30, నవంబర్ 2018, శుక్రవారం

శనిగ్రహ దోష నివారణకు "Evil Eye"


శనిగ్రహ దోష నివారణకు "Evil Eye"

జాతకచక్రంలో శనిగ్రహ దోష నివారణకు “Evil Eye” బాగా ఉపయోగపడుతుంది. “Evil Eye” నరఘోష నివారణకు ఇంటికి గాని, వ్యాపార సంస్ధలలో గాని, ఆపీసులకు గాని బయటపక్కన తగిలిస్తే ఎటువంటి నరదృష్టి ప్రభావాలు ఉండవు. జాతకంలో నీచశని, జన్మ శని, ఎల్నాటిశని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని దశలు నడిచే వారు “Evil Eye” ఇంటికి గాని, గదికి గాని పశ్చిమ దిక్కు ఉంచి ప్రతి శనివారం ధూపం వేసిన శనిగ్రహ భాదల నుండి విముక్తి కలుగుతుంది. శని వాయు తత్త్వము కలిగి పడమర దిక్కును సూచించును.

వ్యాపార సంస్ధలలో నరదృష్టి, వీధిపోటు, స్తంభంపోటు, ఇతర వ్యాపార సంస్ధల నీడ పడుతున్న గుర్రాలతో ఉన్న “Evil Eye” ని షాపు సింహా ద్వారానికి ఎడమవైపు గాని, సింహా ద్వారానికి పైన గాని ఉంచిన అన్నీ దోషాలు తొలగి జనాకర్షణ, ధనాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి కలుగుతాయి. ఆపీస్సులో గాని, ఇతర ప్యాక్టరీలలో వర్కర్స్ ప్రాబ్లం, యంత్రాల రిపేర్లు వస్తున్న ఈ  “Evil Eye” ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇంటిలో తరచుగా ధనానికి ఇబ్బందులు కలుగుతున్న, పనులు ఆలస్యం అవుతున్న, కుటుంబ సభ్యుల మధ్య తరచుగా గొడవలు కలుగుతున్న, ఇంటిలో వస్తువులు తరచుగా పాడవుతున్న, పగులు తున్న, కనిపించకుండా పోతున్న, సేవకులు, పని వాళ్ళ వలన ఇబ్బందులు కలుగుతున్న, నరదృష్టి, వీధిపోటు సమస్యలు ఉన్న ఏనుగులతో ఉన్న   “Evil Eye” ని ఇంటి సింహా ద్వారానికి కుడి పక్కన లేదా సింహా ద్వారం పైన ఉంచిన శనిగ్రహ దోషాలు తొలగి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, ధనాభివృద్ధి, మానసిక ప్రశాంతత కలుగుతాయి.   

శనిగ్రహ దోష ప్రభావం ఎక్కువగా ఉన్నవారికి దీర్ఘకాల అనారోగ్యాలు, సరియైన నిద్ర,ఆకలి లేకపోవటం, చేస్తున్న పనిలో ఆటంకాలు ఎదుర్కోవటం, అవమానాలు ఉన్నవారు “Evil Eye” ఇంటిలో పశ్చిమ దిక్కున ఉంచిన శనిగ్రహ భాదల నుండి విముక్తి కలుగుతుంది. చదువుపై శ్రద్ధ లేని పిల్లల రూంలో “Evil Eye” ని ఉంచిన చదువుపై శ్రద్ధ కలుగుతుంది. అనారోగ్య భాదలు ఉన్న రోగి గదిలో “Evil Eye” కట్టిన రోగ నిరోదక శక్తి పెరిగి రోగం తొందరగా నయం అయ్యే అవకాశం ఉంది. అందుకే జ్యోతిష్య పండితులు నిద్ర సరిగా పట్టని వారికి, ఎక్కువ సమయం కంప్యూటర్ దగ్గర వుండే వాళ్ళ గదిలో బ్లూకలర్ బల్బ్ కాని, బ్లూకలర్ గ్లాస్ కాని ఉంచమంటారు.

