20, ఆగస్టు 2013, మంగళవారం

బంగారు(పసుపు) వర్ణం కలిగిన సుదర్శన సాలగ్రామాలు(Sudarshana Saligramam)

బంగారు(పసుపు) వర్ణం కలిగిన సుదర్శన సాలగ్రామాలు
   సాలగ్రామాలకి హిందూమతంలో బారీ ప్రాముఖ్యత కలిగివుంది. సాలగ్రామాలు నేపాల్ లోని  ముక్తినాధ్ నందు గల కాలగండకినది నందు లభిస్తాయి. ఈ నదినే కృష్ణ గండకి అని కూడ పిలుస్తారు.సాలగ్రామాలు నలుపు రంగులో మాత్రమే లభిస్తాయి.వ్రిందా అనే మహిళ శాపం వలన సాలగ్రామాలు నలుపు రంగును కలిగి ఉన్నాయి అని పురాణాలలో ప్రస్తావించారు.

                                సాలగ్రామాలు వివిద రూపాలలో లభిస్తాయి. ఈ రూపాలు సహజసిద్దమైనవే గాని మానవనిర్మితమైనవి కావు.సాలగ్రామశిలని(రాయిని) వజ్ర కీటకాలు(నీటి కీటకాలు) తొలుస్తాయి. సుదర్శన సాలగ్రామాలు విష్ణు భగవానుడి యొక్క సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది.సుదర్శన సాలగ్రామం లోపల రెండు వైపుల విష్ణు భగవానుడి చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలిన చక్రాలు ఉంటాయి.కొన్ని సుదర్శన సాలగ్రామాల లోపల పసుపు,బంగారపు వర్ణం కలిగి ఉంటుంది.ఇవి చాలా అరుదుగా లభించే సాలగ్రామాలు. సాలగ్రామాల విశిష్టత గురించి స్కంద పురాణం ,పద్మ పురాణం లో వివరించబడింది.మహాభారతంలో శ్రీకృష్ణుడు యదుష్టుడుకి సుదర్శన సాలగ్రామం యొక్క విశిష్టత గురించి తెలియజేశాడు.
పూజా విధానం :- సాలగ్రామాలను ఏకాదశి,మహాశివరాత్రి,సోమవారం ,బుధవారం రోజులలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ రోజులలో ఉదయాన్నే స్నానం చేసిన తరువాత సుదర్శన సాలగ్రామాన్నిశుభ్రంగా నీటితో కడగాలి.పిదప సాలగ్రామాన్ని గంగాజలంతో శుభ్రం చేసి బియ్యంపైన గాని ,సుదర్శన యంత్రం పైన గాని,కూర్మ స్టాండ్ పైన గాని ,రాగి పాత్రపైన గాని ,ఇత్తడి పాత్ర పైన గాని ,వెండి పాత్రపైన గాని ఉంచాలి.పాలు,పెరుగు,నెయ్యి,తేనె,చెక్కెర మిశ్రమంగా కలిపి సుదర్శన సాలగ్రామాన్ని అభిషేకించాలి.పిదప విష్ణు సహస్త్రనామం చదువుతు పుష్పాలు,అక్షింతలతో సాలగ్రామాన్ని పూజ చేయాలి.సుదర్శన సాలగ్రామాన్ని ప్రతిరోజు అభిషేకం చేయాలి.ఎందుకనగా ఏయన అభిషేక ప్రియుడు కాబట్టి . ప్రతి రోజు అభిషేకం చేయటం వల్ల కానప్పుడు సుదర్శన సాలగ్రామాన్ని నీటిలో ఉండే విధంగా ఒక పాత్రలో నీటిని ఉంచి నది నీటిలో సాలగ్రామం ఏవిధంగా ఐతే ఉంటుందో అదే విధంగా నీటిలో ఉంచితే ఎటువంటి దోషం ఉండదు.
ఉపయోగాలు:-
సాలగ్రామాన్ని భక్తిశ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో, శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే, కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలానికి సమానమవుతుంది. మరియు కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామ పూజచే, శివకేశవులని పూజించిన ఫలితం కలుగుతుందిట.సుదర్శన సాలగ్రామాలు నిత్యం ఎవరైతే పూజిస్తారో వారు సుదీర్ఘకాలం ఆరోగ్యవంతులుగా ఉంటారు.

సుదర్శన సాలగ్రామాలు పూజించేవారికి మానసిక ఆందోళనలు ఉండవు.సూక్ష్మ పరిశీలన కలిగి ఉంటారు.సాలగ్రామం వున్న ప్రదేశాలలో స్నానం చేసినా, దానం చేసినా, కాశీ క్షేత్రంలో పవిత్ర గంగానదీ స్నానంకంటే, ఆ పుణ్యక్షేత్రంలో చేసిన దానం కంటే, నూరె రెట్లు అధి క ఫలము కలుగుతుంది. 

సుదర్శన సాలగ్రామాలు పూజించేవారికి గణితశాస్త్రంపై పట్టు సాదిస్తారు. జ్యోతిష్యం ,ఖగోళశాస్త్రం, లలితకళలు, చిత్రలేఖనం మొదలగు శాస్త్రాలలో ప్రావీణ్యం సంపాదిస్తారు.సాలగ్రామమును అభిషేకిం చిన పుణ్య బలాలను ప్రోక్షించుకొనినచో, సర్వపాపాల ను నశింపజేస్తుంది. సర్వరోగాలు తొలగిపోతాయి. సక ల సంపదలు కలుగుతాయి, సర్వశుభాలను కలిగించి, మోక్ష సామ్రాజ్యమును సిద్ధింపజేస్తుంది. 

సుదర్శన సాలగ్రామాలు పూజించేవారికి బహుభాషా ప్రావీణ్యం కలిగి ఉంటారు.వేద పాండిత్యం ,న్యాయవాద,ఆద్యాపక వృత్తులలో మంచిగా రాణిస్తారు.సాల గ్రామ తీర్థం సేవించినచో, వెయ్యిసార్లు పంచామృత మును సేవించిన ఫలితముకంటే, ప్రాయశ్చిత్తముల యందు ఆచరించు దానాలు ఫలితం కంటే అధిక ఫలి తం ఉంటుంది. కనీసం, సాలగ్రామాన్ని అర్చించు టకు మంత్రాదులు తెలియకున్నప్పటికీ, శక్తిననుసరించి పూర్తి భక్తివిశ్వాసాలతో పూజిస్తే, కొన్ని ఫలితాలైనా కలు గుతాయి. 

పూజాపీఠంలో సాలగ్రామమును ఉంచితే, సమస్తమైన పూజలు సక్రమంగా సాగి పరిపూర్ణ ఫలితాలను పొందుతారు. సుదర్శన సాలగ్రామాలు పూజించేవారికి వర్తకవాణిజ్యాలలో ,రత్నశాస్త్రంలోను, విద్యావ్యాపారంలోను మంచి పరిశీలన కలిగి ఉంటారు.సాలగ్రామాలు పగిలి నప్పటికీ, పెచ్చు పూడినప్పటికీ కూడా పూజార్హత కలిగి ఉంటాయి.

సుదర్శన సాలగ్రామాలు పూజించేవారి ఇంట్లో వారందరు మంచి విద్యావంతులుగా గౌరవించబడతారు.
సుదర్శన సాలగ్రామాలు పూజించేవారికి సుదీర్ఘకాలం ధనాభివృద్ధి కలిగి ఉంటారు.
సుదర్శన సాలగ్రామాలు వ్యాపారస్ధలంలో ఉంచి పూజించేవారికి వ్యాపారాభివృద్ధితోపాటు ధనాభివృద్ధి కలిగి ఉంటారు.సాలగ్రామ మును స్మరించినా, దర్శించినా, నమస్కరించినా, సర్వపాపాలు పరిహరింపబడతాయి.

2 కామెంట్‌లు:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...