31, ఆగస్టు 2016, బుధవారం

నవగ్రహ స్టోన్ గణపతులు

నవగ్రహ స్టోన్ గణపతులు

నవగ్రహ స్టోన్ గణపతులను పూజించిన వారికి నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. నవగ్రహ స్టోన్ గణపతులను ఆయా గ్రహాలకు సంబందించిన వారములందు పూజించిన సత్వర ఫలితాలు పొందుతారు. ఈ గణపతులను ఆయా గ్రహాలకు వర్తించు దాన్యములపైన వస్త్రం పరచి ఉంచి పుష్పాలు, గంధంతో అలంకరించి ధూప, దీప, నైవేద్యములు సమర్పించి “ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌఃగ్లౌంగాం శ్రీం హ్రీం దూం క్లీం గ్లౌం గ్లౌం గం గః మహా గణాధిపతయే నమః” అనే గణపతి మంత్రంతో పూజ చేసిన వారికి నవగ్రహదోషాలు, ఆటంకాలు తొలగిపోయి, ఆయా గ్రహాలు కలుగజేయు కార్యములందు విజయములు సిద్ధించును.

సన్‌స్టోన్ గణపతి
జాతకచక్రంలో రవి నీచలో ఉన్న, శత్రు రాశిలో ఉన్న, రవి దశ, అంతర్ధశ జరుగుతున్న వారు, ఎవరి జాతకంలో అయితే రవి బల హీనంగా ఉంటా డో వారికి అనారోగ్య ము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధు లు, తండ్రి తరుపు బంధు వులతో పడకపోవు ట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపో వుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొ నేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు సన్‌స్టోన్ గణపతిని పూజించిన రవిగ్రహ దోషాలు తొలగిపోవును.  సన్‌స్టోన్ గణపతిని పూజా మందిరంలో గోధుమలపై ఎర్ర వస్త్రంపై పరచి ఆదివారం రోజు గణపతిని ప్రతిష్ఠించి పూజ చేసిన వారికి  రవిగ్రహ దోషాలు తొలగిపోవును. వైద్యవృత్తిలో ఆటంకాలు ఉన్న, రాజకీయాలలో రాణింపు లేకున్నా, అదికారుల వేదింపులు ఉన్న, ప్రభుత్వ ఉద్యోగంలో ఆటంకాలు ఉన్న వారు సన్‌స్టోన్ గణపతిని పూజించాలి.

వాస్తు పురుషుని స్ధితి



వాస్తు పురుషుని స్ధితి 

వాస్తు పురుషుడు భాద్రపద బహుళ తదియ శనివారం కృత్తికా నక్షత్రం నందు వ్యతీపాత యోగం నడుచుచుండగా భద్ర కరణముల యొక్క మధ్యభాగమున వాస్తు పురుషుని ఉద్భవం జరిగింది. 

స్దిర వాస్తు పురుషుడు:- వాస్తు పురుషుడు అధోముఖంగా శయనిస్తూ ఈశాన్యంలో తల ఉంచి (వాస్తు పురుషుని శిరస్సు) పాదాలు నైరుతి భాగంలో ఉంటాయి. వాయువ్య, ఆగ్నేయ దిక్కులలో భుజాలు, మధ్యభాగంలో వక్ష స్ధలం, హస్తాలు ఉంటాయి. ఈ వాస్తు పురుషున్ని స్ధిర వాస్తు పురుషుడు అంటారు. 

30, ఆగస్టు 2016, మంగళవారం

పగడం (Coral)

కుజగ్రహదోష నివారణకు పగడం
              పగడానికి ప్రవాళం, విద్రుమం, అంగారకమణి, కుజప్రియా, రక్తాంగం, అబ్ధి, పల్లవ, రక్తముక్తి, లతామణి, మూంగా అని పిలుస్తారు. ప్రశస్తమైన పగడాలు అల్జీరియా, టునీషియా, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్ దేశాలయందు లభ్యమగును. ఇటాలియన్ పగడం ‘Polyp’ అనే సముద్రపు జంతువు యొక్క ఎరుపు వర్ణము గల అస్ధి పంజరం. దీనిని ప్రవాళ స్పటికం అంటారు. జీవశాస్త్రంలో దాని పేరు Coraligenfous Leopyhytes. పగడమునకు అధిపతి కుజుడు. పగడం కుజునికి ప్రీతి పాత్రమయినది.

27, ఆగస్టు 2016, శనివారం

గోచారంలో శని సంచార ఫలితాలు

గోచారంలో శని సంచార ఫలితాలు 

గోచారం అంటే ప్రస్తుతం గ్రహము చేయు సంచారం. పుట్టిన సమయానికి వున్న గ్రహముల స్థితి సమయలగ్నం ఆధారంగా మనం దశలు అంతర్దశలు నిర్ణయించి ఫలితాలు చెబుతాం. దానికి తోడుగా చంద్రరాశి జన్మరాశి ఆధారంగా చేసుకొని ప్రస్తుతం నడుస్తున్న గ్రహ సంచారం ఆధారంగానే చెప్పే ఫలితాలకు గోచారం అని పేరు. దశలు అంతర్దశలు ఆ సమయంలో వున్న గోచారం ఆధారం చేసుకొని ఫలిత నిర్ణయం చేస్తారు.గోచారంలో శని ముఖ్య పాత్ర వహిస్తాడు.గోచారంలో శని అత్యదికంగా రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు.

8, ఆగస్టు 2016, సోమవారం

జాతకచక్ర చిట్కాలు ద్వితీయ స్ధానం (ధన స్ధానం)



జాతకచక్ర చిట్కాలు ద్వితీయ స్ధానం (ధన స్ధానం)

ద్వితీయ స్ధానం ద్వారా కుటుంబం, ధనం, వాక్కు, అవతల వ్యక్తి మాటతీరుని బట్టి అతన్ని అంచనా వేయవచ్చును. కుటుంబ పోషణ, ప్రాధమిక విద్య, చేతిలో (నిల్వ) ఉన్న ధనం, అశుభ స్ధానంలో ఉన్న ద్వితీయాధితి దశ , ద్వితీయంలో ఉన్న అశుభగ్రహ దశ జరుగుతున్నప్పుడు కుటుంబ పోషణ బాధ్యత మీద పడవచ్చును. ద్వితీయంలోనూ భావప్రకటనా విద్య ఉన్నది. మొదలగునవి ముఖ్యమైన అంశాలు ద్వితీయ స్ధానం ద్వారా పరిశీలించవచ్చును. శుభగ్రహాల కలయిక వలన కొంత. చెడు ప్రభావం తగ్గుతుంది. శుభగ్రహాలు శుభ ఫలితాలను, అశుభగ్రహాలు అశుభ ఫలితాలను ఇస్తాయి. 

4, ఆగస్టు 2016, గురువారం

గృహ నిర్మాణం చేయవలసిన స్ధలం యొక్క ఉచ్చ నీచల (ఎత్తు పల్లాలు) ఫలితాలు



గృహ నిర్మాణం చేయవలసిన స్ధలం యొక్క ఉచ్చ నీచల (ఎత్తు పల్లాలు) ఫలితాలు 


వాస్తులో ఉచ్చ నీచలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆధునిక కాలంలో ఎత్తు పల్లాలకు అధిక ప్రాదాన్యతను ఇస్తూ చాలా ఎక్కువగా చూస్తున్నారు. ఉచ్చ నీచల విషయంలో వివిధ గ్రంధాలలోని శాస్త్రజ్ఞుల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. 

2, ఆగస్టు 2016, మంగళవారం

జ్యోతిష్య శాస్త్ర చిట్కాలు

జ్యోతిష్య శాస్త్ర చిట్కాలు

లగ్నం నుండి శరీర విషయాలు, చంద్ర లగ్నం నుండి మనోభావాలు, రవి లగ్నం నుండి మన ప్రయత్నం లేకుండా జరిగే సంఘటనలు పరిశీలించాలని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు.

గురువు, శుక్రుడు అగ్నితత్వ రాశులలో ఉండి, కుజ, శని దృష్టి ఉంటే ఒంటి మీదకు అమ్మవారు వస్తుంది.  మీన లగ్నానికి ద్వితీయ స్ధానంలో శుక్రుడు ఉంటే కంటికి సంబందించిన అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

భార్య ఆరోగ్య విషయాన్ని సప్తమ స్ధానం నుండి అష్టమాన్ని పరిశీలించాలి. మేనమామను చతుర్ధానికి తృతీయం చూడాలి.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...