శని పేరు చెప్పగానే ప్రజల మనస్సులలో ఒక విధమైన భయం. కానీ శని న్యాయమూర్తిలా వ్యవహరించి చెడు మార్గాన వెళ్ళే వ్యక్తిని దండించి సరియైన పంధాన నడిచే దారి చూపిస్తాడు సరియైన సమయంలో మంచి దెబ్బ కొట్టి వారిని చైతన్యవంతులను జేసి తిరిగి తప్పులు చేయకుండా ప్రత్యక్షంగా హెచ్చరిస్తాడు. శని వేసే శిక్షల వల్ల గాయం పైకి కనిపించిన ఆ వ్యక్తిలో మార్పు స్పష్టంగా దర్శనమిస్తుంది.
 
శని గోచారక్రమంలో రాశిచక్రాన్ని చుట్టి వచ్చుటకు ముప్పై సంవత్సరములు పడుతుంది . శని గ్రహము తనకక్ష్యలో పరి భ్రమణము చేస్తూన్నప్పుడు ఒక్కొక్క రాశిలో రెండున్నరసంవత్సరముల చొప్పున పన్నెండు రాశులలో ౩౦ సంవత్సరములు పడుతుంది.
 
ఆకారంలో శనిగ్రహం గురుగ్రహం కంటే చిన్నగ్రహం. శని సంచారం గోచారంలో చాలా నెమ్మదిగా ఉంటుంది. మిగతా గ్రహాలకంటే ఎక్కువ కాలం రాశిలో సంచరిస్తాడు కాబట్టి మానవుని జీవితంపై శనిప్రభావం అత్యధికంగా కనిపిస్తుంది. శని సుమారు 135 రోజుల వరకు సామాన్యవేగంతో సంచరించిన తరువాత 105 రోజుల వరకు వక్రమార్గంలో పయనించి ప్రభావితం చేస్తాడు. శని దృష్టి పశ్చిమంపై ఉండి అక్కడే అస్తమించడం వల్ల పడమర దిక్కుని శని దిక్కుగా చెప్తారు. శాంతి ప్రక్రియలు చేపట్టిన దోష ప్రభావం తగ్గి మేలు కలుగుతుంది.
 
శనివారం ఉదయం నువ్వులనూనెతో శరీరానికి మర్దన చేసుకొని స్నానం చేసి నువ్వులనూనెతో గాని, ఆముదం నూనెతో గాని తెలుపు లేదా నలుపు వత్తులను పడమర దిక్కున ఇనుప గరిటెలో శని దీపాన్ని పెట్టి దానికి నువ్వులు బెల్లం కలిపిన చిమ్మిళిని నైవేద్యం పెట్టాలి. తరువాత ఈ క్రింది శ్లోకం చదవాలి.
 
శని బాధా వినాశాయ ఘోర సంతాప హారిణే I
కనకాలయ వాసాయ భూతనాధాయతే నమః II
దారిద్ర్యజాతాన్ రోగాదీన్ బుద్ధిమాంద్యాది సంకటాన్ I
క్షిప్రం నాశయ హే దేవ!శని బాధా వినాశక II
భూత బాధా మహాదుఃఖ మధ్యవర్తిన మీశమాం I
పాలయ త్వం మహాబాహో సర్వదుఃఖ వినాశక II
అవాచ్యాని మహాదుఃఖ న్యమేయాని నిరంతరం I
సంభవంతి దురంతాని తాని నాశయమే ప్రభో II
మాయా మోహన్యానంతాని సర్వాణి కరుణాకర I
దూరి కురు సదాభక్త హృదయానందదాయక II
అనేక జన్మ సంభూతాన్ తాప పాపాన్ గుహేశ్వర I
చూర్ణీకురు కృపాసింధో సింధుజాకాంత నందతే II
ఉన్మాదోధ్భూత సంతాపా గాధకూపాద్మహేశ్వర I
హస్తావలంబం దత్వా మాం రక్షరక్ష శనైశ్చర II
దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యౌవనం I
దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే II
 
ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయాన్నే పఠించిన శనిదోషం తొలగిపోవును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...