జాతకచక్రాన్ని పరిశీలించేటప్పుడు తప్పనిసరిగా వర్గచక్రాలను కూడా పరిశీలించాలి.హోరా వర్గ చక్రం ముఖ్యంగా,ధనం,కుటుంబం,మాట సంబందించిన విషయాలు తెలుసుకోవచ్చు.లగ్న చక్రంలోని ద్వితీయాది పతి ,లాభాధిపతి హోరా చక్రంలో ఉన్న స్ధానాన్ని బట్టి,అతని సంపాదించిన ధనం వినియోగపడుతుందా,కుటుంబానికి ఉపయోగపడతాడ,మాటకు విలువ ఉంటుందో
లేదో తెలుసుకోవచ్చును.
రాశిచక్రాన్ని రెండు భాగాలుగా విభజించటాన్ని హోరా చక్రం అంటారు.హోరాచక్రం
ద్వారా మనకు సంపదలను ఎదుర్కోవటం,ప్రవర్తన,కుటుంబంలో ఇతర
వ్యక్తులతో ఉండే సంబందాలు,ముఖ సౌందర్యం,గురించి తెలుసుకోవచ్చును.
రాశిచక్రంలో గ్రహాలు మొదటి 15°ఉంటే “దేవహోర”అని,15°నుండి 30°లలో గ్రహాలు ఉంటే “రాక్షస హోర” అని అంటారు.నైసర్గిక
పాపగ్రహాలు సింహారాశిలోని రవిహోరలో,నైసర్గిక శుభగ్రహాలు కర్కాటక రాశిలోని చంద్రహోరలో
ఉంటే మంచిది.రవి,కుజుడు,శని,రాహు,కేతువు పాప గ్రహాలు, చంద్రుడు,బుధుడు,గురువు, శుక్రుడుశుభ గ్రహాలు.
దేవహోరలో గ్రహాలు ఉంటే తెలివితేటలు,మంచి ప్రవర్తన,సహాయకుడుగా,ధనవంతులుగా,ఉదారమైన స్వభావం,గౌరవనీయంగా, దైవంపై నమ్మకంగా ఉంటారు.
రాక్షస హోరాలో ఎక్కువ గ్రహాలు ఉంటే క్రూరంగా,మూర్ఖపు పట్టుదల,కోపాలు,పగలు తీర్చుకునే విధంగా,స్వార్ధపూరితంగా ఆలోచన,దుర్భరమైన బ్రతుకు,ఆడంబరాలకు,అనవసరమైన వాటికి వృదాగా దనాన్ని ఖర్చు
చేస్తారు.వివాదాస్పద వ్యాఖ్యలు,ఇతరులను అవమానించటం చేస్తారు.
పాపగ్రాహాలు(రాక్షస గ్రహాలు) సూర్య హోరలో ఉంటే
సాహసోపేతంగా,ఎక్కువ శ్రమ,బలంగా,ధనవంతులుగా ఆశాపరులుగా,పోటితత్వం
కలవారుగా, కీర్తివంతులుగా తీర్చిదిద్దబడతారు.
శుభగ్రహాలు (దేవగ్రహాలు) చంద్రహోరలో ఉంటే తెలివితేటలు,దయ కలిగి ఉండటం,నిరాడంబరంగా,మేధో సామర్ధ్యం కలిగి ఉండటం,అదృష్టవంతులుగా,చెప్పినట్టుగా వినేవాళ్ళు,ఆకర్షించే విధంగా
మాట్లాడటం,కుటుంబాన్ని అన్నీ విధాలుగా
ఆదుకునేవారుగా తీర్చిదిద్దబడతారు.
రాశి చక్రంలో గ్రహం బేసిరాశిలో మొదటి 15° ఉంటే రవిహోర,అనగా సింహారాశిలో గ్రహాలు వెయ్యాలి,బేసిరాశిలో 15° నుండి 30° లలో గ్రహం ఉంటే
చంద్ర హోరా అనగా కర్కాటక రాశిలో గ్రహాలు వెయ్యాలి.
అదేవిధంగా రాశిచక్రంలో గ్రహం సరిరాశిలో మొదటి 15° ఉంటే చంద్ర హోర
లో అనగా కర్కాటకంలో,సరిరాశిలో 15° నుండి 30°లలో గ్రహాలు ఉంటే
రవిహోరలో అనగా సింహరాశిలో గ్రహాలు వెయ్యాలి.
సత్యాచార్యడు గ్రహం మొదటిహోరలో ఉంటే హోరాచక్రంలో అదే రాశిలోను,గ్రహం రెండవ హోరాలో ఉంటే 11 వ రాశిలోను వెయ్యాలని తెలియజేశారు.
హోరా లగ్నం రవి హోరలో ఉంటే స్వశక్తితో సంపాదిస్తారు.చిన్నతనంలో ఇబ్బందులు
పడ్డా తరువాత అంచలంచాలుగా ఎదుగుతారు.జీవితంలోని ద్వితీయార్ధంలో ధనార్జన చేస్తారు.నేత్ర సమస్యలు ఎదుర్కొంటారు.కఠినంగా మాట్లాడుతారు.క్రూరంగా
ప్రవర్తిస్తారు. ఆకతాయులుగా,పోకిరితనంగా,స్వ సౌఖ్యతను కోరేవారుగా ,మోసం చేసే వారుగా
మోసపూరితంగా సంపాదిస్తారు.
హోరా లగ్నం చంద్ర హోరలో ఉంటే చిన్నతనం నుండే ధనార్జన కలుగును.స్ధిరాస్తులు సంపాదిస్తారు.భక్తి భావన,సంపద,గౌరవాలు,కీర్తి
ప్రతిష్ఠలు,ప్రశాంతమైన జీవితం,ఔదార్యం,ఇతరులకు సహాయకారిగా,ప్రేమాభిమానాలు చూపిస్తూ,సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందురు.పిల్లల విషయంలో అసంతృప్తి,సంపాదన విషయంలో ఒడిదుడుకులు
ఎదుర్కోంటారు.
సూర్యుడు సూర్య హోరలో ఉంటే విద్యావంతులుగా,దైర్యవంతులుగా,అధికారులుగా,నియమబద్ధంగా, విజయ వంతులుగా,ఆద్యాత్మికంగా,మంచి మనస్సు కల వారుగా ఉంటారు.
చంద్రుడు సూర్య హోరలో తెలివితక్కువగా,విద్యాహీనులుగా,భార్య భర్తలు ఇద్దరి మద్య గొడవలు,స్నేహితుల మద్య విరోదాలు,బందువుల మధ్య
అపవాదులు ఎదుర్కొంటారు.
కుజుడు సూర్య హోరలో ఉంటే దైర్యవంతులుగా,శక్తి వంతులుగా,కష్ఠమైన పనులు చేస్తారు.వంశోద్దారకుడు, సౌఖ్యవంతమైన జీవితం అనుభవిస్తారు.
బుదుడు సూర్య హోరలో ఉంటే పేదరికంతో,వాగ్వివాదులుగా,నీచంగా,దుర్మార్గులుగా,మంద బుద్ది,తప్పుడు దస్తావేజులు సృష్టిస్తారు.
గురువు సూర్యహోరలో ఉంటే దీర్ఘ కాలంగా భాద పడటం,అకాలపు
మృత్యుభయాలు,తిండిపోతులుగా,విపరీతమైన కోపంగా,రహస్య ప్రవర్తన కలిగి ఉంటారు.
శుక్రుడు సూర్య హోరలో ఉంటే పోకిరికిగా,వ్యామోహాలు కలిగి ఉంటారు.నాస్తికులు,తలవంపులు తెస్తారు.కామవాంచకులుగా ఉంటారు.
శని సూర్యహోరలో ఉంటే మొండితనం,వ్యభిచారులుగా,మర్యాద కోల్పోవటం,అసభ్యకరంగా ప్రవర్తించటం చేస్తారు.
సూర్యుడు చంద్రహోరలో ఉంటే హుందాతనంగా,ధైర్యంగా,వైవాహిక సౌఖ్యత ఉండదు,ఆద్యాత్మికత,సభ్యత కలిగి ఉంటారు.ఆరోగ్యకరంగా ఉంటారు.శత్రువులు లేనివారుగా,ఒక సంస్ధకి ప్రతినిధిగా ఉంటారు.
చంద్రుడు చంద్రహోరలో ఉంటే అందమైన అమ్మాయిని ప్రేమిస్తారు,సహనం,ఆవేశపూరితంగా,చురుకుగా, స్నేహపూరకంగా,ఉపయోగకారిగా,ప్రజలకు ఉపయోగపడతాడు.
కుజుడు చంద్రహోరలో ఉంటే వివాహా భాగస్వామితో తెగతెంపులు,దీనావస్ధ,ధనాభివృద్ధి ఉంటుంది.
బుధుడు చంద్రహోరలో ఉంటే కీర్తివంతులుగా,తెలివిగా,ధర్మపరులుగా,ఆదరించేవారుగా,గొప్ప వక్తలుగా రాణిస్తారు.
గురువు చంద్రహోరలో ఉంటే గొప్ప విజ్ఞాని,పేరు ప్రఖ్యాతలు గడిస్తారు.ఆద్యాత్మికవేత్త,భాగ్యవంతులుగా, సహాయకారులుగా,అందంగా,మతపరమైన భోదనలు చేసేవారుగా
ఉంటారు.
శుక్రుడు చంద్రహోరలో ఉంటే కోపిష్ఠియైన భార్య,ప్రేమాభిమానం కలిగి
ఉంటారు.తెలివిగా,గొప్ప వ్యక్తుల
అభిమానాన్ని సంపాదిస్తారు.చిత్రలేఖనం,సంగీతం,నృత్యం,పాటలు పాడటంపై మక్కువ.పద్ధతిగా మాట్లాడటం,సమాజంలో వివేకవంతులుగా ఉంటారు.
శని చంద్రహోరలో ఉంటే రహస్య ప్రవర్తన,నిదానంగా మాట్లాడతారు,భక్తి భావాలు కలిగి ఉంటారు,ఆకర్షించుట,రమ్యంగా మాట్లాడుట.చేస్తారు.
హోరాలగ్నం లగ్న చక్రానికి ద్వితీయ,ఏకాదశ లగ్నం అయితే గొప్ప ధనవంతులుగా,గొప్ప కీర్తిప్రతిశ్తలు కలిగి గోరవప్రదమైన జీవనాన్ని కొనసాగిస్తారు.పూర్ణ
యోగ కారక గ్రహం (చతుర్ధ పంచమాదిపతులు,నవమ దశమాధిపతులు)సింహారాశిలో ఉంటే ధనం సంపాదిస్తాడు .నైసర్గిక శుభగ్రహలు సింహారాశిలో ఉంటే ఆర్జించిన ధనాన్ని నిలుపుకోలేడు.ఖర్చుచేస్తాడు.
హోరాలగ్నంలో శుభగ్రహాలైన గురువు,శుక్రుడు,బుధుడు ఉన్న ,3,6,10,11 ఉపచయ స్ధానాలలో ఉన్న సమాజంలో భాద్యతగల గొప్ప
వ్యక్తులుగా ,ధనవంతులుగా ,సంతోషకరంగా అభివృద్ధి చెందుతారు.హోరా
లగ్నంలో ఒకటి అంతకన్న ఎక్కువ శుభగ్రహాలు ఉన్న లగ్నం బలంగా ఉంటుంది.
హోరాలగ్నం లగ్న చక్రానికి 6,8,12 స్ధానాల్లో లో ఉన్న అపచాయాల్లో 2,5,9,10 ఉన్న దరిద్రులుగా,ధనానికి ఎప్పుడు లోటు ఉంటుంది.అవమానాలు అనుభవిస్తారు.చెడు వ్యసనాలపైనా మక్కువ.పిసినారిగా,అనాలోచితంగా ఉంటారు.
హోరాచక్రంలో శని,గురువుల కలయిక ధన విషయంలో మంచిది కాదు.శని,గురువులు సింహారాశిలో కలసి ఉంటే పిత్రార్జితం నిలువదు.శుక్ర,కేతువులుకలసి ఉంటే డబ్బును ఖర్చు పెట్టాడు.దాచిపెట్టి పిసినారిగా ఉండి ఎవరికో ఇచ్చి మోసపోతారు.బుధ,రాహువులు సింహారాశిలో ఉంటే ఎప్పుడు డబ్బు సంపాదించాలనే ఆశ ఉంటుంది.కుజుడు కర్కాటకరాశి లోనీచ కాబట్టి ధనాన్ని స్వార్ధపూరితంగా ఖర్చుచేస్తాడు.
గురువు,చంద్రుడు;శని ,కేతువులు గాని కర్కాటంలో
ఉంటే పెద్దల ఆస్తి నిలుపుకోలేరు కానీ విదేశాలలో వ్యాపారం ద్వారా గాని,ఉద్యోగం ద్వారా గాని సంపాదిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి