ఒక రాశిలో గాని,ఒక బావంలో గాని రెండు గ్రహాలు కలసినప్పుడు గ్రహ సంయోగమవుతుంది.రెండు గ్రహాల మద్య అవది లేనప్పుడు (దూరం) వాటి ప్రభావం
విశేషంగా ఉంటుంది.ఆ రెండు గ్రహాల స్వభావం,కారకత్వం,రాశితత్వం అవి ఏ
భావాలకు ఆదిపత్యం వహించాయో ఆ భావాలు,ఏ భావంలో కలిసాయో ఆ భావానికి చెందిన
విషయాలపై ప్రభావం చూపిస్తాయి.
ఒకే డిగ్రీలో రెండు గ్రహాలు కలసినప్పుడు అది స్పష్టమైన సంయోగమవుతుంది.అయితే
సంయోగానికి ముందుఆ తరువాత 8° వరకు గ్రహ సంయోగ ప్రభావం ఉంటుంది.
సూర్య చంద్రుల విషయంలో ఈ దీప్తాంశలు
ఎక్కువ.సూర్యుడు మరొక గ్రహాన్ని సమీపిస్తున్నప్పుడు సంయోగ డిగ్రీకి 12° ముందు నుండి
దీప్తాంశ ప్రారంభమై సంయోగం చెందిన డిగ్రీ నుండి 17° వరకు
వ్యాపిస్తుంది.చంద్రుని దీప్తాంశ సంయోగ డిగ్రీకి 8°ముందు నుండి
ప్రారంభమై సంయోగ డిగ్రీ నుండి 12° వరకు వ్యాపిస్తుంది.చంద్రుడు ఉన్న నక్షత్రం (ఒకే పాదం)నందు గ్రహం ఉన్న చంద్ర సగ్రహ దోషం ఏర్పడును.
ఇతర గ్రహాల దీప్తాంశ సంయోగ డిగ్రీకి 8°ల ముందు నుండి సంయోగమైన తరువాత 8°ల వరకు ఉంటుంది.ఒక
గ్రహం మరియొక గ్రహాన్ని సమీపిస్తున్నప్పుడు కలసినప్పుడు దాని ప్రభావం అదికంగా
ఉంటుంది.కలసి విడిపోయిన తరువాత అంత ప్రభావం ఉండదు.
ఉదా:-పైన ఉన్న జాతకచక్రంలో కన్యాలగ్నం
లో సూర్యుడు,బుదుడు,రాహువు గ్రహాలు ఉన్నాయి.
లగ్నం:-25° ల 14 నిమిషాల 25 సెకండ్లలో ఉన్నది.
సూర్యుడు :-18° ల 52 నిమిషాల 39 సెకెండ్లలో ఉన్నది.
బుధుడు:-22° ల 58 నిమిషాల 10 సెకెండ్లలో ఉన్నది.
రాహువు:-2° ల 16 నిమిషాల 14 సెకెండ్లలో ఉన్నది.
సూర్యుడికి ,బుధుడికి మద్య సంయోగ అవది 4° ల 6 నిమిషాలు సుమారుగా
ఉన్నది.కాబట్టి సూర్య,బుధ గ్రహాల మద్య సంయోగ అవది 8° ల కంటే తక్కువ ఉన్నది
కాబట్టి ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం జాతకంలో విశేషంగా ఉంటుంది.
రాహు,సూర్య గ్రహాల మద్య 16° ల అవది ఉండటం వలన
జాతకంపై ఈ రెండు గ్రహాల సంయోగ ప్రభావం తక్కువ.అదే విధంగా రాహు ,బుధ గ్రహాల మద్య 20° ల సంయోగ అవధి ఉండటం వలన జాతకంపై ఈ రెండు
గ్రహాల సంయోగ ప్రభావం తక్కువగా ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి