వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు
మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు
పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము
ఉన్నది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి. శుక్లపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు 15, మరల కృష్ణపక్షంలో
పాడ్యమినుండి అమావాస్య వరకు 15. మొత్తం 30 తిథులు. రవి చంద్రుల మధ్య దూరం 0 డిగ్రీ ఉన్నప్పుడు
అమావాస్య, 180 డిగ్రీలు దూరమున్నప్పుడు పూర్ణిమ ఏర్పడుతాయి. చంద్రుడు, రవి నుండి ప్రతి 12 డిగ్రీలు
నడిచినపుడు తిథులు మారతాయి.
ఉత్తమ తిధులు:- 11. శుక్ల ఏకాదశి,12. శుక్ల ద్వాదశి,13. శుక్ల త్రయోదశి,14. శుక్ల చతుర్దశి,15. పూర్ణిమ, 1. కృష్ణ పాడ్యమి,2. కృష్ణ విదియ,3. కృష్ణ తదియ,4. కృష్ణ చవితి,5. కృష్ణ పంచమి.
మద్యమ తిధులు:- 6. శుక్ల షష్ఠి,7. శుక్ల సప్తమి,8. శుక్ల అష్టమి,9. శుక్ల నవమి,10. శుక్ల దశమి, 6. కృష్ణ షష్ఠి7. కృష్ణ సప్తమి,8. కృష్ణ అష్టమి,9. కృష్ణ నవమి,10. కృష్ణ దశమి.
అధమ తిధులు:- 12. శుక్ల ద్వాదశి,3.శుక్ల తదియ,4.శుక్ల చవితి,5.శుక్ల పంచమి.11.కృష్ణ ఏకాదశి,12.కృష్ణ ద్వాదశి,13.కృష్ణ త్రయోదశి,14.కృష్ణ చతుర్ధశి,15.అమావాస్య.
సంకల్పతిధి;-ఒక రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఏ తిధి ఉన్నదో ఆ తిధినే ఆ రోజంతా సంకల్పానికి చెప్పాలి.ఒక రోజు సూర్యోదయానికి ఒక తిధి ఉండి మరుసటి రోజు సూర్యోదయం లోపల ఇంకొక తిధి వస్తే మొదటి తిధి ‘ఉపరి’రెండవ తిధి అని చెప్పాలి.
తిధి సంధి:-పంచమి,షష్ఠి లయొక్కయు,దశమి,ఏకాదశి ల యొక్కయు 4 ఘడియలు తిధిసంధి అనబడును.ఈ సంధిన జననమైన యెడల పితృగండం.
గండతిధి:-పూర్ణ తిధులలో చివరి 48 నిమిషాలు,నంధ తిదులలో మొదటి 48 నిమిషాలు తిధి గండాతాలు అవుతాయి.శుభకార్యాలు చేయరాదు.
పంచ పర్వతిధులు :-అష్టమి,చతుర్ధశి,అమావాస్య,పౌర్ణమి,సూర్య సంక్రమణం ఉన్న తిధి పంచపర్వ తిధులు అంటారు.ఇవి శుభకార్యాలకు పనికిరావు.
పక్ష రంధ్ర తిధులు:-చవితి మొదటి 8 ఘడియలు,షష్ఠి మొదటి 9 ఘడియలు,అష్టమి మొదటి 14 ఘడియలు,నవమి మొదటి 25 ఘడియలు,ద్వాదశి మొదటి 10 ఘడియలు,చతుర్ధశి మొదటి 5 ఘడియలు.ఈ ఘడియలలో వివాహం చేయరాదు.మిగిలిన ఘడియలు శుభప్రధములు.
పితృకార్యములకు తిధి:-అహఃప్రమాణమును (పగటి ప్రమాణం)ను ఐదు భాగాలుగా చేస్తే అందులో మొదటిభాగం ప్రాతఃకాలం,రెండవ భాగం సంగమ కాలం,మూడవ భాగం మధ్యాన్నం,నాల్గవ భాగం అపరాహ్నం,ఐదోభాగం సాయంకాలం .ఏ తిధి మద్యాన్నం మించి అపరాహ్నం వరకు వ్యాపించి ఉన్నదో ఆ తిధి పితృకార్యములకు మంచిది.
Janta tidulu ante yemitandi
రిప్లయితొలగించండి