కేరళ జ్యోతిష్య
రహస్యాలు
గ్రహావస్ధలు శుక్ర
కేరళ రహస్య గ్రంధంలోనివి.పరాశర మహాముని చేత చెప్పబడిన
ఈ గ్రహావస్ధలు రహస్య అవస్ధలని తెలియజేయబడినవి.
శ్లో:-మేషాది గణయే త్ప్రా ఙ్ఞా శ్చంద్రావస్ధా
ప్రకీర్తితః
ఇతరేషాంగ్రహాణాంతు
చంద్రస్ధం రాశిమారభేత్
మేషరాశి మొదలుకొని
చంద్రుడున్న రాశి వరకు లెక్కింపగా చంద్రావస్ధలగును.ఇతరగ్రహాలకు చంద్రుడున్న రాశి మొదలుకొని ఇతరగ్రహాలున్న రాశివరకు లెక్కింపగా ఇతర
గ్రహావస్ధలగును.
శ్లో:- ప్రవాసనష్టే
చ మృతి జయం చ హాస్వంచ క్రీడారతి సుప్తయశ్చ
భుక్తి జ్వరం కంపిత నూస్ధిరాశ్చ భవం త్యవస్ధా స్సతతమ్ శశాంకే¦¦
చంద్రుడు మేషాదిగా
1 వస్ధానంలో ఉంటే ప్రవాసావస్ధ,2 వస్ధానంలో నష్టం,3 వస్ధానంలో మృతి,4 వస్ధానంలో జయం,5 వస్ధానంలో హాస్యం,6 వస్ధానంలో క్రీడ ,7 వస్ధానంలో రతి ,8 వస్ధానంలో నిద్రావస్ధ ,9 వస్ధానంలో భోజనం,10 వస్ధానంలో జ్వరం,11 వస్ధానంలో తొందరపాటు,12 వస్ధానంలో స్ధిరత్వం ఈ పన్నెండు అవస్ధలు చంద్ర ద్వాదశావస్ధలు అంటారు.
ఇతర గ్రహ అవస్ధలు
శ్లో:-ధీరఃప్రకంపీ
గమితశ్చ భోగీ భుక్తి శ్శయానః కుపితో దయాళుః
నుప్తః ప్రమోదశ్చ నూఖం
భయం చ భవంత్యవస్ధా స్సతతంగ్రహేషు¦¦
చంద్రుడున్న రాశి నుండి
ఇతర గ్రహాలు 1 వస్ధానంలో ఉన్న ధీరత్వం,2 వస్ధానంలోప్రకంపనము,3 వస్ధానంలో గమనము,4 వస్ధానంలో భోగం,5 వస్ధానంలోభోజనం,6 వస్ధానంలోశయనం,7 వస్ధానంలోకోపం,8 వస్ధానంలోదయా స్వభావం,9 వస్ధానంలోనిద్ర,10 వస్ధానంలో సంతోషం,11 వస్ధానంలో సుఖం,12 వస్ధానంలో భయం.ఈ 12 అవస్ధలు చంద్రుని నుండి ఇతర గ్రహాలైన రవి,బుధ,కుజ,గురు,శుక్ర,శని గ్రహాలు ఉన్నప్పుడు ఈ అవస్ధలు పొందుతారు.
1)ధీరావస్ధను పొందిన
గ్రహం ధైర్యవృద్ధిని ,బలం,ధనం,ఆయుష్యును,కీర్తిని,జాతకునికి కలుగజేయును.
2)ప్రకంపనావస్ధను పొందిన
గ్రహం మనో దుఃఖం,శత్రుభయం,ధన నాశనం,జాతకునికి కలుగజేయును.
3)గమనావస్ధను పొందిన
గ్రహం సుఖమును,ధన లాభం,ప్రయాణాలు జాతకునికి
కలుగును.
4)భోగావస్ధను పొందిన
గ్రహం భోగభాగ్యాలు,సంపదలు,స్త్రీ సౌఖ్యం,పుత్ర లాభం ,జాతకునికి కలుగును.
5)భుక్తావస్ధను పొందిన
గ్రహం సౌఖ్యభోజనం,సంపద,దేహదారుడ్యం జాతకునికి
కలుగును.
6)శయనావస్ధను పొందిన
గ్రహం జ్వరం,భయం,రోగాలు జాతకునికి కలుగును.
7)దయావస్ధను పొందిన గ్రహం
ఙ్ఞానాన్ని,విద్యను,సంపదను,భూలాభాన్ని,జాతకునికి కలుగును.
8)కోపావస్ధను పొందిన
గ్రహం అధికారుల ఒత్తిడి,భయం,బంధు ద్వేషం,జాతకునికి కలుగును.
9)నిధ్రావస్ధను పొందిన
గ్రహం మరణభయం,రోగభయం,జాతకునికి కలుగును.
10)సంతోషావస్ధను పొందిన
గ్రహం ఎల్లప్పుడు సుఖమును,సంతోషమునుగౌరవాలను,సౌఖ్యజీవనం జాతకునికి కలుగును.
11)సుఖావస్ధ యందున్న గ్రహం
సుఖం,వాహన సౌఖ్యం,మిత్ర లాభం,పుత్ర వృద్ధిని జాతకునికి కలుగజేయును.
12)భయావస్ధను పొందిన గ్రహం
భయాన్ని,బుద్ధిలేమిని,చంచలస్వభావాన్ని జాతకునికి కలుగుజేయును.
ఉదా:-జాతకచక్రంలో చంద్రుడు
మేషాదిగా 8 వస్ధానంలో ఉన్నాడు . చంద్ర ద్వాదశావస్ధలలో 8 వ అవస్ధ నిద్రావస్ధ.
చంద్రుడి నుండి సూర్యుడు
11 వస్ధానంలో ఉన్నాడు కాబట్టి ఇతర గ్రహావస్ధ లలో 11 వ అవస్ధ సుఖావస్ధ
చంద్రుడి నుండి బుదుడు 11 వస్ధానంలో ఉన్నాడు కాబట్టి ఇతర గ్రహావస్ధ లలో 11 వ అవస్ధ సుఖావస్ధ .
చంద్రుడి నుండి కుజుడు
12 వస్ధానంలో ఉన్నాడు కాబట్టి ఇతర గ్రహావస్ధ లలో 12 వ అవస్ధ భయావస్ధ.
చంద్రుడి నుండి గురువు
9 వ స్ధానంలో ఉన్నాడు కాబట్టి ఇతర గ్రహావస్ధ లలో 9 వ అవస్ధ నిద్రావస్ధ.
చంద్రుడి నుండి శుక్రుడు
12 వస్ధానంలో ఉన్నాడు కాబట్టి ఇతర గ్రహావస్ధ లలో 12 వ అవస్ధ భయావస్ధ.
చంద్రుడి నుండి శని
10 వస్ధానంలో ఉన్నాడు కాబట్టి ఇతర గ్రహావస్ధ లలో 10 వ అవస్ధ సంతోషావస్ధ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి