ఆగ్నేయమూలకు గ్రహాధిపతి శుక్రుడు.
పాలకుడు అగ్నిదేవుడు. వాహనము మేక. శుక్రుడు (రాక్షస గురువు). రాక్షసులకు ఉన్న వేగము, పాలకుడైన అగ్నిదేవునికి ఉన్న శక్తి ఈ ఆగ్నేయ మూలకు ఉన్నది. అందుచేత ఆగ్నేయమూలలో అతి పనికిరాదు. అన్ని మూలలు దిక్కులకంటే అత్యంత సూక్ష్మంగా ఆగ్నేయ దిక్కును చూసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం పొరపాటు చేసినా విపరీత పరిణామాలు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆగ్నేయభాగము ఏ దోషము లేకుండా చక్కగా ఉన్నట్లైతే ఆ ఇంట సంసార సుఖము, కీర్తి, విలాసవంతమైన జీవితము చేకూరుతుంది. ఆ ఇంట్లో పవిత్రత, భార్యాభర్తల మధ్ అనుబంధము, ఇంటి యజమానులు సుఖపడడం, ఇంటికి వచ్చిన అతిథులకు చక్కగా మర్యాద ఇవ్వడం, ఇంట స్త్రీకి మంచి గుర్తింపు లభించడం, భర్త యెడల స్త్రీకి సదభిప్రాయము, భర్తపై నమ్మకం, దాంపత్య జీవనం సుఖప్రదంగా సాగడం వంటి శుభ పరిణామాలు సంభవిస్తాయి.

అదే ఆగ్నేయం నైరుతి కంటే ఎత్తుగా పెరిగినా, గోతులున్నా, ద్వారమున్నా
దోషమే. ఈ దోషాలతో భార్యాభర్తల మధ్య గొడవలు, గృహంలో కలహాలు, ఏ పనీ
జరగకపోవడం, అబార్షన్లు, ఆర్థిక నాశనం, మోసపోవడం, మోసం చేయడం, మెట్టినింటికి
వెళ్ళిన ఆడకూతురు పుట్టింటికి రావడం, మాట్లాడితే అల్లుళ్ల పెత్తనాలు వంటి
దుష్ఫలితాలుంటాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి