పాదరస లక్ష్మీదేవి
పాదరస లక్ష్మీదేవిని పాదరసంలో వెండి
కలిపి లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని నియమ నిష్ఠలతో అనుభవమున్నవారు తయారుచేస్తారు. పూర్వం ఇంద్రుడు,కుబేరుడు,దిక్పాలకులు,వశిష్టుడు,విశ్వామిత్రుడు,ఆదిశంకరాచార్యుల వారు పాదరస లక్ష్మీదేవిని పూజించారని శాస్త్రాలు
చెబుతున్నాయి. పాదరస లక్ష్మీదేవి విగ్రహాలు
గొప్ప అతీంద్రియశక్తి కలిగి ఉంటాయి.యజుర్వేదంలో 108 రకాల లక్ష్మీదేవి అమ్మవారి విశిష్టతను
తెలిపారు అందులో పాదరస లక్ష్మీ దేవి విశిష్టత గురించి కూడా తెలియజేశారు.
పూజా విధానం :-ఉదయాన్నే స్నానం చేసిన
తరువాత పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని శుభ్రమైన నీటితో శుభ్రం
చేసిన తరువాత పవిత్ర గంగాజలంతోను,పచ్చిపాలతోను అభిషేకించాలి.ఇలా అభిషేకించిన నీటిని గాని,పాలనుగాని
త్రాగటానికి ఉపయోగపడవు.ఎందుకనగా పాదరసం ఎముకల
క్షీణతకు దోహదపడతాయి.పుష్పాలు,సుగంధ ద్రవ్యములు ,గంధం,స్వీట్స్,పండ్లు,తామరమాల మొదలైన పూజాద్రవ్యములు ఉపయోగించి
పూజ ప్రారంభించవలెను. శ్రీసూక్తం మంత్రం ఉపయోగించి
తామరమాలతో పూజాచేయవలెను.
ఉపయోగాలు:- పాదరస లక్ష్మీదేవిని
నిత్యం పూజచేసిన వారికి దీర్ఘకాలం సంపదను కలిగిస్తుంది.
పాదరస లక్ష్మీదేవిని పూజాచేసే
వారికి సమాజంలో గౌరవాలను,సంపదను,ఉన్నతవిద్యను కలిగిస్తుంది.
పాదరస లక్ష్మీదేవిని పూజిస్తే
మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా చంచలత్వం కూడా ఉండదు.
పాదరస లక్ష్మీదేవిని పూజించి
కార్యసాదనలో
ఎన్ని ప్రయత్నాలు చేసిన విజయం పొందని వారు
కూడా కార్యసాధనలో విజయం పొందవచ్చును.
పాదరస లక్ష్మీదేవి వాణిజ్య,వ్యాపార ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్రాధాన్యత
కలిగి ఉంది.షాపు లేదా వ్యాపారస్ధలంలో పాదరస
లక్ష్మీదేవిని ఉంచిన నిరంతర వ్యాపారాభివృద్ధి ఉండటమే కాకుండా ధానాభివృద్ధిని కలిగిస్తుంది.
పాదరస లక్ష్మీదేవిని జాతకచక్రంలో చంద్రుడు
,బుద్ధగ్రహా దోషాలు ఉన్నవారు తప్పక పూజించాలి.
🙏 🙏 🙏
రిప్లయితొలగించండి