11, జూన్ 2015, గురువారం

వాస్తు శాస్త్రంలో వర్గులు వర్గాధిపతుల యొక్క ప్రాధాన్యత

వాస్తు శాస్త్రంలో వర్గులు వర్గాధిపతుల యొక్క ప్రాధాన్యత........

వాస్తు శాస్త్రంలో ‘అర్వణము’ అనే ఒక మాట ఉంది. అర్వణమూ అంటే అచ్చి రావటం. గ్రామాలూ, నగరాలూ, స్థలాలూ, క్షేత్రాలూ కొన్ని కొందరికి అచ్చి వస్తాయి. కొందరికి అచ్చిరావు. ఒకరికి పని చేసిన మందు మరొకరికి పని చేయకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు హాని కూడా చేయవచ్చు.


ఈ అర్వణం చూసే విధానం ‘కాలామృతం’ జ్యోతిర్నిబంధం, వాస్తు ప్రదీపం, జ్యోతిర్విధాభరణం, ముహూర్త రత్నాకరం వంటి గ్రంథాలలో ఒక్కొక్క విధానం చెప్పబడింది.

వాస్తు శాస్తర్రీత్యా అర్వణం చూసేటప్పుడు, జన్మనక్షత్రం కాకుండా నామ నక్షత్రమే చూడాలని శాస్త్రంలో నిర్దేశించారు.

దేశం గురించి,అనారోగ్య సమయాలలో,గ్రామం గురించి,గృహ ప్రవేశ విషయాలలో,సేవకుని స్వీకరించే విషయాలలో,దానం చేసేటప్పుడు నామరాశికి ప్రాదాన్యం ఇవ్వాలి.యాత్రలకు,వివాహ విషయాలలో జన్మ రాశి ప్రాదాన్యం పొందుతుంది.

వ్యక్తి పేరు యొక్క మొదటి అక్షరం ఏ వర్గునకు చెందినదో ఆవర్గు అతనికి స్వవర్గు అవుతుంది,అయిదవది శత్రు వర్గు అవుతుంది.

ఉదా:-రాజశేఖర్ అనే వ్యక్తికి ఏ దిక్కు శత్రు వర్గు అవుతుంది.పేరులో మొదటి అక్షరం "రా" ర అనే అక్షరం "య" వర్గులో ఉంది .ఉత్తరం "స్వ "వర్గు అవుతుంది.కాబట్టి అయిదవ వర్గు దక్షిణం శత్రు వర్గు అవుతుంది.కాబట్టి రాజశేఖర్ అనే వ్యక్తికి దక్షిణ దిక్కు పనికి రాదు.

1,3,6,7 వర్గులు శుభప్రదమైనవి.2,4,6,8 శుభప్రదమైనవి కావు.

స్వవర్గు - ధన లాభం
ద్వితీయ వర్గు - స్వల్ప లాభం
తృతీయ వర్గు - శుభ ప్రదం
చతుర్థ వర్గు - వ్యాధులు
పంచమ వర్గు - శత్రు క్షేత్రం
షష్టమ వర్గు - కలహ ప్రదం (మతాంతరంలో లక్ష్మీ ప్రదం)
సప్తమ వర్గు - సర్వ సౌభాగ్యం
అష్టమ వర్గు - మరణ ప్రదం

5 కామెంట్‌లు:

  1. నా పేరు కృష్ణ నాయక్ నా పేరు ఏ వర్గుకు చెందుతుంది

    రిప్లయితొలగించండి
  2. కృష్ణ ఏ వర్గుకు చెందుతుంది

    రిప్లయితొలగించండి
  3. నా పేరు వేంకట రమణ మూర్తి, నేను ఈ వర్గు కి చెండుతాను.

    రిప్లయితొలగించండి
  4. నా పేరు సౌజల్ కుమార్ ఎవర్గు వస్తుంది ఎదిక్కు శుభాన్ని ఇస్తుంది దయచేసి చెప్పండి

    రిప్లయితొలగించండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...