6, అక్టోబర్ 2014, సోమవారం

ముత్యపు శంఖం(Moti Sanku)

చంద్రగ్రహ దోష నివారణకు ముత్యపు శంఖం .

ముత్యపు శంఖం శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు. ముత్యపు శంఖం తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ముత్యపు కాంతితో గుండ్రంగా ఉండే శంఖం ఇది. ముత్యపు శంఖం మేరువు ఆకారంలో పైన సన్నగా ఉండి కిందవైపు ఉదరం ఉంటుంది. ముత్యపు శంఖాలు కొన్ని పైన కోన తేలి ఉంటాయి.మరికొన్ని రంధ్రంతో ఉంటాయి.రంధ్రంతో ఉన్న ముత్యపు శంఖాలతోటి ద్వని(ఊద) చేయవచ్చు.

ముత్యపు శంఖాలని సోమవారం రోజు గాని ,శుక్రవారం రోజు గాని , దీపావళి,అక్షయతృతీయ రోజు పూజలు చేస్తారు. ముత్యపు శంఖాలు జ్యోతిష్యంలో చంద్రగ్రహానికి సంబందించినది కాబట్టి సోమవారం ప్రశస్తమైనది. 


పూజా విధానం :- ముత్యపు శంఖాన్ని ముందుగా గంగాజలంతోగాని,పసుపు నీళ్ళతో గాని శుద్ది చేసుకోవాలి. ముత్యపు శంఖాన్ని తెల్లటి వస్త్రంపైన గాని ,బియ్యంపైన గాని ,అష్టలక్ష్మి పీటం పైనగాని ఉంచి పూజచేయాలి.గంధం,కుంకుమ,పసుపు ,అక్షితలు సమర్పించి అష్టోత్తర శతనామావళి పూజాచేయాలి..ధూప,దీప నైవేద్యాలు,తాంబూలం సమర్పించి బియ్యపు గింజలను శంఖం లోపల వేయాలి.

ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై
ధనధాన్య సమృద్ధిం దేహిదేహి నమః


అనే మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరిస్తూ పూజించాలి.

శంఖ భస్మము వల్ల అనేక రోగాలు కూడా నయము అగుచున్నవి.శంఖాన్ని పూరించుట వల్ల శ్వాశకోశ రోగాలు నశిస్తాయి, బాగా గాలి ప్రసరణ జరిగి చురుకుగా కూడా ఉంటాము. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాదం వినిపిస్తుంది. 

శంఖం అనేది కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్, కార్బొనేట్లతో తయారౌతుంది. ఈ ధాతువులు మన శరీరానికి చేసే మేలు చాలా ఉంది. కాల్షియం ఎముకల ఎదుగుదలకి, మెదడు చురుకుగా పని చేయడానికీ, శరీరంలోని మలినాలని తొలగించడానికీ, కండరాల సంకోచ వ్యాకోచాలకీ అవసరం.

జాతక చక్రంలో చంద్రుడు 8 వ స్ధానంలో ఉన్న వారికి బాలారిష్ట దోషం ఉంటుంది.ఇలాంటి వారు చంద్రుడు జాతకచక్రం లో సరిగా లేనివారు తప్పకుండా ముత్యపు శంఖాన్ని పూజించుకోవటం చాలా మంచిది.

జాతకచక్రంలో చంద్రుడు నీచలో వున్నవారికి ,శత్రుక్షేత్రాలలో వున్నవారికి, అమావాస్య,పౌర్ణమి, రాహువుతో కలసిన చంద్రుడు ఉన్నవారు ముత్యపు శంఖాన్ని పూజించాలి.

 ముత్యపు శంఖంలోనీటిని పోసి రోజు తాగిన వారికి చంద్రగ్రహ దోషాలవలన కలిగే అనారోగ్యాలు తగ్గుతాయి.

 పూజచేసిన శంఖాన్ని బీరువాలో ధనం,బంగారం ఉండే చోట ఉంచితే ధనాభివృద్ధి ఉంటుంది.
ప్రతి సోమవారం భార్యాభర్తలు ముత్యపు శంఖాన్ని పూజాచేసి శంఖంలో పోసిన నీటిని తీర్ధ ప్రసాదంగా స్వీకరిస్తే పార్వతి పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొండటమే కాకుండా అన్యోన్నతని పొందుతారు.

వ్యాపారస్థలంలో ముత్యపు శంఖాన్ని తప్పకుండా పూజించుకున్న వారికి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.
బియ్యం వ్యాపారస్తులు,వాటర్ ప్లాంట్స్ ఉన్న వారు,హోటల్స్,మహిళా వృత్తులు చేసేవారు,ప్రజలకు ఉపయోగపడే వృత్తులు చేసే వారు ముత్యపు శంఖాన్ని పూజించాలి.

కొంతమంది జాతకచక్రంలో చంద్రుడు బాగా లేనివారు చిన్న విషయాలకు అలగటం ,భాద పడటం,ప్రతి చిన్న విషయాలకు మౌనవ్రతం చేస్తుంటారు.వీరు తప్పకుండా ముత్యపు శంఖాన్ని పూజించాలి.

కవిత్వం వ్రాసేవారు,పాలు,నీటికి సంబందించిన వ్యాపారులు,ముత్యపు శంఖాన్ని పూజించటం మంచిది.మతిమరుపు ఉన్నవారు ముత్యపు శంఖంలో నీటిని పోసి తాగటం మంచిది.

మూర్ఛ వ్యాదిగ్రస్తులు,పూనకం సమస్యలు ఉన్నవారు ముత్యపు శంఖాన్ని పూజించిన,శంఖలో నీటిని తాగిన వ్యాధి సమస్యలు నిదానముగా దూరమవును.

స్త్రీల ఋతుసమస్యలు,ప్రసవ సమస్యలు ఉన్న వారికి ముత్యపు శంఖాన్ని పూజించిన మంచి ఫలితాలు వస్తాయి.
హోటల్స్,పాలవ్యాపారం చేసేవారు లలితకళలు,కవులు,గాయకులు ముత్యపు శంఖాన్ని పూజించాలి.

  ముత్యపు శంఖం:-450.00 Small 1500.00 Big Size.

  పై  ముత్యపు శంఖం  కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.

Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...