దృవ
నక్షత్రాలు:-ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,రోహిణి
నక్షత్రాలు.స్ధిరమైన పనులు చేయుటకు పనికి వస్తాయి.నూతన కార్యములు కాకుండా
ఉన్నవి.ఉదా:-గృహ నిర్మాణం,ఉద్యోగం.
చర
నక్షత్రాలు:-స్వాతి,పునర్వసు,శ్రవణం,ధనిష్ఠ,శతభిష నక్షత్రాలు చర నక్షత్రాలు.ఈ నక్షత్రాలలో యాత్రలు,విద్యా,వాహన చోదనం,వివాహం,గృహారంభం,నూతన కార్యములు.
ఉగ్ర
నక్షత్రాలు:-భరణి,మఖ,పుబ్బ,పూర్వాషాడ,పూర్వాభాద్ర నక్షత్రాలు ఉగ్ర నక్షత్రాలు.ఈ నక్షత్రాలు శుభ కార్యాలకు
మంచిది కాదు.ఆయుధాల ప్రయోగానికి,మందులు తయారు చేయటానికి
పనికి వస్తాయి.
మిశ్రమ
నక్షత్రాలు:-విశాఖ,కృత్తిక నక్షత్రాలు.ఇవి మిశ్రమ నక్షత్రాలు.ఇవి యజ్ఞ క్రియలు,దేవాలయ కార్యములు చేయుటకు మంచివి.నిప్పు,బాంబులు,పేలుడు పదార్ధాలు చేయుటకు మంచిది.
క్షిప్ర
నక్షత్రాలు:-అశ్విని,హస్త,పుష్యమి,అభిజిత్
నక్షత్రాలు క్షిప్ర నక్షత్రాలు.విద్యారంభానికి,అమ్మకాలకి,ఔషదాలు తీసుకొనుటకు,పనిలో సత్ఫలితాలు ఇచ్చే వాటికి,వెంటనే జరిగే పనులకు ఈ నక్షత్రాలు మంచివి.
మృదు
నక్షత్రాలు:- మృగశిర,రేవతి,చిత్త,అనురాధ నక్షత్రాలు
మృదునక్షత్రాలు.ఇవి లలిత కళలు,స్నేహం చేయటానికి ,నూతన వస్త్రాలు కొనటానికి,దరించటానికి,దౌత్య కార్యాలకు,వివాహములకు మంచిది.
దారుణ
నక్షత్రాలు:-మూల,జ్యేష్ఠ,ఆశ్లేష,ఆరుద్ర
నక్షత్రాలు దారుణ నక్షత్రాలు.ఈ నక్షత్రాలు హింస,దొంగతనం,ఆందోళన కార్యములకు,ఎదుటివారిని
జయించటానికి,తాంత్రిక విద్యలకు,చేతబడులు
చేయటానికి,ఇతరులను లొంగతీసుకోవటానికి పనికి వస్తాయి.
ఊర్ధ్వముఖ
నక్షత్రాలు:-ఆరుద్ర,పుష్యమి,శ్రవణం,ధనిష్ఠ,శతభిషం, రోహిణి ,ఉత్తరాత్రయ నక్షత్రాలు
వీటి దృష్టి ఆకాశం వైపుకు ఉంటుంది.కాబట్టి రాచ కార్యాలకు,వ్యవహారాలకు,గృహప్రవేశాలకు,దనుర్విద్యలకు,విమాన
చోదనం,గృహ నిర్మాణం,విత్తనాలు చల్లుటకు,దేవాలయ నిర్మాణాలు,రాకెట్ ప్రయోగాలకు మంచివి.
అధోముఖ
నక్షత్రాలు:-మూల,ఆశ్లేష,విశాఖ,కృత్తిక,పుబ్బ,పూర్వాషాడ,పూర్వాబాద్ర
నక్షత్రాలు వీటి దృష్టి క్రింది వైపుకు ఉంటుంది.బావులు త్రవ్వటానికి,నాగలి పట్టుటకు,పునాదులు త్రవ్వటానికి పనికి
వస్తాయి.
తిర్యఙ్మఖ నక్షత్రాలు:-మృగశిర,రేవతి,చిత్త,అనురాధ,హస్త,స్వాతి,పునర్వసు,అశ్విని,జ్యేష్ఠ ఇవి రోడ్లు వేయుటకు,ముందుకు సాగే వాటికి,ద్వజ స్తంభ ప్రతిష్ఠ,విగ్రహ ప్రతిష్ఠలకు మంచిది.
పంచక
నక్షత్రాలు:-ధనిష్ఠ,స్టాభిషం,పూర్వాభాద్ర,ఉత్తరాభాద్ర,రేవతి,శుభకార్యాలకు మంచిది.క్రూర కర్మలు
ప్రారంభించుటకు,సాహస కార్యములకు ఈ నక్షత్రాలు పనికి రావు.
గండ
నక్షత్రాలు:-ఆశ్లేష,మఖ,జ్యేష్ఠ,మూల,రేవతి,అశ్వని నక్షత్రాలలో
శిశువు జన్మించిన విశేషంగా గ్రహ శాంతులు చేయవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి