27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

త్రిజ్యేష్ఠా

త్రిజ్యేష్ఠా అంటే ఏమిటి........

త్రిజ్యేష్ఠ అనే అంశంలో నుండి ప్రారంభమైంది ఈ జ్యేష్ఠ మాసం జ్యేష్ఠుడి పెళ్లి అనే అంశం.
అయితే ముహూర్తాల విషయంలో వివాహం జ్యేష్ఠ మాసంలో శుభప్రదము అని చెప్పారు. 


‘మాఘ ఫాల్గుణ వైశాఖా జ్యేష్ఠ మాసాశ్శుభప్రదా’ అని జ్యేష్ఠ మాసం విశేషంగా చెప్పారు. అందునా మరొక విశేషం ఏమిటి చెప్పారు అంటే ‘జ్యేష్ఠమాసి కరగ్రహో నశుభకృత్ జ్యేష్ఠాంగనా పుత్రయో’ అని వున్నది. అనగా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులుగా పుట్టిన వధూవరులకు వివాహం చేయరాదు అని. 

ఈ మధ్యకాలంలో జ్యేష్ఠ మాసంలో పెళ్లి అనే విషయం ప్రస్తావనకు వస్తే మా అబ్బాయి ఇంటిలో పెద్దవాడు కావున జ్యేష్ఠ మాసంలో వివాహం చేయము అనేవారు. జ్యేష్ఠ మాసంలో వివాహం చేయవద్దని చెప్పేవారు ఎక్కువయ్యారు. 

అరుంధతి నక్షత్రం

అరుంధతి నక్షత్రం......

అరుంధతి జన్మవృత్తాంతం శివపురాణంలోనూ, భాగవత పురాణంలోనూ కనిపిస్తుంది.

"అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీసతి
తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం"

అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది - ఈ అయిదుగురు స్త్రీలు సదా వందనీయులని పై శ్లోకానికి అర్థం.

గ్రహాలు - హోరఫలాలు

గ్రహాలు - హోరఫలాలు.........

ప్రతిదినం సూర్యోదయ సూర్యాస్తమయ కాలాన్ని బట్టి ఒక గంటకాలం కలుపు కొని ఫలం చూడాలి. సూర్యోదయ సూర్యాస్త మయ మధ్యకాలాన్ని 12 చే భాగించగా ఎంతకాలం (టైమ్‌) వచ్చునో చూసుకుంటూ 12 కాలాలు చూసి ఫలాన్ని తెలుసుకోవాలి. అలాగే రాత్రి కాలం - ఫలాన్ని చూసుకోవాలి. ఈ హోరాకాలం ఆపద అనే సముద్రాన్ని దాటించే పడవ వంటిది.

ప్రయాణకాలంలో మంత్రిలాగా ఆలోచనలను తెలుపుతుంది. దీనికి మించిన శాస్తమ్రే లేదంటారు పెద్దలు. ప్రతిరోజు దీన్ని చూసి ప్రయాణించ డం సమస్త కార్యాలు చేయడం శుభం. శుభగ్రహ హోరలు శుభాన్ని, పాప గ్రహ హోరలు పాపఫలాన్ని ఇస్తాయి.

గజకేసరీ యోగం

గజకేసరీ యోగం అంటే ఏమిటి?

గజము అంటే ఏనుగు. కేసరీ అంటే సింహం. యోగం అంటే కలయిక. ఏనుగు సింహములు కలిసి ఉండటం అంటే జరిగే పని కాదు.

కలిసినప్పుడు యుద్ధం తప్పదు. కానీ ఏనుగు సింహములను ఒకచోట వుంచి సమాధానపరచగలిగిన స్థాయి సమన్వయకర్తగా ఈ యోగ జాతకులు ఉంటారు అని ఈ పేరు యోగమునకు పెట్టారేమో అని అనిపిస్తోంది. అయితే ‘గజకేసరీ సంజాతస్తేజస్వీ ధనవాన్ భవేత్ మేధావీ గుణసంపన్నో రాజాప్రియకరో నరః’ అని ఫలితం చెప్పారు.

18, ఫిబ్రవరి 2015, బుధవారం

శంఖమాల(Sanka Mala)

బార్యా భర్తల మద్య అన్యోన్యతకు శంఖమాల......

శ్రీ మహాలక్ష్మీకి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో శంఖం ఒకటి.శంఖాలను లక్ష్మీదేవి సోదరులగా భావిస్తారు.లక్ష్మీదేవి క్షీర సముద్ర రాజ తనయ .అంటే పాలకడలి లో జన్మించింది.శంఖం ఉన్నచోట తాను ఉంటాను అని విష్ణుమూర్తితో అంటుంది.

"వాసామి పద్మోత్పల శంఖ మధ్యే ,వాసామి చందేచా మహేశ్వరేచ " పద్మాలు,శంఖాలు ఉండేచోట ,చంద్రుడు,శివుడు ఉండే చోట ఉంటాను అని లక్ష్మీదేవి చెబుతుంది.శంఖం గురుంచి వేదాలలో "శంఖేవ హత్య రాక్షసః" శంఖం వలన రాక్షసులు నశిస్తారు.అని అదర్వణ వేదంలో ఉంటుంది.

4, ఫిబ్రవరి 2015, బుధవారం

నవగ్రహ ముద్రలు (Navagraha Mudras)

నవగ్రహ దోష నివారణకు నవగ్రహ ముద్రలు 


వ్యాధులు తగ్గించడానికి ఆయుర్వేద మందులు ఎంత బాగా పని చేస్తాయో అంత కంటే ముద్రలు వేసి ధ్యానం చేస్తే వ్యాధులు వేగంగా తగ్గుతాయి. కొన్ని సార్లు కేవలం ముద్రలు వల్లే వ్యాధులు తగ్గినట్లు అనుభవాలు వున్నాయి.ఆసనాల కంటే ముద్రలు లోతైనవి. ఇవి శరీరాంగాలకు అతీత శక్తులకు సంబంధించినవి. వాటి ద్వారా జ్ఞానేంద్రియాలను ప్రభావితం చేసి లోపాలను సవరించవచ్చును. 

1, ఫిబ్రవరి 2015, ఆదివారం

పాదరస బాణ లింగం (Parad Banalingam)

పాదరస బాణ లింగం

ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి వుంటుంది. అటువంటి శివలింగాలలో పాదరస బాణ లింగం కూడా ఎంతో ముఖ్యమైంది. శివలింగాలలోనే ఈ పాదరస బాణ లింగం ఎంతో శక్తివంతమైంది.

కార్తీకమాసం శివుడికి ఇష్టమైన నెల. ఆ నెలరోజులూ పాదరస బాణ లింగాన్ని పూజించినట్లయితే ఎంతో పుణ్యం సుఖసంతోషాలను, సర్వ సంపదలను సొంతం చేసుకోవచ్చు.పాదరస బాణ లింగం దర్శనం వల్ల కోట్లాది శివలింగాలను దర్శించిన ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. పాలు, పచ్చ కర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వులతో ప్రతిరోజు పాదరస బాణ లింగానికి పూజలు జరుపుతారు.

నవగ్రహ పీడా పరిహార స్తోత్రం

నవగ్రహ పీడా పరిహార స్తోత్రం

ప్రతిరోజూ ఈ నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని ఉదయాన్నే తొమ్మిదిసార్లు పఠిస్తే గ్రహపీడ తొలగి, కార్యసిద్ధి కలుగుతుంది.

నక్షత్ర మంత్రాలు (Nakshatra Mantralu)


నక్షత్రాల మంత్రాలను, వారి వారి నక్షత్రాలను బట్టి, రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

అశ్వని: అశ్వినా తేజసాచక్షు: ప్రాణన సరస్వతీ వీర్యమ్‌|

వాచేంద్రో బలేనేంద్రాయ దఘరింద్రయమ్‌||

భరణి: యమాయ త్వాంగిరస్యతే పితృమతే స్వాహా స్వాహా|

ధర్మాయ స్వాహా ధర్యపుత్రే||

పునుగు (Punugu)

పునుగు

అత్యంత అరుదుగా లభించే సుగంద ద్రవ్యాలకు కారకుడు శుక్రగ్రహం. పునుగు,జవ్వాది,కస్తూరి, గోరోచనం మొదలగు సుగందద్రవ్యాలు శుక్రగ్రహ కారకత్వాన్ని తెలియజేస్తాయి.జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు పునుగు పిల్లి తైలంతో అభిషేకం చేస్తే శుక్రగ్రహ దోష నివారణ జరుగుతుంది.

పునుగు పిల్లి మర్మాంగాల ద్వార వెలువడే స్రవమే పునుగు. తిరుపతి వెంకన్నకు ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత కాస్తంత పునుగు తైలాన్ని విగ్రహానికి పులుముతారు.

"అత్తారు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో" అంటాడు అన్నమాచార్య.

పంచముఖి రుద్రాక్ష (5 Face Rudraksha)

గురుగ్రహ దోష నివారణకు పంచముఖి రుద్రాక్ష
 

 పంచముఖి రుద్రాక్ష అయిదు ముఖాలు కలిగి ఉంటుంది. అన్నింటికంటే పంచముఖి రుద్రాక్ష ధారణం చాలా మంచిదని పెద్దలు చెబు తారు. పంచాక్షరీమంత్రానికి, పంచభూత ప్రతీకగా కూడా పంచముఖి రుద్రాక్షను అభివర్ణి స్తారు. అలాగే, పరమేశ్వరునికున్న ఐదుముఖాలనూ ఈ రుద్రాక్ష ప్రతిబిం బిస్తుందంటారు. దీన్నిబట్టి పంచముఖి ధారణం అన్ని విధాలా ఎంతో శ్రేయస్కర మైనదని చెప్పవచ్చు.

సప్తముఖి రుద్రాక్ష (7 Face Rudraksha)

శనిగ్రహ దోష నివారణకు సప్తముఖి రుద్రాక్ష

సప్తముఖి రుద్రాక్ష మన్మధుని రూపం ,జాతకచక్రంలో శనిగ్రహ దోష నివారణకు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి. శరీరంలో తీసుకున్న పదార్ధం గాని,వాయువు గాని బయటకు పంపే విసర్జక వ్యవస్ధకు అధిపతి శని.ఇది పనిచేయకపోతే అన్నింటా బద్ధకమే అంతా అనారోగ్యమే. మలబద్దకానికి శని కారకుడు.అందుకే ఉదయాన్నే వాకింగ్ గాని,మేడిటేషన్ గాని చెయ్యాలి.మలబద్దక నివారణకు సప్తముఖి రుద్రాక్షను రాత్రి కాపర్ గ్లాస్ లో ఉంచి ఉదయాన్నే ఆ నీటిని త్రాగవలెను.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...