7, జనవరి 2015, బుధవారం

గ్రహాల సంచారం

గ్రహాల సంచారం

ఒకొక్కరాశి 30 డిగ్రీల నిడివి కలిగి ఉంటుంది.12 రాశులుంటాయి .రాశి చక్రం మొత్తం 360 డిగ్రీలు ఉంటుంది.ప్రతి గ్రహాం రాశిలో ఉన్న 30 డిగ్రీలలో 27 డిగ్రీలు దాటిన తరువాత రాబోవు రాశిని చూచును.

రవి గ్రహాం(SUN):-ఒక్కొక్క రాశిలో నెల రోజులుండును.5 రోజులు ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.రవి రోజుకు "1"డిగ్రీ చొప్పున సంచారం జరుపును.


చంద్ర గ్రహాం(MOON):-ఒక్కొక్క రాశిలో రెండున్నర రోజులుండును.3 ఘడియలు (72 నిమిషాలు) ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.చంద్రుడు "1"డిగ్రీ కదలటానికి 1 గంట 48 నిమిషాలు పట్టును.ఆంటే రోజుకు 13 డిగ్రీల నుండి 15 డిగ్రీల వరకు సంచారం జరుపును.

కుజగ్రహాం(MARS):-ఒక్కొక్క రాశిలో సుమారు 45 రోజులుండును.8 రోజులు ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.రోజుకు 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు సంచారం జరుపును.

బుధగ్రహాం(MERCURY):-ఒక్కొక్క రాశిలో సుమారు నెల రోజులుండును.7 రోజులు ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.30 డిగ్రీలను దాటటానికి 27 రోజులు పట్టును.రోజుకు ఒకటిన్నర డిగ్రీలు సంచారం జరుపును.రవి నుండి 28 డిగ్రీలు దాటి ముందుకు గాని వెనుకకు గాని వెళ్ళడు.

గురుగ్రహాం(JUPITER):-ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం రోజులుండును.2 నెలల ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.రోజుకి 5 నుండి 15 నిమిషాల వరకు సంచారం జరుపును.

శుక్రగ్రహాం(VENUS):-ఒక్కొక్క రాశిలో సుమారు నెల రోజులుండును.7 రోజులు ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.రోజుకి 1 డిగ్రీ (65 నిమిషాల నుండి 85 నిమిషాల వరకు)సంచారం జరుపును.రవి నుండి 47 డిగ్రీలు దాటి ముందుకు గాని వెనుకకు గాని వెళ్ళడు.

శనిగ్రహాం(SATURN):-ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరములుండును.4 నెలలు ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.నెలకు ఒక డిగ్రీ చొప్పున రోజుకి 2 నిమిషాలు సంచారం జరుపును.

రాహు ,కేతు గ్రహాలు(RAHU,KETU):-ఒక్కొక్క రాశిలో ఒకటిన్నర సంవత్సరములుండును.3 నెలల ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును. రోజుకు 3 నిమిషాలు చొప్పున సంచారం జరుపును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...