వరకు లెక్కింపగా చంద్రావస్ధలగును.ఇతరగ్రహాలకు చంద్రుడున్న రాశి మొదలుకొని ఇతరగ్రహాలున్న రాశివరకు లెక్కింపగా ఇతర గ్రహావస్ధలగును.

26, ఆగస్టు 2015, బుధవారం

పాచక,బోదక,కారక,వేదక యోగాలు



పాచక,బోదక,కారక,వేదక యోగాలు 

జాతకునికి ఈ సప్త గ్రహాలు అయా దశల యందు ఈ యోగాలు కలుగజేయును.పాచకయోగం పొందిన గ్రహం యొక్క దశలో వారిచ్చు ఫలములను ప్రకాశింపజేయును..భోదకయోగం పొందిన గ్రహం యొక్క దశలో వారిచ్చే ఫలములను బోదపరచేవాడగును.కారకయోగం పొందిన గ్రహం యొక్క దశలో వారిచ్చు ఫలములను చేయించేవాడగును.వేదకయోగం పొందిన గ్రహం యొక్క దశలో వారిచ్చు శుభ ఫలములను నాశనము చేయువాడు అగును.

24, ఆగస్టు 2015, సోమవారం

గ్రహాలు అవస్ధలు



గ్రహాలు అవస్ధలు

శ్లో;-దీప్తాస్స్వస్ధో ముదిత శ్శాన్త శ్శక్తోని పీడితో భీతః
    వికలః ఖలశ్చకధితో నవ ప్రకారో గ్రహౌహరినా!

22, ఆగస్టు 2015, శనివారం

తిధులు ఉపయోగాలు



తిధులు
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి. శుక్లపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు 15, మరల కృష్ణపక్షంలో పాడ్యమినుండి అమావాస్య వరకు 15. మొత్తం 30 తిథులు. రవి చంద్రుల మధ్య దూరం 0 డిగ్రీ ఉన్నప్పుడు అమావాస్య, 180 డిగ్రీలు దూరమున్నప్పుడు పూర్ణిమ ఏర్పడుతాయి. చంద్రుడు, రవి నుండి ప్రతి 12 డిగ్రీలు నడిచినపుడు తిథులు మారతాయి.

17, ఆగస్టు 2015, సోమవారం

తిధులు



తిధులు
సూర్య చంద్రుల మద్య దూరాన్ని తిధి అంటారు.చంద్రుడు సూర్యుడిని దాటి 12° నడచిన ఒక తిధి అగును.దీనిని శుక్లపక్ష పాడ్యమి అంటారు.చంద్రుడు సూర్యున్ని దాటి 180° నడచిన దానిని శుక్ల పక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకు,చంద్రుడు సూర్యున్ని దాటి 180° వరకు ఉన్నంతకాలం శుక్ల పక్షం.చంద్రుడు సూర్యున్ని దాటి 180° నుండి 360° వరకు నడుచు కాలం కృష్ణ పక్షం అగును.ఒక నెలలో శుక్ల పక్షం,కృష్ణ పక్షం అను రెండు భాగాలుగా చేయబడింది.శుక్ల పక్షంలో 15 తిధులు,కృష్ణ పక్షంలో 15 తిధులు  ఉంటాయి.శుక్ల పక్షం లో 15 తిధి పూర్ణిమ,కృష్ణ పక్షంలో 15 వతిధి అమావాస్య.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...