జ్యోతిష్యంలో ధనాభివృద్ధికి ఇందులగ్నం ........
ఉత్తరకాలామృతంలో కాళిదాసు గ్రహాలకు స్ధిరకళలను ఇచ్చారు.వీటినే దృవాంకాలు అంటారు.
రాశిచక్రంలో లగ్నం నుండి నవమాధిపతి మరియు చంద్రుడి నుండి నవమాధిపతులను నిర్ణయించివాటికి ఇచ్చిన స్ధిరకళలను కలుపగా వచ్చిన సంఖ్యను 12 కంటే ఎక్కువ వస్తే 12 చేత భాగింపగా వచ్చు శేషం చంద్రుడి నుండి లెక్కింపగా వచ్చిన రాశి ఇందులగ్నం అవుతుంది.
ఇందులగ్నం వ్యక్తి యొక్క ఆర్ధికస్ధితి ,అభివృద్ధి,వ్యాపారాభివృద్ధిని తెలుపుతుంది.ఇందులగ్నంలో ఏ గ్రహాం ఉన్నా ,లగ్నాన్ని ఏ గ్రహాం చూస్తున్న ధనాభివృద్ధి బాగుంటుంది.
ఇందులగ్నం గ్రహా రహితంగా గాని,గ్రహాదృష్టి రహితంగా గాని ఉండరాదు.అలా ఉన్న యెడల ఇందులగ్నం యొక్క ప్రయోజనాలను జాతకుడు పొందలేడు.ఇందులగ్నంపై గోచార గురుడు సంచరించిన లేక చూచిన సాధారణంగా వచ్చే ధనం కాక అదనంగా ధనప్రాప్తి కలుగుతుంది.
ప్రస్తుతం గోచారంలో గురువు మిధునరాశి లో ఉన్నాడు.జూన్ 20 2014 తరువాత గోచారంలో గురువు కర్కాటకరాశిలో సంచారం జరుగుతుంది.గురువు కి కర్కాటకరాశి ఉచ్చ స్ధానం కావటం వలన కర్కాటకరాశి ఇందులగ్న జాతకులకు ఒక సంవత్సరం పాటు ఆదాయంలో స్ధిరత్వం,తక్కువ శ్రమతో ఎక్కువ ప్రతిఫలం పొందే అవకాశం ఉంటుంది.
ఇందులగ్నంలో గ్రహాలకు ఉన్న స్ధిర కళలు
సూర్యుడు:-30 కళలు
చంద్రుడు:-16 కళలు
కుజుడు:-6 కళలు
బుధుడు :-8 కళలు
గురువు:-10 కళలు
శుక్రుడు:-12 కళలు
శని :-1 కళ
ఇందులగ్నం నుండి ద్వితీయంలో గాని,లాభస్ధానంలో గాని గ్రహం దిగ్బలమ్ పొందితే దిగ్బలమ్ పొందిన గ్రహం సూచించు దిక్కులలో దన ఆదాయ మార్గాలు బాగా ఉంటాయి.
ఇందులగ్నం నుండి
ద్వితీయంలో గురువు ఉంటే ధనం సంపాదిస్తాడు గాని చేతిలో నిలుపుకోలేడు.కారకోబావనాశాయ
సూత్రం ప్రకారం భావ కారకుడు గురువు ద్వితీయ భావంలో ఉండటం మంచిది కాదు.
ఇందులగ్నాదిపతి
బలహీనమైతే(నీచ,అస్తంగత్వం,శత్రు క్షేత్రాలలో)దరిద్రం పడుతుంది.ఎంత కష్ట పడ్డ శ్రమకు తగ్గ ఫలితం
రాదు.
ఇందులగ్నాదిపతి,ద్వితీయాదిపతి,నవమాదిపతి,లాభాదిపతి హోరాచక్రంలో బలంగా ఉంటే ఏ పని చేసిన అదృష్టం కలసి వస్తుంది.
ఇందులగ్నాదిపతితో
కుజగ్రహ సంబందం ఉంటే భూమికి సంబందించిన(సివిల్,రియల్ ఎస్టేట్,వ్యవసాయం)
వ్యాపారాలలో బాగా రాణిస్తారు.
ఇందులగ్నాదిపతితో శుక్రగ్రహ
సంబందం ఉంటే బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ లో బాగా రాణిస్తారు. ఇందులగ్నాదిపతితో శని
కలసి 4 వస్ధానంలో ఉంటే గనులు,మైనింగ్ రంగాలలో బాగా రాణిస్తారు.
ఇందులగ్నానికి,ద్వితీయానికి,చతుర్దానికి
సంబందం ఉంటే స్ధిరాస్తులైన ఇల్లు,పొలాలు,బంగారం సంపాదించుకుంటాడు.
లగ్నాదిపతి,ఇందులగ్నాదిపతి శతృ ద్విద్వాదశాలలో
ఉన్న,శతృ షష్టాష్టకాలలో ఉన్న, ఇందులగ్నాదిపతి
షష్టమాదిపతి,వ్యయాదిపతులతో సంబందం ఉంటే దన సంబంద విషయాలలో
కోర్టు గొడవలు,వివాదాలు ఉంటాయి.
ఇందులగ్నంలో ఏదైనా
గ్రహం ఉచ్చ పొందితే ఆ గ్రహం యొక్క దశ అంతర్దశలలో జాతకుడు సంపాదించిన దనం అవసరాలకు
వినియోగపడుతుంది.
ఇందులగ్నాదిపతి హోరాచక్రంలో
స్వక్షేత్రంలో ఉంటే స్వ,ఇతరుల
సహకారంతో సంపాదిస్తాడు.మిత్ర క్షేత్రంలో ఉంటే అదృష్టం కలసి వస్తుంది.
ఇందులగ్నంలో
శత్రుగ్రహాలు ఉండి గురువు పాపగ్రహాలతో కలసి శతృ క్షేత్రంలో ఉన్న జాతకుడు
అక్రమార్గాల ద్వారా దనం సంపాదిస్తాడు.
ఇందులగ్నాదిపతి
హోరాచక్రంలో లగ్నంలోను,హోరా
లగ్నాదిపతి ఇందులగ్నంలోను ఉన్న, ఇందులగ్నాదిపతి హోరాచక్రంలో
లగ్నంలోను లాభాదిపతి ద్వితీయంలోను,ద్వితీయాదిపతి లాభంలో ఉన్న
ఆ జాతకుడు లక్ష్మీ పుత్రుడవుతాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి