5, జనవరి 2015, సోమవారం

సంతాన దోష నివారణ


జాతకచక్రంలో సంతాన దోష నివారణకు 7 రకాల రసాలు.

జాతకచక్రంలో సంతానాన్ని పరిశీలించటానికి పంచమస్థానం,తొమ్మిదోస్ధానం,(పంచమాత్ పంచమం) (బావాత్ భావం), జాతకచక్రంలో పంచమం బాగలేకపోయిన నవమస్ధానం బాగున్న సంతానానికి ఎటువంటి దోషం ఉండదు.పంచమస్ధానం సంతానాన్ని తెలియజేస్తే నవమ స్ధానం సత్ సంతానాన్ని కలిగిస్తుంది.అంతేకాక గురుగ్రహాన్ని కూడ పరిశీలించాలి.



గురుగ్రహం పంచమంలో శత్రుక్షేత్రంలో ఉంటే కారకో బావనాశాయ అనే సూత్రం ప్రకారం సంతాన దోషం ఉంటుంది. అంతేకాక పంచమం,నవమంలో కేతువు,కుజుడు శత్రుక్షేత్రంలో ఉండి పాప గ్రహాల దృష్టి ఉంటే సంతానానికి ఇబ్బందులు ఉంటాయి.సంతానం ఉంటుందా లేదా మరే విదమైన ఇబ్బందులు ఉన్నాయో పురుషులకు బీజస్పుటం,స్త్రీలకు క్షేత్ర స్ఫుటం గణించి తెలుసుకోవచ్చును.ఇవేకాక సంతాన విషయాలను తెలుసుకోవటానికి సప్తాంశ వర్గచక్రాన్ని ముఖ్యంగా పరిశీలించాలి.

సప్తాంశ వర్గ చక్రం వ్యక్తి యొక్క సంతానం,సంతానమునకు సంబందించిన ముఖ్య విషయాలే కాకుండా సంతానదోషం ఏదైనా ఉంటే నివారణా మార్గాలను కూడ సప్తాంశ వర్గచక్రం ద్వారా తెలుసుకోవచ్చు.

ఒకరాశిలో ఏడవభాగమును సప్తాంశ అంటారు.అంటే 30 డిగ్రీలను 7 చే భాగించగా 4 డిగ్రీల 17 నిమిషాల 9 సెకెండ్లు ప్రమాణం ఉంటుంది.

రాశిచక్రంలో ఏదైనాగ్రహం బేసిరాశిలో ఉంటే అది ఎన్నో సప్తమాంశలో ఉందో అన్నీ రాశులను ఆదేస్ధానం నుండి లెక్కించి సప్తాంశ వర్గచక్రంలో వేయాలి.

అదే విధంగా ఏదైనాగ్రహం సరిరాశిలో ఉంటే అది ఎన్నో సప్తమాంశలో ఉందో ఆన్ని రాశులను ఆ రాశి యొక్క 7 వస్ధానం నుండి లెక్కించి సప్తాంశ వర్గ చక్రంలో వేయాలి.

రాశిలోని 7 సప్తాంశలకు 7 రకాల రసాలను అధిపతులుగా సంతానదోష నివారణకు వివరించారు.అవి

క్షారం(ఉప్పు),క్షీరం(పాలు),దధి(పెరుగు),ఘృత(నెయ్యి),ఇక్షు(చెరకురసం),మధు(తేనె),శుద్దజలం .

బేసిరాశిలోని 7 సప్తాంశలకు వరసగా క్షారం(ఉప్పు),క్షీరం(పాలు),దధి(పెరుగు),ఘృత(నెయ్యి), ఇక్షు(చెరకురసం), మధు(తేనె), శుద్దజలం.

సరిరాశిలోని 7 సప్తాంశలకు వరుసగా శుద్దజలం, మధు(తేనె), ఇక్షు(చెరకురసం), ఘృత(నెయ్యి), దధి(పెరుగు), క్షీరం(పాలు), క్షారం(ఉప్పు).

జాతకుని లగ్నాధిపతి,పంచమాధిపతి ఏఏ సప్తాంశలలో ఉన్నారో ఆ సప్తాంశ సూచించు రసమును శివలింగానికి అభిషేకించి ఆ రసమును స్వీకరించుట వలన ఖచ్చితంగా సంతానం కలుగుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...