14, సెప్టెంబర్ 2015, సోమవారం

ద్రేక్కాణ వర్గ చక్రం



 ద్రేక్కాణ వర్గ చక్రం వర్గ చక్రం ద్వారా రోగ నిర్ధారణ,నివారణ

జాతకచక్రంలో రాశిచక్రంలో గ్రహాలు గాని లగ్నం గాని  0° నుండి 10° లోపు ఉంటే ద్రేక్కాణ చక్రంలో అదేరాశిలోను,10°నుండి 20° లోపు గ్రహం గాని లగ్నం గాని  ఉంటే గ్రహాం ఉన్న రాశి నుండి పంచమ స్ధానంలోను,20° నుండి 30° లోపు గ్రహం గాని లగ్నం గాని  ఉంటే  గ్రహం ఉన్న రాశి నుండి నవమ స్ధానంలో గ్రహాలను పొందుపరచాలి.


ప్రదమద్రేక్కాణం (0° నుండి 10°)శిరస్సు నుండి కంఠం వరకు ఉన్న అవయవాలను తెలియజేస్తుంది.
ద్వితీయ ద్రేక్కాణం (10°నుండి 20°)కంఠం నుండి నాభి వరకు ఉన్న అవయవాలను తెలియజేస్తుంది.
తృతీయ ద్రేక్కాణం (20° నుండి 30°)నాభి నుండి కింది పాదాల వరకు ఉన్న అవయవాలను తెలియజేస్తుంది.

వైద్య జ్యోతిష్యంలో ద్రేక్కాణం ద్వారా శరీరంలో ఏ భాగానికి అనారోగ్యం కలుగుతుందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చును. ద్రేక్కాణ చక్రం ద్వారా జ్వరాలు,రోగాలు వాటి స్వభావం,వాటి తీవ్రత,రోగానికి ఉపశమనం మొదలుగునవి తెలుసుకోవచ్చును.

అదృశ్యార్ధ చక్రమైన లగ్నభావం నుండి సప్తమ భావం వరకు ఉన్న ఆరు భావాలు శరీరంలో కుడివైపు ఉన్న అవయవాలను తెలియజేస్తాయి.
దృశ్యార్ధచక్రమైన సప్తమ భావం నుండి ద్వాదశ భావం వరకు ఉన్నఆరు భావాలు ఎడమవైపు ఉన్న శరీరంలోని అవయవాలను తెలియజేస్తాయి.

ప్రధమ ద్రేక్కాణం (0° నుండి10°)
లగ్నం ఉన్న శిరస్సుని,
ద్వి,ద్వాదశ భావాలు నేత్రాలు
తృతీయ,ఏకాదశ భావాలు చెవులు,  
చతుర్ధ,దశమ భావాలు ముక్కు,
పంచమ,నవమ భావాలు చెంపలు,
షష్ఠమ,అష్ఠమ భావాలు దవడలు,
సప్తమ భావం నోరు.

ద్వితీయ ద్రేక్కాణం (10° నుండి 20°)
లగ్నం ఉన్న కంఠం,
ద్వి,ద్వాదశ భావాలు భుజాలు,
తృతీయ,ఏకాదశ భావాలు చేతులు,  
చతుర్ధ,దశమ భావాలు ప్రక్కటెముకలు,
పంచమ,నవమ భావాలు రొమ్ములు,
షష్ఠమ,అష్ఠమ భావాలు కడుపు,
సప్తమ భావం నాభి.

తృతీయ ద్రేక్కాణం (20° నుండి 30°)
లగ్నం ఉన్న పొత్తి కడుపు,
ద్వి,ద్వాదశ భావాలు జననేంద్రియాలు,
తృతీయ,ఏకాదశ భావాలు వృషణాలు,
చతుర్ధ,దశమ భావాలు తొడలు,
పంచమ,నవమ భావాలు మోకాళ్ళు,
షష్ఠమ,అష్ఠమ భావాలు పిక్కలు,
సప్తమ భావం పాదాలు.

రాశిచక్రంలోని లగ్నం గాని గ్రహాలు గాని ద్రేక్కాణ చక్రంలో లగ్నానికి 6,8,12 లోఉన్న ,శత్రు రాశిలో ఉన్న,శత్రు గ్రహ సంబందం ఉన్న,నీచలో ఉన్న,డ్బలమ్ లేకున్న,శుభగ్రహ దృష్టి లేకున్న ద్రేక్కాణ చక్ర విభజనలోని శరీర భాగాలకి అనారోగ్యం గాని అవయవ లోపం గాని వస్తాయి.

రోగ నివారణకు ద్వాదశాంశ అధిపతులకు పూజించటం ద్వారా రోగ నివృత్తి చేసుకోవచ్చును.ద్రేక్కాణం 10°ప్రమాణం ఉంటుంది.ఈ ద్రేక్కాణంలో 3° 20 నిమిషాల ప్రమాణంతో మూడు నవాంశలు ఉంటాయి. ఈ ద్రేక్కాణంలో 2° 30 నిమిషాల ప్రమాణంతో నాలుగు ద్వాదశాంశలు ఉంటాయి.

వాటి అధిపతులు గణపతి,అశ్వని కుమారులు,యముడు,సర్ప.

ప్రధమ,ద్వితీయ,తృతీయ ద్రేక్కాణం లో 2° 30 నిమిషాల ప్రమాణంలో ఏదైనా గ్రహం ఉన్న గణపతిని, ప్రధమ,ద్వితీయ,తృతీయ ద్రేక్కాణం లో 2° 30 నిమిషాల నుండి 4° 60 నిమిషాల ప్రమాణంలో గ్రహం ఉన్న అశ్వని కుమారులను, ప్రధమ,ద్వితీయ,తృతీయ ద్రేక్కాణం లో 4°60 నిమిషాల నుండి 7° 30 నిమిషాల ప్రమాణంలో గ్రహమున్న సూర్య కుమారుడైన యముడిని, ప్రధమ,ద్వితీయ,తృతీయ ద్రేక్కాణం లో 7° 30 నిమిషాల నుండి 10°ప్రమాణంలో గ్రహమున్న సర్ప దేవతలను,లేక విష్ణుమూర్తిని పూజించాలి.

ఈ ద్వాదశాంశ అధిపతులను పూజించటం ద్వారా రోగతీవ్రతను తగ్గించుకోవటమే కాకుండా రోగ నివృతి చేసుకోవచ్చును.

ద్రేక్కాణంలో మొదటి 5°లగ్నం గాని,చంద్రుడు గాని ,ఇతర గ్రహాలు గాని ఉంటే రోగం తొందరగా నయం అవుతుంది. రెండవ 5° లలో లగ్నం గాని,చంద్రుడు గాని ,ఇతర గ్రహాలు గాని ఉంటే రోగం తొందరగా నయం కాదు బాగా పరిహారాలు చెయ్యాలి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...