పసుపు మాలలు |
పసుపు మాల |
పసుపు మాల
పసుపు మాల సాదారణంగా మనకు లభించే పసుపు కొమ్ములను మిషన్ ద్వారా రౌండ్ గా కట్
చేయబడి 108 పూసలతో మాలగా తయారుచేయబడి ఉంటుంది.పసుపు మాలను జాతకచక్రం లో గురుగ్రహాదోషం ఉన్నవారు
జపం చేయవచ్చును. లేదా మెడలో ధరించవచ్చును.
మెడలో ధరించినప్పుడు శరీరానికి పసుపు రంగు అవుతుంది కాబట్టి మాలకు తడితగలకుండా
వుంచవలెను.తడితగిలిన పురుగు పట్టటానికి
అవకాశం ఉంటుంది.మెడలో వేసుకొన్నప్పుడు తడి తగిలిన
వెంటనే ఆమాలను కొద్దిసేపు తడి ఆరిందాక ఎండలో ఉంచవలెను.జపం చేసిన తరువాత మాలను పచ్చకర్పూరంతో
పాటు ఒక బాక్స్ లో ఉంచవలెను.లేకుంటే పురుగు
పట్టటానికి అవకాశం ఉంటుంది.ఏమాలతో జపం
చేయదలచిన వారు మొదటసారిగా సాయిబాబాకిగాని,దత్తాత్రేయుడుకిగాని,హయగ్రీవుడుకిగాని ,గణపతికి గాని జపంచేసి తరువాత ఏ భగవంతుడికియైన జపంచేసుకోవచ్చు.
పసుపు మాలను మెడలో ధరించినవారికి
మనస్సు ఆహ్లాదంగా ఉండటమే కాకుండా చక్కటి ఆలోచన,సూక్ష్మ పరిశీలన జ్ఞానం కలిగి ఉంటారు.
పసుపుమాలను ధరించిన జపంచేసిన
నిత్యావసరాలకు సరిపడే ఆర్ధికాభివృద్ధిని కలిగి ఉంటారు.
చక్కటి మంత్రోచ్ఛారణ చేయుటకు,వాక్శుద్ధికి,బ్రాహ్మణులు తప్పనిసరిగా పసుపు మాలను ఉపయోగించవలెను..
జాతకచక్రంలో గురువు పంచమంలోను(సంతానదోషం),నవమంలోను(పితృదోషం)పాప స్ధానంలో ఉన్నప్పుడు
గురుగ్రహం ఉన్నప్పుడు తప్పకుండా పసుపుమాలను ఉపయోగించవలెను.
ఉన్నతవిద్యను అభ్యసించేవారు,న్యాయవాదవృత్తిలో ఉన్నవారు,ఆర్ధికసంబంధ లావాదేవీలు చేసే వారు పసుపుమాలను
ఉపయోగించవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి