10, మే 2021, సోమవారం
గోధూళికా ముహూర్తము
6, మే 2021, గురువారం
జాతకచక్రంలో ఆకస్మిక ధనప్రాప్తి కలిగే యోగాలు
ఆకస్మిక లాభాలు అనగా పందెం, జూదం, లాటరీలు మొదలగువాని వలన కలిగే లాభం. ఇటువంటి ధన ప్రాప్తి కోసం జాతకచక్రంలో ధన యోగముండాలి. ఇటువంటి ఆకస్మిక లాభాలు పంచమ స్ధానం వాని అధిపతిని బట్టి విచారించటం పంచమ స్ధానం బలం కలిగి అందులో శుభ గ్రహాలు ఉండి శుభగ్రహ దృష్టి కలిగి ఉండి పంచమాధిపతి బలవంతుడై ద్వితీయ లాభ స్ధానాల్లో శుభగ్రహ దృష్టి కలవారై ఉంటే జాతకునికి ఆకస్మిక లాభాలు ఉంటాయి. పంచమ స్ధానం పాపగ్రహ సంయోగం, పాపగ్రహ వీక్షణ కలిగి పంచమాధిపతి ద్వాదశ స్ధానంలో పాపగ్రహ సంయోగం, పాపగ్రహ వీక్షణం కలిగి ఉంటే జాతకుడు నష్టపోయే ప్రమాదం ఉంది. చంద్రుడు రాహువు పంచమ స్ధానంలో ఉంటే ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక లాభాలకు, నష్టాలకు అష్టమ స్దానాన్ని పరిశీలించాలి. అష్టమంలో పాపగ్రహాలుంటే ఆకస్మిక నష్టాలు, శుభగ్రహాలు, స్ధాన బలం మొదలగు షడ్బలాలు కలిగి ఉంటే ఆకస్మిక లాభాలు వస్తాయని గుర్తించుకోవచ్చు.
5, మే 2021, బుధవారం
గ్రహాలు గోచార రీత్యా ద్వాదశ రాశులలో సంచార చేస్తున్నప్పుడు కలిగే ఫలితాలు
గ్రహాలు నిత్యము చలనము కలిగి ఉంటాయి. స్థిరముగా ఒకదగ్గర ఉండవు. అలా చలనము కలుగుతూ వివిధ రాశులలో తమతమ కక్ష్యలలో భ్రమణము చెందుతూ ఉంటాయి. దీనినే గోచారము అంటారు.
జాతకులు జన్మించిన జన్మ రాశి ఆధారముగా గోచారము ద్వారా ఫలితములు తెలుసుకోవచ్చు. ఒకవేళ జన్మ రాశి తెలియనివారికి పేరును బట్టి నామ నక్షత్రముతెలుసుకొని నామ రాశిని తెలుసు కొని కొంతవరకు ఫలితములు తెలుసుకొన వచ్చును.
గ్రహ బలము ఎంత బాగున్ననూ, గోచారము అనుకూలముగా లేనిచో మానవులు శుభ ఫలితములను పొందజాలరు. గోచారములో గ్రహములు జన్మరాశినుండి వివిధ స్థానములలో ఉన్నప్పుడు ఫలితములు ఏవిధముగా కలుగ చేస్తాయి .
30, ఏప్రిల్ 2021, శుక్రవారం
నక్షత్రాలలో రోగారంభం - రోగం ఉండే రోజులు.
కృత్తికాసు యదా కశ్చిజ్జ్వరాది ప్రతిపద్యతే
నవరాత్రం
తదాపీడా త్రిరాత్రం రోహిణీషుచ
మృగశీర్షే
పంచరాత్ర మార్ద్రా ప్రాణ భయం తధా
పునర్వ
సూచ పుస్యశ్చ సప్తరాత్రం విధీయతే
నవరాత్రం
తధా శ్రేషాః శ్మశానంతం మఘాసుచ
ద్వేమాసౌ
ఫల్గునీచైవ హోత్తరాసు త్రిపంచకమ్
హస్తేన
జాయతే పక్షం చిత్తాచైవార్ధమాసకమ్
మాసద్వయం
తధా స్వాతీ విశాఖే పంచ వింశతిః
అనూరాధ
దశ ప్రోక్తా జ్యేష్ఠా చైవార్ధా మాసకమ్
మూలేచ
జాయతే మోక్షః పూర్వాషాడ స్త్రీ పంచకమ్
ఉత్తరే
దినా వింశత్యా ద్వేమాసౌ శ్రావణే తధా
ధనిష్ఠాయా
మర్ధమాసో వారుణేచ దశాహకమ్
పూర్వాభాద్ర
పడేమోక్ష ఉత్తరాసు త్రిపంచకమ్
రేవతీ
సప్తరాత్రంచ హ్యాహోరాత్రం తధాశ్వినీ
భరణీ తత్ క్షణేనైవ మరణంటు నసంశయః



