17, అక్టోబర్ 2014, శుక్రవారం

స్పటికమాల (Crystal Mala) క్రిస్టల్‌ మాల

స్పటికమాల...

శుక్రగ్రహ దోషం ఉన్నవారు స్ఫటిక మాల ధారణ వల్ల కూడ జాతకులు శాంతిని అనుభవిస్తారని చెప్పబడింది.వివాహకారకుడు శుక్రుడు .వివాహం కాని వారు,వివాహం ఆలస్యం అవుతున్నవారు, వివాహం అయిన తరువాత దాంపత్య సౌఖ్యంలో ఇబ్బందులు ఎదుర్కోనేవారు శుక్రగ్రహనికి చెందిన స్పటిక మాలను ధరించటం మంచిది. 'స్ఫటికమంత స్వచ్ఛన' (క్రిస్టల్‌ క్లియర్‌) అనేపద ప్రయోగం మనం విని వున్నదే. నిర్మలమయిన మనస్సును స్ఫటికంతో పోలుస్తారు.

''మాలాకప్తాసనస్థ: స్ఫటిక మణి నిభై ర్మౌక్తికై ర్మండి తాఙ్గ:'' అంటూ శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రావళిలో స్పటికమణి గురించిన ప్రస్తావన వుంది. చాలామంది రుద్రాక్షలతో పాటు స్ఫటిక మాలను కూడ కంఠసీమలో ధరిస్తారు. 


జప పారాయ ణకు స్ఫటికమాలను వివిధ మతస్థులు ఉపయోగిస్తారు. స్పటిక మాలను సమస్త దేవతామూర్తులకు జపమాలగా ఉపయోగించవచ్చును. ముఖ్యంగా లలిత సహస్త్రనామం,లక్ష్మీ అష్టోత్తరం చేసే వారు స్పటికమాలను జపమాలగా ఉపయోగిస్తే సత్వర ఫలితాలు వస్తాయి.

స్ఫటికం ఓ మణిగా చెప్పబడింది. పారదర్శకంగా వుండటం ఈ రాయి ప్రత్యేకత. ద్రవరూపంలోని వస్తువు భూమి పొరల లోపల వివిధ పదార్థాలతో కలిసి, గట్టిపడి స్పటికంగా రూపాంతరం చెందుతుంది. జాతి స్ఫటికాలు ధారకునికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాయి. అధిక రక్తపోటు వున్నవారు గనక స్ఫటిక మాల ధరిస్తే వారి రక్త పీడనం శాంతించి స్వస్థత చేకూరుతుంది. స్ఫటికధారణ వల్ల దగ్గు, కాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధుల ఉపశమనం కలుగుతుంది.స్ఫటికం వల్ల ప్రీమెన్‌ స్ట్రువల్‌ సిండ్రోమ్‌ శాంతి స్తుంది. బిడ్డలు లేనివారికి సంతా న ప్రాప్తి కలుగు తుంది. స్పటికం ధరించడం వల్ల మగ వారిలో నపుంసకత్వం తొలగి పోతుందని తెలుస్తుంది.

చాల జబ్బులకు స్ఫటికాలను ఔషధంగా ఉపయోగిస్తారు. శరీరంపై ధరించడం వల్లను, ఇంట్లో పూజగదిలో వాటిని వుండచడం వల్లను ఉత్పన్న మయ్యే తరంగ ప్రకంపనల వల్ల, మానవ శరీరంలో వుండే కంటికి కనిపించని మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ప్రభావితమై ఆయా చక్రాల పరిధిలోని అవయవాలకు పరిపుష్టి చేకూరి ఆరోగ్యం స్వంతమౌతుంది.

స్ఫటిక మాలను కంఠ సీమలో ధరించడం వల్ల మనో వ్యాధులు, ఇద మిదంగా తెలయని రోగాలు బాధిస్తూ భయపూరిత వాతావరణం వుంటే ఆ భావన నిర్వీర్యమై ధారకునికి శారీరక, మానసిక స్వస్థత కలుగుతుంది. ధ్యాన ప్రక్రియలో స్ఫటిక మాల ధరించడం వల్ల తురీయ స్థితి తొందరగా చేరువయ్యే అవకాశం వుంది.

స్ఫటికాలను ఒక గ్లాసు పరిశుభ్రమయిన త్రాగునీటిలో వుంచి కొన్ని గంటల తర్వాత త్రాగటం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది.

 స్పటికమాల:-500.00 Small 1500.00 Big Size.

  పై  స్పటికమాల  కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.

Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.

1 కామెంట్‌:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...