బృహత్ పరాశర హోరశాస్త్రము తర్వాత అంతటి శ్రేష్టమైన కృతి జైమినీ సూత్రాలు .ఇందులో జైమినీ, బృహత్ పరాశర హోరశాస్త్రానికి టీకాతాత్పర్య సహిత విస్తృతమైన భాష్యాన్ని చెప్పి జైమినీ జోతిష్యశాస్త్రానికి శ్రీకారం చుట్టాడు. జైమిని మహాముని
జైమిని సూత్రం ప్రకారం సర్వ శుభా శుభ ఫలములను కలిగించు ఆత్మకారక గ్రహం ద్వారా
సమస్త ఫలితాలను పరిశోధించవచ్చును. ఆత్మకారక గ్రహం బలంగా ఉంటే అత్యంత శుభ ఫలితాలు
పొందవచ్చును. ఆత్మకారక గ్రహమునకు అతి తక్కువ భాగాలలో ఉన్న అంత్య గ్రహమునకు
మధ్యనున్న గ్రహములను మధ్యగ్రహములు లేదా ఉపగ్రహములు అంటారు. ఈ ఉపగ్రహములు ఎంతటి
బలమైనను ఆత్మకారక గ్రహం బలహీనముగా ఉన్నప్పుడూ తమ యొక్క శుభ ఫలితాలను సంపూర్ణముగా
ఇవ్వలేవు.
జాతకచక్రంలోని
రవ్యాది సప్త గ్రహాలలో సూర్యుడు మొదలు శనిగ్రహం వరకు ఏదైనా గ్రహం రాశిలో ఎక్కువ
డిగ్రీలు నడిచిన గ్రహం ఆత్మకారక గ్రహం అవుతుంది. ఒక రాశి 30 డిగ్రీలు ఉంటుంది. ఈ
ఆత్మకారక గ్రహం నవాంశ వర్గ చక్రంలో ఈ రాశిలో ఉందో ఆ రాశి కారకాంశ లగ్నం అవుతుంది. కారకాంశ
లగ్నంలో రాహు,కేతువులకు ప్రాదాన్యత లేదు. రవ్యాది సప్త గ్రహాలను స్వీకరించవలెను. రెండు
గ్రహాలకు డిగ్రీలు సమానముగా ఉన్నచో నిమిషాలు, సెకన్లు పరిగణలోకి తీసుకోవాలి.
నిమిషాలు, సెకన్లు రెండు సమానంగా వచ్చిన ఆ గ్రహాలకు స్వభావ సిద్ధమగు బలాన్ని
నిర్ణయించి పరిగణనలోకి తీసుకోవలెను. శని, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, చంద్రుడు, రవి
వరుసగా బలవంతులు. శని అందరి కంటే అతి తక్కువ స్వభావ సిద్ధముగా అతి తక్కువ
బలవంతుడని అర్ధం.
జైమిని
మహర్షి విరచిత “జైమిని సూత్రములు” గ్రంధమును ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని
గ్రంధంలోని ఇంకా ఎన్నో అద్భుత విషయాలను అవగాహన చేసుకోవచ్చును.
https://archive.org/details/Astroexperts.blogspot.com.JaiminiSutralu
ఒక
రాశిలో ఏక్కువ డిగ్రీలు నడచిన గ్రహం "ఆత్మకారక గ్రహం"
ఆత్మకారక గ్రహమునకు తక్కువ డిగ్రీలు నడచిన గ్రహం
"అమాత్య కారకుడు"
అమాత్య
కారకునకు తక్కువ డిగ్రీలు నడచిన గ్రహం "భాతృ కారకుడు"
భాతృకారకునకు
తక్కువ డిగ్రీలు నడచిన గ్రహం "మాతృకారకుడు"
మాతృకారకునకు
తక్కువ డిగ్రీలు నడచిన గ్రహం "పుత్రకారకుడు"
పుత్రకారకునకు
తక్కువ డిగ్రీలు నడచిన గ్రహం "జ్ఞాతి కారకుడు"
జ్ఞాతి
కారకునకు తక్కువ డిగ్రీలు నడచిన గ్రహం "ధార కారకుడు."
కారకాంశ
లగ్నం లగ్న కుండలి చక్రానికి
షష్టాష్టకాలలో ఉండరాదు. అలా ఉండటం వలన జీవితంలో ఎదుగుదల ఉండదు. కారకాంశ
లగ్నం ద్వారా ఉద్యోగం, వృత్తి తో పాటు వీటిలో ఉన్నత స్ధితి గురించి తెలుసుకోవచ్చు.
కారకాంశ
లగ్నానికి వ్యయాధిపతి మోక్ష కారకుడు అవుతాడు. కారకాంశ లగ్నానికి వ్యయాధిపతి ఏ
గ్రహం ఐతే అవుతుందో ఆ గ్రహాదేవతను పూజించటం వలన మోక్షప్రాప్తి కలుగుతుంది. కారకాంశ
లగ్న చక్రంలో వ్యయాధిపతి ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహం తెలియజేయు వారం (Day) సూర్యోదయం నుండి
సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండటం వలన పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది.
కారకాంశ
లగ్నం నుండి 12 వస్ధానంలో గురువు ఉన్న స్వర్గలోక ప్రాప్తి, బుధుడు ఉంటే జనలోక
ప్రాప్తి, చంద్రుడు ఉంటే మహార్ లోకప్రాప్తి, శుక్రుడు ఉంటే తపోలోక ప్రాప్తి, రవి ఉంటే సత్యలోక
ప్రాప్తి కలుగుతుంది. కారకాంశ లగ్నం నందు
గాని, కారకాంశ లగ్నానికి వ్యయ స్ధానంలో గాని పాపగ్రహాలు ఉన్న
యెడల శుభలోక ప్రాప్తి గాని, మోక్షం గాని కలుగదు.
కారకాంశ
లగ్నానికి పంచమ, నవమ స్ధానాలలో పాపగ్రహాలు ఉన్న మంత్ర శాస్త్రాలపైన ఆసక్తి ఉంటుంది. ఈ
పాపగ్రహాలపైన పాపగ్రహ దృష్టి ఉన్న క్షుద్రదేవతా ఉపాసన పైన ఆసక్తి కలగి ఉంటారు. శుభగ్రహ
దృష్టి ఉన్న ప్రజలకు ఉపయోగపడు శాస్త్రములందు ఆసక్తి కలగి ఉండును.
కారకాంశం
నందు రవి,
కేతువులు కలసి ఉన్న శివుని యందు భక్తి కలవారు గాను; చంద్ర, కేతువులు కలసి ఉన్న పార్వతి దేవి యందు భక్తి కలవారు గాను; శుక్ర, కేతువులు కలసి ఉన్న లక్ష్మీదేవి యందు భక్తి
కలవారు గాను; కుజ, కేతువులు కలసి ఉన్న
కుమారస్వామి యందు భక్తి కలవారు గాను; బుధ కేతువులు కలసి ఉన్న
విష్ణుమూర్తి యందు భక్తి కలవారుగాను; గురు, కేతువులు కలసి ఉన్న శివుని యందు భక్తి కలవారుగాను;
రాహువు ఉన్న యెడల దుర్గాదేవి యందు భక్తి కలవారు గాను, కేతువు
ఉన్న యెడల గణపతి యందు భక్తి కలవారు గాను ఉంటారు.
మేషం
కారకాంశ అయిన దుఃఖం, వృషభ కారకాంశ అయిన సుఖం, మిధునం కారకాంశ అయిన చర్మవ్యాధులు, అధిక బరువు, కర్కాటకం కారకాంశ అయిన జలభయం, కుష్ఠు రోగాలు, సింహం కారకాంశ అయిన జంతు భయాలు, కన్యారాశి కారకాంశ అయిన అగ్ని భయం, చర్మబాధలు, తులారాశి కారకాంశ అయిన వర్తక వాణిజ్యం అనుకూలం, వృశ్చిక
రాశి కారకాంశ అయిన జల, సర్ఫాదుల వలన ఇబ్బందులు, స్త్రీలకు స్తనములలో పాలు లేకుండుట, ధనస్సు కారకాంశ
అయిన వాహనము నుండి గాని, ఎత్తైన ప్రదేశము నుండి గాని క్రింద పడుట, మకర రాశి కారకాంశ అయిన చర్మము నందు కణితలు ఉండును, కుంభరాశి
కారకాంశ అయిన చెరువులు, రోడ్లు, ఆలయాలు, ఉద్యానవనాలు మొదలగు పుణ్య కార్యక్రమాలు చేయును, మీనరాశి
కారకాంశ అయిన మోక్ష ప్రాప్తి కలుగును, దేవుని యందు భక్తి కలిగి
ఉండును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి