9, అక్టోబర్ 2018, మంగళవారం

రాహుగ్రహ దోష నివారణకు "దుర్గా బీస యంత్రం"

రాహుగ్రహ దోష నివారణకు "దుర్గా బీస యంత్రం"
జాతకచక్రంలో రాహు గ్రహా దోషాలు ఉన్నవారు దుర్గా బీస యంత్రాన్ని పూజించిన ఉపశమనం కలుగుతుంది. కాలసర్పదోషం(రాహు కేతువుల మద్య గ్రహాలు) ఉన్నవారు, నాగదోషం (పంచమంలో రాహు గ్రహం) ఉన్నవారు, జాతక చక్రంలో రాహు దశలు జరుగుతున్నప్పుడు దుర్గ బీస యంత్రాన్ని పూజించాలి.


జన్మరాశిలో గాని, జన్మ లగ్న జాతకంలో గాని రాహు గ్రహం శత్రు క్షేత్రాలలో ఉండి శుభగ్రహ దృష్టి లేనప్పుడు వారి శారీరక, మానసిక ప్రవర్తన సరిగా ఉండదు. మానసికమైన చికాకులు, ఆందోళనలు, తొందరపాటు నిర్ణయాలు, అపోహలు, చెడు వ్యసనాలకు బానిసలు అవుతారు. అలాంటి వారు రాహు కాలంలో దుర్గ బీస యంత్రాన్ని మొదటిసారి రాహుకాల దీపాలు పాదరస దుర్గాదేవి విగ్రహం ముందు వెలిగించి దుర్గా సప్తశ్లోకి చదివితే రాహు గ్రహం నుండి వచ్చే ఇబ్బందులను కొంతవరకు తగ్గించుకోవచ్చును.

ఎరుపు రంగు పూలతో దుర్గా యంత్రాన్ని అలంకరించి పూజించాలి. నేతి దీపంతో దీపారాధన చేస్తే చాలా మంచిది. అగరబత్తీతో దూపం చూపించాలి. దుర్గా బీస యంత్రానికి "దుర్గాసప్తశ్లోకి " చదువుతూ  కుంకుమార్చన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి.

''ఓం దుర్గే దుర్గ రక్షిణి స్వాహా'' అనునది దశాక్షరమంత్రము. ఈ విధానము ననుసరించి ఈ దశాక్షరమంత్రజపము చేయువానికి ఎవరినుండియు బాధలు కలుగవు. పూజించిన వారికి దురదృష్టకర ప్రమాదాల బారినుండి రక్షింపబడతారు. దుర్గా బీస యంత్రాన్ని పూజించిన వారికి శత్రుభాధల నుండి విముక్తి కలుగుతుంది.

చెడుకలలు రాకుండా ఉంటాయి. మోసం,  భ్రమ, అత్యాశ, దుఃఖము మొదలగు వాటివలన కలుగు ఇబ్బందులను తొలగిస్తుంది. చెడుదృష్టి, దీర్ఘకాల అనారోగ్యం, రాహుగ్రహ భాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇంటిలో నైరుతి దిక్కు దోషాలు ఉన్నవారు దుర్గా బీస యంత్రాన్ని పూజించిన వారికి ఆ దిక్కు దోషాల వలన కలుగు ఇబ్బందులు తొలుగుతాయి.

దుర్గా బీస యంత్రాన్ని పూజించిన వారికి రుణభాదలు తొలిగి ధనాభివృద్ధి కలుగుతుంది.  వ్యాపారస్ధలంలో ఉంచి పూజించిన వ్యాపారాభివృద్ధి, ధనాభివృద్ధి,  గౌరవాలు లభిస్తాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...